బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో దేవత కూడా ఒకటి.. అనుబంధాలకు నిలయం అనే చక్కని ట్యాగ్‌లైన్ తో ఈ సీరియల్ అనూహ్యమైన మలుపులు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది.. నిన్నటితో ఈ సీరియల్ 634 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది.. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్స్ రేటింగ్స్ లో 10.16 రేటింగ్ ను సొంతం చేసుకుని నాలుగవ స్థానంలో నిలిచింది.. గత కొన్ని వారాలుగా ఈ సీరియల్ ఇదే ప్లేస్ లో కొనసాగుతూ వస్తుంది.. తాజాగా ఈ వారం కూడా తన స్థానాన్ని పదిలం చేసుకుంది.. ఈ సీరియల్ లో ఈవారం జరిగిన హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఏం జరుగుతుందో చూద్దాం..!
మాధవ్ ఎలాగైనా దేవి ఈ ఇంట్లో నుంచి వెళ్లకూడదని దేవి వెళ్ళిపోతే రాధ కూడా ఈ ఇంటి గుమ్మం దాటి వెళ్ళిపోతుందని.. రాధ ఎప్పటికీ తన భార్యగా ఆ ఇంటిలోనే ఉండాలని మాధవ్ ఆలోచన ఆ ఆలోచనను నిజం చేయడం కోసం మాధవ్ ఎంతకైనా తెగించడానికి వెనుకాడటం లేదు.. దేవి మనసులో ఒక తండ్రి ఉన్నాడని వాడు చాలా నీచుడని క్రియేట్ చేస్తాడు.. ఇప్పుడు అదే నాన్న ఉన్నాడని తనను తీసుకువచ్చి దేవికి చూపిస్తాడు దేవి ఇతనే మన నాన్న అంటూ రాధకు పరిచయం చేస్తుంది తనతో మాట్లాడమని చెబుతుంది .. రాధా కోపంతో రగిలిపోతూ వెంటనే ఇంటికి పోదా రేపు ఇతని సంగతి చూద్దామని చెబుతుంది. ఇదంతా మాధవ్ సారి చేశారని మనసులో తిట్టుకుంటుంది..
మరోవైపు ఆదిత్య తనే దేవికి నిజమైన తండ్రి అని.. ఆదిత్య, రుక్మిణి ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకున్న ఫోటోలు తనకు సాక్ష్యంగా చూపించి అసలైన నిజాన్ని దేవికి చెప్పాలని అనుకున్నాడు . ఇంతలో ఇది జరిగింది.. కానీ రుక్మిణి ఈ విషయాన్ని అంతటితో వదిలేయలేదు. ఆదిత్య కు మాధవ్ చేసిన చండాలమైన పని గురించి చెబుతుంది . ఆదిత్య వాడి గురించి నిజం కక్కించి వాడి చేతే నిజాన్ని దేవికి చెప్పిస్తాడు ఆదిత్యని దేవికి తండ్రి అని చెబుతాడు వచ్చేవారం హైలెట్స్ సీన్స్ ఇదే..