21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu November 18 Today Episode:మహేంద్రను మోసం చేసి మళ్ళీ ఒంటరిగా వదిలేసి వెళ్లిన జగతి..!

Share

Guppedantha Manasu November 18Today Episode:  బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది.ఇక ఈరోజు November 17వ తేదీ Guppedantha Manasu సీరియల్ 610 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం..ఈరోజు గుప్పెడంత మనసు నేటి కథనం చాలా ఉత్కంఠగా సాగిందనే చెప్పాలి.ఈరోజు ఎపిసోడ్ లో రిషి పంపిన మెయిల్ చూసి జగతి మ్ చాలా సంతోషంగా ఆ ఫంక్షన్ కి వెళ్తాను అంటుంది. కానీ మహేంద్ర మాత్రం నేను చెప్పేది విను మనం అనుకున్న పని ఇంకా అవ్వలేదు కొంచెం ఓపిక పట్టు అంటాడు. ఇప్పుడు వెళ్లకపోతే రిషి నన్ను ఎప్పటికీ క్షమించడు అంటుంది జగతి సరే నీ ఇష్టం అనేసి మహేంద్ర వెళ్ళిపోతాడు.

బాధలో ఉన్న వసుకి ఓదార్పును ఇస్తున్న రిషి:

Vasu, rishi

ఇక వసు ఇంటర్వ్యూకి వెళ్లడం కోసం రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రిషి వసు బొట్టు పెట్టుకోవడం మర్చిపోతే తనకి బొట్టు పెట్టి ఆల్ ది బెస్ట్ చెప్తాడు. సార్ ఇంటర్వ్యూకి జగతి మేడం వస్తే బాగుండు అని అంటుంది వసు.ఎవరు వచ్చినా రాకపోయినా ధైర్యంగా ఇంటర్వ్యూ ఫేస్ చెయ్ అంటాడు రిషి. నీ వెనకాతల నేను ఉంటాను అని ధైర్యం చెప్తాడు రిషి. మీరు ఎప్పటికీ నాకు తోడుంటారు కానీ మేడం వస్తే బాగుండని నా కోరిక అలానే మిగిలిపోయింది అంటుంది వసు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం చూసి కోపంతో రగిలిపోతుంది దేవయాని.

వసుపై దేవయాని కోపం:

Devayani

వసు గదిలో ఉన్న రిషిని పిలిచి మీ పెదనాన్న వెళ్లిపోయారు అంటుంది. మేము కూడా వెళ్తున్నాం పెద్దమ్మ వసు కి ఆల్ ద బెస్ట్ చెప్పరా అని అంటాడు. ఇష్టం లేకపోయినా వసుకు ఆల్ ద బెస్ట్ చెప్తుంది దేవయాని. నాకు ఇష్టం లేకుండా నువ్వు ఇంట్లో తిరుగుతున్న నేనేమీ చేయలేకపోతున్నాను అని మనసులో అనుకుంటుంది దేవయాని.ఇక కాలేజీలో ఫంక్షన్ కోసం అంతా ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు.కాలేజ్ కి వచ్చిన వసుకు ఫణీంద్ర వర్మ కంగ్రాట్స్ చెప్పి జాగ్రత్తగా ఇంటర్వ్యూ చేయమంటాడు. జగతి వాళ్ళు లేకపోయినా ఉన్నారనుకొని నువ్వు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి అంటాడు ఫణీంద్ర వర్మ.

ఫణింద్రకు దొరికిపోయిన మహేంద్ర :

Phanindra

అంతలో గౌతమ్ ఫోన్ రింగ్ అవుతుండడంతో గౌతమ్ అక్కడ లేకపోవడంతో ఫణింద్ర వర్మ ఆ కాల్ ఎటెండ్ చేసి ఎవరు మాట్లాడుతున్నారు అని అడుగుతాడు.గౌతమ్ అనుకొని మాట్లాడబోయి ఫణీంద్ర వర్మ గొంతుకు గుర్తుపట్టి ఫోన్ పెట్టేస్తాడు మహేంద్ర. ఫణీంద్ర కూడా మహేంద్ర గొంతు గుర్తుపడతాడు కానీ మహేంద్ర గౌతమ్ కి ఎందుకు ఫోన్ చేస్తాడు అని లైట్ తీసుకుంటాడు. అక్కడికి అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమ్ కి నీకు ఒక ఫోన్ వచ్చింది ఆ వాయిస్ అచ్చు మహేంద్రది లాగ ఉంది అంటాడు ఫణీంద్ర.అప్పుడే అక్కడికి వచ్చిన రిషికి జరిగిన విషయం చెబుతాడు. వెంటనే గౌతమ్ దగ్గర ఫోన్ లాక్కొని ఆ నెంబర్ కి ఫోన్ చేస్తాడు రిషి. ఫోను లిఫ్ట్ చేయడానికి ముందు అనుమానపడినా తర్వాత గౌతమ్ చేస్తున్నాడేమో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు మహేంద్ర.రిషి గొంతుకవిని మాట్లాడలేక బాధతో ఫోన్ పెట్టేస్తాడు మహేంద్ర. ఎవరు ఏమీ మాట్లాడట్లేదు రా అంటాడు రిషి. ఇది మా ఫ్లాట్ అసోసియేషన్ నెంబర్ రా నాకోసమే చేసి ఉంటారు అని తను ఫోన్ తీసుకుంటాడు గౌతమ్. నాకు కొంచెం పని ఉంది నేను బయటికి వెళ్ళాలి అని అక్కడ నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు గౌతమ్. ఎందుకు అంత కంగారుగా వెళ్ళిపోతున్నారు అనుకుంటుంది వసు. జగతి మేడం వస్తే బాగుండు అని ఆలోచిస్తూ కూర్చుంటుంది వసుధార.

మహేందద్రకు జగతి అనుకోని షాక్ :

Jagathi, mahendra

మరోపక్క జగతి కోసం ఇల్లంతా వెతుకుతుంటాడు మహేంద్ర. అతనికి ఒక లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్ లో వసు దగ్గరకి వెళ్లకుండా ఉండలేకపోతున్నాను సారీ అని రాసి ఉంటుంది. అది చూసిన మహేంద్ర షాక్ అయి ఎంత పని చేసావు జగతి అని బాధపడతాడు.వసు ని ఆఫీస్ రూమ్ కి తీసుకు వచ్చినా కూడా మూడీగా ఉండటంతో మేడం కచ్చితంగా వస్తారు అని కాన్ఫిడెంట్ గా చెప్తాడు రిషి. నిన్ను కూల్ చేయటానికి ముందుగా నేనే ఇంటర్వ్యూ చేస్తాను.నన్నే ప్రెస్ వాళ్ళని అనుకో అని ఆమెని ఇంటర్వ్యూ చేయటం మొదలుపెడతాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Share

Related posts

అవ‌న్నీ రూమ‌ర్లే.. రామ్‌-బోయ‌పాటి సినిమాపై నయా అప్డేట్‌!

kavya N

త‌మ‌న్నా ఎందుక‌లాంటి ప‌ని చేసింది.. ఫ్యాన్స్ ఆందోళ‌న‌!?

kavya N

`గాడ్ ఫాద‌ర్‌`కు మొద‌ట అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..?

kavya N