23.2 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
Telugu TV Serials న్యూస్

Devatha: దేవత సీరియల్ వచ్చేవారం ఊహించని ట్విస్ట్ ఏమిటంటే.!?

Devatha Serial latest Episode Highlights
Share

Devatha: అనుబంధాలకు నిలయం అనే చక్కని ట్యాగ్ లైన్ తో స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్ దేవత.. చెల్లి అక్క కోసం తన ప్రేమను త్యాగం చేస్తే.. అక్క తన భర్తను తన చెల్లి కోసం త్యాగం చేస్తుంది.. అలా ఆ అక్క ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది.. ఆమె కులీ నాలి పనులు చేసుకుంటూ తన కడుపులో ఉన్న బిడ్డ కోసం ఆమె బ్రతుకుతుంది..  ఒకరోజు రోడ్ యాక్సిడెంట్ అయిన ఒకరికి కాపాడే ప్రయత్నం లో ఆ పిల్లకి తల్లిగా ఆ ఇంటికి వెళ్తుంది.. ఆ భర్త కానీ భర్తకు భార్యగా ఉంటు .. తన కూతురు తో పాటు ఆ పాపను కూడా తన సొంత బిడ్డలా పెంచుకుంటుంది.. అటువంటి సరికొత్త కథనంతో ఊహించని మలుపులు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది ఈ సీరియల్.. ఈ సీరియల్ లో ఈవారం జరిగిన ఎపిసోడ్స్ హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఈ కథను ఎటు మలుపు తిప్పుతారో చూద్దాం.. !

Devatha Serial latest Episode Highlights
Devatha Serial latest Episode Highlights

దేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది.. దాంతో రుక్మిణి ఒక దిక్కు.. ఆదిత్య మరో దిక్కు వెతుకుతూ ఉంటారు.. చిన్మయి రాధకు ఫోన్ చేసి దేవి ఎక్కడ ఉందో కనిపించిందా అని అడుగుతుంది.. లేదమ్మా చిన్మయి ఇంకా కనిపించలేదు.. ఆఫీసర్ అంకుల్ నేను వెతుకుతున్నాము అని రాధా చెబుతుంది. మాధవ్ కి దేవి కనిపించిది చిన్మయి చెబుతుంది. అవునా దేవి ఎక్కడుంది అని చిన్మయి ని అడుగుతాడు మాధవ్.. ఆ విషయాన్ని మాత్రం చిన్మయి చాలా సీక్రెట్ గా చెబుతుంది.. దేవి ఎక్కడ ఉందో తెలుసుకున్న మాధవ్ అది కచ్చితంగా మన ఏరియానేగా.. అయితే మనోళ్లు చూసుకుంటారులే అని అన్నట్టుగా మాధవ్ మనసులో అనుకుంటాడు..

రుక్మిణి ఇంట్లో భాగ్యమ్మ చూసిన సత్య షాక్ అవుతూ.. అమ్మా అని పిలుస్తుంది.. నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే నాకు నీకు మొత్తం తెలుసు.. నాకు మొత్తం అర్దం అయింది అని సత్య అంటుంది.. నీకు అంతా తెలిసినా కూడా నువ్వు ఎందుకు నా దగ్గర ఈ విషయం రాయాలని అనుకున్నావా అమ్మ.. ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాలు తెలిసినా కూడా నువ్వు అక్కకే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నావు ఈ కూతురు ఏమైపోయినా నీకు పర్వాలేదా నీ కూతురు నీకు అంత కానిది అయ్యిందా అని సత్య అడుగుతుంది.. ఎన్ని రోజుల నుంచి నీకు ఇదంతా తెలిసినా కూడా నా దగ్గర తెలియనట్టు ఎలా ఉంటున్నావ్ అమ్మ .. నువ్వు కూడా అక్క లాగా పేరు మార్చుకున్నావా.. ఊరు మార్చుకున్నావా అని అడుగుతుంది సత్య..

Devatha Serial Highlights
Devatha Serial Highlights

ఆఫీసర్ రూమ్ ఇలాగైనా ఉండేది ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయని దేవుడమ్మ.. ఆదిత్య రూమ్ లో అన్ని వస్తువులను నీటుగా సర్దుతుంది. అంతలో ఆదిత్య పుస్తకంలో ఒక ఫోటో కనిపిస్తుంది అది ఏంటని ఓపెన్ చేసి చూస్తే రుక్మిణి ఫోటో.. రుక్మిణి ఫోటోని చూసిన దేవుడమ్మ.. షాక్ అవుతుంది ఆదిత్య పుస్తకాలలో రుక్మిణి ఫోటో ఉంది అంటే ఏంటి అర్థం.. తను ఇంకా రుక్మిణి ఇష్టపడుతున్నాడా లేదంటే ఆదిత్య కు రుక్మిణి కనిపించిందా .. ఈ మధ్య అందరికీ రుక్మిణి కనిపిస్తుంది అని అంటున్నారు.. అలా అయితే ఆదిత్య కు కూడా రుక్మిణి కనిపించిందా.. అందుకేనా ఆదిత్యలో ఈ మార్పు వచ్చింది అని దేవుడమ్మ ఆలోచిస్తూ ఉంటుంది..

ఆదిత్య రుక్మిణి ఇద్దరూ దేవిని వెతుక్కుంటూ గుడికి వస్తారు.. గుడిలో దేవి అలా కింద పడుకొని ఉండడం చూసినా రుక్మిణి ఏడుస్తూ.. తనని ఒడిలోకి తీసుకొని ఏమైంది నా బిడ్డకు లేమ్మా దేవమ్మా అంటూ ఏడుస్తుంది.. రుక్మిణి, ఆదిత్య కూడా దేవి లేగువు అని అంటాడు.. అమ్మ నువ్వేనా ఈ పాపకి తల్లివి అని వైద్యం చేసే ఆయన అడుగుతాడు.. అవును అని చెబుతుంది రుక్మిణి.. నా బిడ్డకు ఏమైంది అని రుక్మిణి అడుగుతుంది.. పాప తిండి తిప్పలు లేక తిరుగుతుంది.. అది కాకుండా ఎండ దెబ్బ కొట్టి కింద పడిపోతే నా దగ్గరికి తీసుకువచ్చారు.. వైద్యం చేస్తున్నాను.. ప్రస్తుతం బానే ఉంది అని ఆయన చెబుతారు.. ఎందుకు దేవమ్మ ఇలా చేశావు నీకేమన్నా అయితే నేనేం కావాలి.. అంటూ రుక్మిణి ఏడుస్తుంది..

rukmini serious
rukmini serious

నీకంటే ముందే మీ ఆయన ఇక్కడికి వచ్చి బిడ్డను చూసి తల్లడిల్లి పోతున్నాడు ఆ మాటలు వినగానే ఆదిత్య రుక్మిణి ఇద్దరు షాక్ అవుతారు.. అవును రాధమ్మ నీకంటే ముందే మాధవ్ బాబు ఎక్కడికి వచ్చారు అని అక్కడ ఉన్న వాళ్ళలో ఒకరు చెబుతారు.. దేవి ఇలా ఉండడం చూసి మాధవ్ బాబు చాలా బాధపడ్డాడు.. బిడ్డకు నయం కావాలని గుళ్లో ఉన్న దేవుడు అందరికీ మొక్కుతూ తిరుగుతున్నాడు.. అలాంటి తండ్రికి ఈ బిడ్డ కూతురుగా పుట్టడం ఈమె అదృష్టం అని అంటాడు.. అంతలో అదిగో మాటల్లోనే వస్తున్నాడు అని మాధవ వైపు చూపిస్తారు..

devatha latest episode
devatha latest episode

రుక్మిణి, ఆదిత్య ఇక్కడ అనుకుంది ఒక్కటి.. జరుగుతుంది మరొకటి.. రుక్మిణి దేవి కనిపించగానే ఆదిత్య తో పాటు దేవిని తనతో పాటు పంపించాలి అనుకుంది.. కానీ మాధవ్ అక్కడ ఉన్న వాళ్ళందరితో రాధ నా భార్య అని చెప్పిస్తాడు. దేవి లేచాక తన తండ్రి ఎవరో చెప్పమని అడుగుతుంది.. ఆదిత్య మాత్రం తనతో పాటు దేవిని తీసుకు వెళ్లాలని పట్టుబడతడు.. మరోపక్క దేవుడమ్మ స్వామీజీకి ఫోన్ చేసి ఇంట్లో జరుగుతుంది అంతా చెబుతుంది.. ఆయన కూడా నీ ఇంటి వారసత్వం తిరిగి వస్తుంది అని చెబుతారు..


Share

Related posts

Atchan Naidu : అచ్చెన్నాయుడు కి ఊహించని షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.!!

sekhar

YSRCP: ఈ సారి జగన్ ను నమ్ముకుంటే కష్టమే..? కొంపముంచుతున్న నేషనల్ సర్వే రిజల్స్..??

somaraju sharma

KTR Vs Bandi Sanjay: మంత్రి కేటిఆర్ రాజీనామా..? బండికి కేటిఆర్ సవాల్‌..!!

somaraju sharma