Devatha Serial: నాన్న నువ్వెందుకు మా అమ్మ కాదు అని చెప్పావు అని అడుగుతుంది.. నేను ఎప్పుడు చెప్పాను అని మాధవ్ అంటాడు.. ఫోటోను చూస్తూ నువ్వు నువ్వు ఆరోజు మాట్లాడవు కదా నాన్నా అని అడుగుతుంది అది నీ గురించి కాదమ్మా.. చిన్మయి గురించి బాధపడ్డాను అని అంటాడు.. నువ్వు నా గురించి అన్నావ్ ఏమో అనుకొని.. నేను అమ్మను మస్తుగా బాధ పెట్టాను.. అమ్మ కూడా చాలా బాధపడింది అని అంటుంది దేవి.. అయ్యో అలా ఎందుకు చేసావమ్మ.. అమ్మ ను నువ్వు బాధ పెట్టకూడదు కదా.. ఇంకెప్పుడు అలా చేయకు అని తనని తాను సమర్ధించుకుంటూ దేవికి నచ్చచెబుతాడు..!
ఆదిత్య రాధతో ఊరు నుంచి నాన్న వాళ్ళ అక్క లావణ్య అత్తయ్య వచ్చింది. నాకు పిల్లలు ఉన్నారనుకుని సత్యను పిల్లలు చూపించు అని అడుగుతుంది. సత్యకి పిల్లలు పుట్టారని తెలుసుకుని నాకు మరో పెళ్లి చేయాలి అని అనుకుంటుంది. సత్య కూడా నన్ను మరో పెళ్ళి చేసుకోమని చెబుతుంది. కోపం వచ్చి నేను సత్యపై అరిచాను అని ఆదిత్య అంటాడు. అసలు నాకు ఏమి అర్ధం కావడంలేదని బాధపడతాడు. నేను చదువులో మాత్రమే సక్సెస్ అయ్యాను. జీవితంలో సక్సెస్ కాలేకపోయాను ఒక భర్తగా నేను ఎప్పుడో ఓడిపోయాను అని ఆదిత్య తన ఆవేదనను చెబుతాడు. రాధ ఆదిత్య మాటలు విని బాధపడుతు అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతుంది.
మాధవ్ రాధ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నా మౌనంగా ఉండే రాధ ఇప్పుడు నన్ను ఎదిరించే పరిస్థితి కి వచ్చింది.. ఇలా అయితే నా జీవితం ఎటు వైపు వెళ్తుందో నాకే అర్థం కావట్లదని ఆలోచిస్తూ ఉండగా.. రాధా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నా జీవితం తో పాటు మా ఇంటి పరువు కూడా పోతుంది. అలా జరగడానికి వీలు లేదు . ఏదో ఒకటి చేసి రాధ ఈ ఇంట్లోనే ఉండేలా చేయాలి. ఎలాగైనా నా దారికి తెచ్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.