బుల్లితెర పై ప్రసారమవుతున్న సీరియల్స్ లో దేవత సీరియల్ కూడా ఒకటి.. అనుబంధాలకు నిలయం అనే చక్కని టాగలేంతో బుల్లితెర వీక్షకులను అలరిస్తోంది ఈ సీరియల్ సరికొత్త కథనంతో తిరుగుతోంది.. నిన్నటితో 606 ఎపిసోడ్స్ లో పూర్తిచేసుకుంది.. ఈ సీరియల్ తాజాగా విడుదలైన స్టార్ మా సీరియల్స్ టిఆర్పి రేటింగ్స్ లో దేవత సీరియల్ 9.86 రేటింగ్ ను సొంతం చేసుకుని నాలుగవ స్థానంలో నిలబడింది.. గత కొద్ది వారాలుగా దేవతా సీరియల్ మూడు నాలుగు స్థానాల మధ్య ఊగిసలాడుతుంది.. ఈ సీరియల్ ఈ వారం జరిగిన హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఏం జరుగుతుందో చూద్దాం..!
దేవి చెస్ టోర్నమెంట్ లో గెలవగానే రాధా దేవికి తన తండ్రి ఎవరు అని నిజాన్ని చెప్పాలి అనుకుంటుంది.. ఈ లోపు మాధవ్ మీ నాన్న ఒకసాయి వాడని.. మీ అమ్మను కడుపుతో ఉన్నప్పుడే ఇంట్లో నుంచి బయటకు నెట్టివేస్తే.. నేనే చేరదీసి ఆదరించానని.. నేను మీ సొంత నాన్నను కాదు అని.. దేవికి లేనిపోనివన్నీ చెబుతాడు మాధవ్.. మా నాన్న మా అమ్మను ఇంటిలో నుంచి వెళ్లగొడితే నువ్వు చేరదీసి నన్ను కన్న బిడ్డ లాగా చూసుకున్నావు అంటే.. నువ్వే మా సొంత నాయనవు అని అంటుంది దేవి.. మాధవ్ ప్లాను అర్థం చేసుకున్న రాదా? ఎలాగైనా దేవికి నిజం చెప్పాలని ప్రయత్నిస్తుంది..
మరోవైపు ఆదిత్య ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా రాధ మాత్రం లిఫ్ట్ చేయదు.. మాధవ్ ఏమైనా రాదా ఫోన్ ఎత్తకుండా అడ్డుపడుతున్నాడా? అసలు ఏమై ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి దేవి దగ్గరకు వస్తాడు.. ఆదిత్యతో దేవి మాధవ్ సార్ మా నాన్న కాదని.. మా నాన్న కసాయి వాడిని.. మా అమ్మ కడుపుతో ఉన్నప్పుడే మా నాన్న మా అమ్మను కొట్టి ఇంట్లో నుంచి తరిమేసాడని నిజాన్ని ఆదిత్య కు చెబుతుంది.. ఆ విషయం తెలుసుకున్న ఆదిత్య మాధవను ఏం చేయనున్నాడు అనేదే వచ్చేవారం హైలెట్ టెస్ట్ కానుంది..