ఆదిత్య దేవి కోసం స్కూల్ దగ్గర కి వెళ్తాడు.. దేవి ఆదిత్య తో ఏమైందమ్మా అలా ఉన్నావు అని అడుగుతాడు.. మా స్కూల్ లో అందరికీ వాళ్ళ నాన్నలు ఉన్నారు.. నాకే ఉన్నా మా అమ్మ ఆయన్ని కాదు అంది.. అమ్మ కాదు అంటుంది అది నిజమేమో అని ఆదిత్య అంటాడు.. తను తాగుబోతు.. గతంలో అమ్మను హింసించే వాడిని అమ్మ అతని దగ్గరకు రావడం లేదు.. నువ్వు ఒక్క మాట చెబితే అమ్మ నీ మాట వింటుంది ఆదిత్య తో అని దేవి అంటుంది.. సరే దేవి నాకు రెండు రోజులు టైం ఇవ్వు నేను అంతా చూసుకుంటాను అని ఆదిత్య అంటాడు..
రాధ స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురావాలని స్కూల్ దగ్గరకు వెళుతుంది కానీ స్కూల్లో దేవి ఉండదు స్కూల్ అంతా వెతికిన తర్వాత బేబీ ఫ్రెండ్ వచ్చి వాళ్ళ నాన్నతో పాటు కలిసి దేవి వెళ్లిందని చెబుతుంది వెంటనే ఆ విషయం ఆధిత్తితో చెప్పాలని వాళ్ళ ఆఫీసుకి వెళ్తుంది పెనిమిటి దేవి కనిపించడం లేదు అని చెబుతుంది అయితే నేను ఊహించింది జరిగిందన్నమాట అని ఆదిత్య అంటాడు దేవి చేతికి ఒక వాచ్ ఇచ్చాను అందులో జిపిఎస్ ట్రాక్ కనుక్కోనే విధంగా ఆ వాచ్ ని రెడీ చేయించను దేవి చేతికి ఆ వాచ్ ఉంటే తను ఎక్కడ ఉన్నా మనం తెలుసుకోవచ్చు నువ్వేమీ ఈ విషయం గురించి భయపడకు తను ఎక్కడ ఉందో మనకి క్షణాలు తెలుస్తుంది నేను దేవిని ఇంటికి తీసుకొస్తాను అని ఆదిత్య అంటడు సర్వేపల్లి నీకోసం బిడ్డకోసం ఇంటి దగ్గర నేను ఎదురు చూస్తూ ఉంటాను అని రాధా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది..
మాధవ్ వేసిన ప్లాన్ ప్రకారం.. దేవికి తండ్రి అని చెప్పుకుంటున్నా అతని దగ్గరే దేవి ఉంటుంది అతనికి జ్వరం ఉందని ఆరోగ్యం బాగోలేదని దేవి అతనికి సేవలు చేస్తుంది.. చాలమ్మా నువ్వు నాకు ఇలా సేవలు చేస్తుంటే నువ్వు ఎప్పటికీ నాతోనే ఉండాలని అనిపిస్తుంది.. నువ్వు దగ్గరగా ఉంటే నువ్వు నాతో ఉంటే చాలు అని అనిపిస్తుంది.. మీరు నాతోనే ఉండాలంటే నేను ఏం చేయాలి అని కపట నాటకం ఆడతాడు.. అతను దేవిని ఈ ఉచ్చులో నుంచి బయట పడేయడానికి ఆదిత్య ఏ విధంగా నిజం కక్కిస్తాడో తరువాయి భాగంలో చూద్దాం..