Nirupam: కార్తీక దీపం సీరియల్‌తో డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాల తెలుగు ప్రేక్షకులను కట్టి పడేశాడు. అలాంటి నిరుపమ్ ఇప్పుడు కార్తీక దీపం సీరియల్‌కు దూరమయ్యాడు. ఆ సీరియల్ కథ అంతా మారింది. కొత్త జనరేషన్ వచ్చింది. డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత పాత్రలు ముగిసిపోయాయి. కొత్త కొత్త పాత్రలు వచ్చాయి. మొత్తానికి ఆ సీరియల్ గాడి తప్పింది. డాక్టర్ బాబు, వంటలక్కలు కనిపించకపోవడంతే ప్రేక్షకులు అంతగా సీరియల్‌ను పట్టించుకోవడం లేదు. అయితే కొంత మంది మాత్రం డాక్టర్ బాబు ఇంకా తిరిగి వస్తాడని నమ్మకంతోనే ఉన్నారు. అయితే ఇలా జనాల్లో ఉన్న అనుమానాలను తీర్చేందుకు నిరుపమ్ ముందుకు వచ్చాడు.
ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రశ్నలకు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మంజుల, నిరుపమ్ ఇద్దరూ సమాధానాలు ఇచ్చారు. ఐతే డాక్టర్ బాబు రీఎంట్రీ లేదని తేల్చి చెప్పేసారు. కార్తీక దీపం సీరియల్లో అయితే కచ్చితంగా కనిపించను.. మళ్లీ ఆ పాత్ర ఉండదు అని తేల్చి చెప్పేసాడు. ఈ సీరియల్ నుంచి బయటికి వచేసాక ఒక వెబ్ సిరీస్ చేసినట్లు చెప్పారు. ఇప్పుడే దాని ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని కానీ డీటెయిల్స్ ఇప్పుడే చెప్పలేను అన్నారు. ఒకటి రెండు నెలల్లో ఒక సీరియల్ రాబోతోందని దాన్ని తానే ప్రొడ్యూస్ చేసినట్లు చెప్పారు. ఆ సీరియల్ లో మంజుల యాక్ట్ చేస్తోందని చిన్న ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు నిరుపమ్.
సోషల్ మీడియాలో మాత్రం నిరుపమ్ సందడి కనిపిస్తోంది. ఇన్ స్టాగ్రాంలో నిరుపమ్ హంగామా కొనసాగుతూనే ఉంది. యూట్యూబ్‌లో భార్య భర్తలిద్దరూ కలిసి వీడియోలు చేస్తున్నారు. వ్యూస్, సబ్ స్క్రైబర్ల విషయంలో మంజుల నిరుపమ్ యూట్యూబ్ చానెల్ దూసుకుపోతోంది. రకరకాల వీడియోలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…