Devatha Serial: మాధవ్ రాధ స్కూల్ నుంచి ఇంటి లోపలికి వస్తుండగా.. దేవి ఎక్కడ రాధ అని అడుగుతాడు.. నా పెనిమిటి ఇంటికి వెళ్ళింది అని చెబుతుంది.. ఇక్కడ నేను దేవి కోసం ఎదురు చూస్తూ ఉంటానని నీకు తెలుసు కదా.. అయినా ఎందుకు పంపించావ్ అని అడుగుతాడు.. అలా ఎలా పంపిస్తావు రాదా అని అడుగుతాడు.. మీరు ఎవరు సారు ఆ మాట అడగడానికి అని అంటుంది.. అయినా మీ ప్రేమ బిడ్డ మీద కాదని నాకు తెలుసు అని అంటుంది నా ప్రేమ బిడ్డ మీద కాదని ఎవరి మీద తెలుసన్నప్పుడు నువ్వు ఇలా చేయడం న్యాయమేనా అని అడుగుతాను.. ఇప్పటికీ నేను ఆలోచించేది మీ అమ్మ మీ నాన్న నీ కూతురు గురించే నీకు లాగా నేను ఆలోచిస్తే నీ పరువు తీయడానికి ఐదు నిమిషాలు పట్టదు అని రాధ వార్నింగ్ ఇస్తుంది..!
దేవుడమ్మ రుక్మిణి ఫోటో తీసుకుని ఇంట్లో నుంచి వస్తుండగా ఏదో పనిమీద బయలుదేరుతున్నట్టు ఉన్నారు ఆంటీ అని అడుగుతుంది సత్య.. అవును సత్య ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను అని అంటుంది.. అంతలో దేవి దేవుడమ్మ అవ్వ అంటూ పలకరిస్తుంది.. సరే పిన్ని వాళ్ళతో మాట్లాడుతూ ఉండు.. నేను చిన్న పని మీద బయటకు వెళ్లి వచ్చేస్తాను అని అంటుంది దేవుడమ్మ..
దేవుడమ్మ అమ్మవారి గుడికి వెళ్లి పంతులు గారికి రుక్మిణి ఫోటో చూపిస్తుండగా ముందు హారతి తీసుకోండి అని అంటాడు ఆ ఫోటో ప్లేట్లో పెట్టి హారతి అద్దుకొని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది రుక్మిణి ఫోటో చూస్తే కనిపించదు. ఏమైందమ్మా అని పంతులుగారు అడుగుతారు.. ఒక ముఖ్యమైన వ్యక్తి మీకు ఫోటో మీకు చూపిద్దామని తీసుకొచ్చాను.. అది ఎప్పుడు కనిపించడం లేదు అని అంటుంది దేవుడమ్మ.. ఆ ఫోటోను సత్య తీసుకుంటుంది.. ఆంటీ మీ చేతిలో అక్క ఫోటో కనిపించగానే.. మీరు ఏదో ముఖ్యమైన పని మీద బయటకు వచ్చి ఉంటారు అని అనుకున్నాను.. అందుకే మిమ్మల్ని ఫాలో అయ్యాను.. ఆ దేవుడు కూడా మీకు రుక్మిణీ అక్క కంటపడకుండా ఆ దేవుడే నన్ను ఇక్కడికి పంపించడు అనుకుంటా.. రుక్మిణి అక్క ఫోటోను నేనే తీసేశాను ఆంటీ నన్ను క్షమించండి అని మనసులో అనుకుంటుంది సత్య..