దేవిని దేవుడమ్మ వాళ్ళ ఇంట్లో దింపేసి రాధా మాధవ్ పని ఉందని వెళ్ళిపోతారు.. రాధ ఏంది ఎక్కడికో తీసుకుపోతా అని నా ఇంటికి తీసుకువెళ్ళవు అని మాధవ్ తో అంటుంది.. మనం పెళ్లి చేసుకోకపోయినా 10 సంవత్సారాలు ఓకే ఇంట్లో ఉంటున్న మన గురించి మీ అత్తయ్య కు తెలిస్తే.. నిన్ను మీ అత్తయ్య ఆ ఇంట్లోకి హారతి ఇచ్చి రమ్మని పీలుస్తుందా.. నువ్వు చెప్పే నిజం కన్నా నేను చెప్పే అబద్దం నమ్ముతుంది లోకం.. నీ కూతురు నీ అత్తారింట్లో సంతోషంగా ఉండాలి అంటే నువ్వు ఓ పని చేయాలి జనం చెప్పే నిజాన్ని నువ్వు శాశ్వతంగా నిజం చేయాలి అని మాధవ్ అంటాడు..
అందుకు నువ్వు సరే అని ఒకమాట అంటే చాలు.. కానీ నువ్వు ఇలా కాదు.. జనం అనుకుంటున్నట్టు ఉండాలి అని మాధవ్ అంటాడు.. నువ్వు సరైన నిర్ణయం తీసుకుంటే ఆ ఆనందం ఎవ్వరికీ దక్కనివ్వను అని అంటాడు మాధవ్.. వెంటనే రాధ కార్ తీసి డ్రైవింగ్ చేసుకుంటూ మాధవ్ కు డాష్ ఇస్తుంది.. రాధ ఒక నిమిషం ఆగి వెళ్ళిపోతుంది.. రాధ నువ్వు నన్ను రెచ్చగొట్టావు.. ఈ మాధవ్ ను రెచ్చగొడితే ఎలా ఉంటుందో నీకు చూపించాలి కదా అని అంటాడు మాధవ్. నువ్వు ఇప్పుడు నన్ను కార్ తో రాసిచ్చావు అలా అని నేను సైలెంట్ గా ఉంటే నేను నీకు ఇంకా అలసిపోతాను.. నేనేంటో నీకు చూపించాలి కదా చూపిస్తా అని అంటాడు మాధవ్..
దేవి ఇంట్లో వాళ్ళ అందరితో మాట్లాడి ఆదిత్య వాళ్ల రూమ్ లోకి వెళుతుంది.. ఆదిత్య వాళ్ళ రూమ్ లో ఉన్న ఫోన్ బాక్స్ ను అలాగే చూస్తూ ఉంటుంది దేవి.. ఏంటమ్మా దేవి ఆ ఫోన్ బాక్స్ ని చూస్తున్నవు అని సత్య అంటుంది.. అది ఒట్టి కాళీ బాక్స్ అని చెబుతుంది సత్య.. అదికాదు చిన్నమ్మ ఇట్లాంటి ఫోనే మా అమ్మ దగ్గర కూడా ఉంది అని దేవి చెబుతుంది.. దేవి మాటలు విన్న సత్య షాక్ అవుతుంది..