దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు.. అక్క ఏది బావా అని సత్య అడుగుతుంది.. మాధవ్ అదే సమాధానం చెప్పబోగా.. నాకు కూడా దేవికి చెప్పినట్టు అబద్దం చెప్పకండి బావ అని అంటుంది సత్య.. భార్య గురించి భర్త తప్పుగా మాట్లాడకూడదు.. ఈ మధ్య రాధ ప్రవర్తన ఏం బాగోలేదు.. ఈ మధ్య ఎక్కువగా ఆ ఫోన్ లోనే మాట్లాడుతుంది.. ఉన్నట్టుండి బయటకు వెళ్తుంది.. ఎక్కడికి ఏం పని మీద వెళ్లిందో చెప్పడం లేదు.. రాధ మా చెయ్యి జారిపోతుందని నాకు భయంగా ఉంది.. రాధ లేకుండా నేను బ్రతకలేను అని బాధపడతు చెబుతాడు..
మాధవ్ మాటలు విన్న సత్య అక్కడ ఆదిత్య పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక్కడ అక్క కూడా అలాగే చేస్తుందా. అని సత్య బాధపడుతుంది. అంటే ఏంటి అర్థం వీళ్ళిద్దరూ కలిసి బయట మాట్లాడుకుంటున్నారా లేదంటే అసలు ఏం జరుగుతుంది. మాధవ్ చెప్పిన మాటల్లో నిజం ఎంత అని సత్యా ఆలోచనలో పడుతుంది..
ఆదిత్య అని దేవుడమ్మ పిలుస్తుంది. విడోకడు గదిని శుభ్రంగా పెట్టుకోడు అని తన రూమ్ సర్ధుతుండగా దేవి ఫోటో కనిపిస్తుంది.. ఎంటమ్మా అలా చూస్తున్నావు అని అంటాడు ఆదిత్య.. అదేంటో రా ఈ పిల్ల దగ్గర నీ పోలికలు కనిపిస్తున్నాయి.. మీసాలతో దేవిని చూస్తుంటే నిన్ను చూస్తున్నట్టే అనిపిస్తుంది అని దేవుడమ్మ అంటుంది.. ఆదిత్య ఆ ఫోటో చూస్తూ నవ్వుకుంటడు..