Guppedantha Manasu August 2 Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.. గత ఎపిసోడ్ లో సాక్షి చేసిన పనికి భూషణ్ కుటుంబం మొత్తం ఒక్కసారిగా షాక్ లో ఉండిపోతారు. రిషిని పెళ్లి చేసుకోబోయేది నేనే అంటూ కాలేజ్ లో జరిగే చదువుల పండగ ఈవెంట్ లో అందరి ముందు చెప్పి అందరికి షాక్ ఇస్తుంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి.

రిషి రూమ్ లోకి వెళ్లిన జగతి ఏమి మాట్లాడిందంటే..?
ఇక ఈరోజు ఎపిసోడ్ లో జగతి రిషితో మాట్లాడాలి అని రిషి రూమ్ లోకి వెళ్తుంది. మేడం మీరు సాక్షి, వసు గురించి మాట్లాడాలని వస్తే మాత్రం వెళ్లిపోండి అంటూ కోపంగా అంటాడు. సార్ నేను చెప్పేది కాస్త వినండి. సమస్య మీది దానికి పరిష్కారం కూడా మీ దగ్గరే ఉంది అంటుంది. కానీ. రిషి మాత్రం జరిగిపోయిన విషయాలు అన్ని తలుచుకుని బాధ పడతాడు. ఇక చివరలో జగతి మేడం బాధ పడుతూ సార్ మీరు ఏమనుకున్నా వసు మీ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. మీ కంటే ఎక్కు

వ తను మిమ్మల్ని ఇష్టపడుతుందని చెబుతుంది.వెంటనే రిషి భలే చెప్పారు మేడం అంటూ వెటకారంగా అంటాడు. కాసేపు రిషి తన చిన్నప్పటి జ్ఞాపకాలను తలుచుకుని బాధపడతాడు. రిషి మాటలకూ జగతి కూడా బాధపడుతుంది.ఇక జగతి వీటన్నిటికీ సమాధానం ఒకరోజు తెలుస్తుందని చెప్పి వసును ఉద్దేశించి మాట్లాడి,మాట్లాడటానికి ఇంత సమయం ఇచ్చినందుకు థాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది
జ్ఞాపకలను తలుచుకుంటూ ఎమోషనల్ అయిన వసు, రిషిలు :
జగతి వెళ్ళిపోయాక రిషి ఆలోచనలో పడతాడు. వసు జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉంటాడు.జ్ఞాపకాలు పంచే వ్యక్తులు దూరం అయితే ఎలా అని అనుకుంటాడు.మరోపక్క వసు కూడా రిషీని తలుచుకుంటూ బాధపడుతుంది.రిషి సార్ లేకుండా నేను ఉండలేను. ఆయన ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనుకుంటుంది.ఇక ఇద్దరూ ఫోన్ చేయాలి అనుకును ఒకేసారి ఫోన్ చేయటంతో ఇద్దరి ఫోన్స్ బిజీ అని వస్తాయి.కాసేపు అయ్యాక ఎప్పుడు నేనే చెయ్యాలా అనుకుంటాడు. తరువాత వసు ఫోన్ చేసి ఎమోషనల్ గా మాట్లాడడంతో రిషి తనను కలుస్తాను అని చెబుతాడు.వెంటనే వసు చాలా సంబరపడుతుంది.

సాక్షి ఎవరు అని దేవాయని మీద రివర్స్ అయిన రిషి :
సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఇంట్లో వాళ్లంతా హాల్లో కూర్చుంటారు. మరోపక్క దేవయాని రిషి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రిషి రావటంతో ఏం జరుగుతుంది పెద్దమ్మ అని అడుగుతాడు. ఇక దేవయాని సాక్షి గురించిన టాపిక్ తీస్తుంది.సాక్షి మీ పెళ్ళికి సంబందించిన షాపింగ్ ఏర్పాట్లు. చేసుకుందని చెప్పడంతో ఒక్కసారిగా రిషి కోపంతో ఉగిపోతు అసలు ఎవరు ఈ సాక్షి అంటూ కోపంతో రగిలిపోతాడు.మరి ప్రెస్ ముందు, స్టూడెంట్స్ ముందు ఎందుకు సైలెంట్ గా ఉన్నవని దేవాయని అడగగా చదువుల పండగ ప్రోగ్రాంలో ఈ విషయం గురించి నేను రివర్స్ అవుతే ఇప్పుడు పెద్ద చర్చలు అయ్యేవి పెద్దమ్మఅందుకే కాలేజ్ పరువు పోకుండా సైలెంట్ గా ఉన్నాను అని అంటాడు.
సాక్షికి జలక్ ఇచ్చిన రిషి :
ఇక సాక్షి గతంలో నన్ను చాలా సార్లు బ్లాక్ మెయిల్ చేసిన విషయాలను కూడా చెబుతాడు.దాంతో దేవయాని ఏమి తెలియనట్టుగా నటిస్తుంది.అయినా తనతో. ఎంగేజ్మెంట్ క్యాన్సల్ అయ్యాక కూడా ఏంటి పెద్దమ్మ ఇది అంతా అంటూ అరుస్తాడు.. ఇక తరువాయి భాగంలో రిషి వసును ఒకచోట తీసుకొని వెళ్తాడు. ఇంతలో సాక్షి రిషికి ఫోన్ చేయగానే నేను వసుతో ఉన్న అనే విషయాన్ని చెబుతాడు. వెంటనే సాక్షి కోపంగా దేవయాని దగ్గరికి వెళ్లి ఏం జరుగుతుందని ప్రశ్నించడంతో వెంటనే దేవయాని రిషికి నువ్వంటే ఇష్టం లేదు,నిన్ను పెళ్లి చేసుకోడు అని చెప్పడంతో సాక్షి షాక్ అవుతుంది.
Maa TV Serials Today
Karthika Deepak Latest Episode: సౌర్యను మరోసారి ఏడిపించిన నిరూపమ్.. ఆనందంలో హిమ, ప్రేమ్..!