21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
Entertainment News Telugu TV Serials

Devatha: దేవత సీరియల్ కథ ఇదే.!? పార్ట్ -2 కూడా ఉందా.!?

devatha serial end 14 november 2022 highlights
Share

Devatha: అనుబంధాలకు నిలయం అనే చక్కని ట్యాగ్ లైన్ తో స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్ దేవత. బుల్లితెరపై ప్రసారమవుతున్న ఈ సీరియల్ సరికొత్త కథనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో అలరిస్తుంది. ఈ సీరియల్ చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్. నిన్న 702 ఎపిసోడ్ తో దేవత సీరియల్ ను అనూహ్యంగా ముగించారు.. అయితే ఈ సీరియల్ ఇప్పటితో ముగించిన మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తామని ఎపిసోడ్ ఎండింగ్ లో చెప్పారు. దేవత పార్ట్ 2 ఉంటుందని బుల్లితెర ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ సీరియల్ లో జరిగిన హైలెట్స్ తో పాటు కథ ఏంటో చూద్దాం..!

aditya loves satya
aditya loves satya

దేవుడమ్మ కొడుకు ఆదిత్య కాలేజీలో చదువుకుంటూ సత్యం ప్రేమిస్తాడు కానీ దేవుడమ్మ ఆదిత్య కు పెళ్లి చేయాలని అనుకుంది. ఆదిత్య కు భార్య గా రుక్మిణి ను సెలెక్ట్ చేస్తుంది దేవుడమ్మ.. రుక్మిణి కూడా ఆదిత్యను ఇష్టపడటంతో సత్య తను ప్రేమించిన ఆదిత్యను అక్క కోసం త్యాగం చేయాలని అనుకుంటుంది. ఆదిత్య రుక్మిణికి పెళ్లయిపోతుంది. ఆ తర్వాత సత్య ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. సత్య ఆదిత్య వల్లే ప్రెగ్నెంట్ అని నిదానంగా తెలుసుకుంటారు. సత్య రుక్మిణి కోసమే ఆదిత్యను పెళ్లి చేసుకోకుండా తన కోసం త్యాగం చేసిందని రుక్మిణి తెలుసుకుంటుంది. వాళ్ళిద్దర్నీ విడగొట్టకుండా ఉండాలని మళ్లీ ఒకటి చేయాలని రుక్మిణి ఆదిత్యను సత్యకు త్యాగం చేయాలని అనుకుంటుంది..

satya sacrifies aditya
satya sacrifies aditya

చెల్లి అక్క కోసం తన ప్రేమను త్యాగం చేస్తే.. అక్క తన భర్తను తన చెల్లి కోసం త్యాగం చేస్తుంది. అలా ఆ రుక్మిణి ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఆమె కులీ నాలి పనులు చేసుకుంటూ తన కడుపులో ఉన్న బిడ్డ కోసం ఆమె బ్రతుకుతుంది. ఒకరోజు రోడ్ మాధవ్ కార్ కి యాక్సిడెంట్ అయి వాళ్ళని కాపాడే ప్రయత్నం లో ఆ చిన్మయి కి తల్లిగా రుక్మిణి రాధ గా పేరు మార్చుకుని ఆ ఇంటికి వెళ్తుంది.. ఆ భర్త కానీ భర్తకు భార్యగా ఉంటు .. తన కూతురు తో పాటు ఆ పాపను కూడా తన సొంత బిడ్డలా పెంచుకుంటుంది..

madhav with rukmini
madhav with rukmini

మాధవ్ రాధ అందం చలాకీ తనం చూసి తనే తన భార్య కావాలని అనుకుంటాడు కానీ రాధ మాత్రం ఒప్పుకోదు. కొన్నాళ్ల తర్వాత రాదని ఎలాగైనా సొంతం చేసుకోవాలి అని మాధవ్ అనుకుంటాడు. ఆదిత్య మళ్లీ తిరిగి రాధకు కనిపించడం లేదు. ఆదిత్య దగ్గర అవడం చకచకా జరిగిపోతాయి. ఎక్కడ మాధవ్ కి రాధ దూరమైపోతుందోనన్న భయంతో దేవికి మీ నాన్న చెడ్డవాడని అంటూ.. తన మనసును చెడగొట్టే ప్రయత్నం చేస్తాడు. రాధను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని మాధవ్ ప్లాన్ చేస్తాడు. ఆ విషయం వాళ్ళ అమ్మకు తెలుస్తుంది. ఇక వాళ్ళ అమ్మను లెగవకుండా చావు దెబ్బ కొడతాడు మాధవ్. ఈలోపు చిన్మయి రాధ తన సొంత తల్లి కాదు అని తెలుసుకుంటుంది. ఆఫీసర్ భార్య అని తెలుసుకుంటుంది. తన కోసమైనా తనని ఇంట్లో ఉండమని అడుగుతుంది చిన్మయి..

aditya loves rukmini
aditya loves rukmini

ఆదిత్య రుక్మిణికి ఫోన్ కొనివ్వడం అప్పుడప్పుడు బయట మాట్లాడుకుంటూ ఉండటం చేస్తున్నప్పుడు మాధవ్ వాళ్ళిద్దర్నీ చాటుగా ఫోటోలు తీసి సత్యకు పంపిస్తాడు మాధవ్ రాదని సొంతం చేసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలను అందరినీ తనకు నచ్చినట్టుగా ఉపయోగించుకుంటాడు ఇక ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని రాధా డిసైడ్ అయి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి గుడిలో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అంతలో మాధవ వచ్చి రాధకి తాళి కట్టాలని ప్రయత్నిస్తాడు సారు ఇలా చేయడం మంచిది కాదు అని రాధా అడ్డుకుంటుంది అప్పుడే నిజం తెలుసుకున్న సత్య వచ్చి మాధవ్ తల పగలగొడుతుంది ఒక్క దెబ్బతోనే మాదో తల నుంచి రక్తం కాదు కింద పడిపోతాడు దాంతో మాధవ్ చచ్చిపోతాడు ఆనందం కూడా రుక్మిణి నేనే మాధవ్ ని చంపాను అని తన నెత్తి మీద వేసుకుంటుంది సత్యకు తన ఇద్దరు కూతుర్లను అప్పజెప్తుంది అత్తమ్మ నేను ఏనాడు తప్పు చేయలేదు నన్ను మన్నించు అని దేవుడమ్మను వేడుకుంటుంది ఆదిత్య కాళ్లకు మొక్కి దండం పెట్టుకుంటుంది ఆ లోపు పోలీసులు రావడం తనని తీసుకువెళ్లడం చక చకా జరిగిపోతాయి కొన్నాళ్ల తర్వాత అంటూ రుబ్బుని పొలం దున్నుతూ ఉండగా చిన్మయి చదువుకుంటూ ఉంటుంది అటుగా వెళుతున్న ఆదిత్యా దేవుడమ్మ దేవి ముగ్గురు రాధను చూసి ఆగుతారు నువ్వు ఎప్పుడూ నీకోసం బతకలేదు ఒకప్పుడు నీ చెల్లి కోసం ఆ తరువాత నీ బిడ్డ కోసం ఇప్పుడు నీ బిడ్డ కానీ బిడ్డ కోసం బతుకుతున్నావు నిజంగా నువ్వు దేవతవు అని అంటూ ఆ సీరియల్ క్లోజ్ చేస్తారు ఇది ఆరంభం మాత్రమే ఇంకా ఉంది అంటూ ఎపిసోడ్ ఎండింగ్లో చెబుతారు అంటే దేవత పార్ట్ కూడా త్వరలోనే రానుంది అని ప్రేక్షకులకు హింట్ ఇచ్చారు. అయితే దేవత పార్ట్ 2 కూడా ఈపాటికి కథ సిద్ధం చేసి కొన్ని ఎపిసోడ్లు తీసారని తెలుస్తోంది..


Share

Related posts

ఆయ‌న ముందు కన్నీరు ఆపుకోలేక‌పోయిన ప్ర‌భాస్‌.. వీడియో వైర‌ల్‌!

kavya N

“పుష్ప 2” కి సంబంధించి ఇచ్చిన మాటను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేసిన బన్నీ..??

sekhar

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

sekhar