దేవత సీరియల్ అనుబంధాలకు నిలయం అనే చక్కటి ట్యాగ్ లైన్ తో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది.. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్స్ టిఆర్పి రేటింగ్స్ లో దేవత సీరియల్ 10.03 రేటింగ్ ను సొంతం చేసుకునీ ఎప్పటిలాగానే తన 4వ స్థానాన్ని పదిలం చేసుకుంది.. గత కొన్ని వారాలుగా దేవత సీరియల్ ఇదే స్థానంలో కొనసాగుతూ వస్తుంది.. ఈ వారం కూడా తన స్థానాన్ని కాపాడుకుంది.. ఈ వారం జరిగిన హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఊహించని ట్విస్టులు ఏంటో చూద్దాం..!
రాధ ను దక్కించుకోవడం కోసం మాధవ్ ఎంతవరకైనా తెగిస్తాడని తెలిసిన విషయమే.. నిన్నటి వరకు దేవి పేరును తన చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నట్టు అందరినీ నమ్మించి.. ఆ పచ్చబొట్టు నిజం కాదని తన కుట్రలో భాగమని తెలిసింది .. ఇప్పుడు మాధవ్ హ్యాండీక్యాప్ కాదని.. కావాలని కర్ర సాయంతో నడుస్తున్నాడు అని.. ఇది కూడా తన కుట్రలో భాగమేనని.. అది కూడా రాధకు దగ్గర కావడం కోసం ఒక ఆయుధంగా వాడుకోవాలని నటిస్తున్నట్లు అర్థమవుతుంది.. రాధ తన ఇంటిలో నుంచి బయటకు రాకుండా ఉండటం కోసం.. మాధవ్ తన చుట్టూ ముళ్ళ కంచెను బిగిస్తూ వస్తున్నాడు..
రాధ తన నోటితో మాధవ్ చేస్తున్న కుట్రలను కనీసం ఆదిత్యతో కూడా పంచుకోదు.. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా దేవుడమ్మ మాధవ్ చేసే కుట్రాలను తెలుసుకొని.. మాధవ్ కు తగిన గుణపాఠం చెప్పి దేవిని రాధను ఆ ఇంట్లో నుంచి బయటకు తీసుకువస్తుంది.. వచ్చేవారం హైలెట్ సీన్ ఇదే కానుంది..