Guppedantha manasu : బుల్లితెర ప్రేక్షకుల మనసును గెలుచుకున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ 568 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు 2022 సెప్టెంబర్ 30 న ప్రసారం కానున్న గుప్పెడంత మనసు సీరియల్లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..గత ఎపిసోడ్ లో దేవయానికి షాక్ ఇస్తూ రిషికి అన్నం తినిపిస్తుంది.ఇక ఈరోజు ఎపిసోడ్ లో జగతి, మహేంద్ర దంపతులతో పాటుగా గౌతమ్ కూడా కలిసి రిషి, వసులను కలపడానికి ఆపరేషన్ రిషిదారను మొదలుపెట్టాలని అనుకుంటారు ఈ క్రమంలోనే కాలేజీలో మిగిలిపోయిన మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టులను ప్రారంభించాలని అనుకుంటారు. ఇక ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారు అని దేవయాని గమనిస్తూ ఉంటుంది.
రిషిపై మహేంద్ర తండ్రి ప్రేమ :

సీన్ కట్ చేస్తే రిషి వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మహేంద్ర వర్మ రిషి కోసం కాఫీ తీసుకొని వచ్చి రిషి దగ్గర కూర్చుని ప్రేమగా మాట్లాడతాడు. ఇక మాటల మధ్యలో కాలేజ్ మిషన్ ఎడ్యుకేషన్ మీటింగ్స్ ఉన్నాయని, నీకు చెయ్యి నొప్పి ఉంటే ఉండిపో మేము వెళ్తాము అంటే రిషి నేను కూడా వస్తానులే అని అంటాడు.
వసు జ్ఞాపకాల్లో రిషి :

ఇక రిషి కాలేజీ కి వెళ్ళాక అక్కడ హాట్ సింబల్ ని చూసి వసుధారను గుర్తుకు తెచ్చుకుంటాడు. మన ఇద్దరి మధ్య గురుదక్షిణ అనే కండిషన్ లేకపోతే మనిద్దరం ఇంత దూరంగా ఉండేవాళ్ళం కాదు కదా అనుకుంటాడు. అప్పుడే జగతి ప్రాజెక్టు గురించి మాట్లాడటానికి రావడంతో రిషి మీటింగ్లో కలుద్దాము మేడం ఇప్పుడు వద్దు అని అంటాడు.
కోఆర్డినేటర్ గా షాక్ ఇచ్చిన వసుధార..
కో ఆర్డినేటర్ పోస్ట్ లో వసు ఎంట్రీ :

ఇక మీటింగ్ మొదలవుగానే జగతి విద్యాశాఖ నుంచి ఎవరు కోఆర్డినేటర్ వచ్చి మనకు దాని గురించి చెప్తారని అనటంతో సరే మేడం ముందు వాళ్ళు చెప్పేది విందాం ఆ తర్వాత మనం చర్చించుకుందాం అని రిషి అంటాడు.అప్పుడే వసు ఎంట్రీ ఇచ్చి అందరికి షాక్ ఇస్తుంది.ఇక రిషి తన మనసులో వసు ఉద్యోగంలో జాయిన్ అయింది అని మాట కూడా చెప్పలేదు అని అనుకుంటాడు. ఇక వసు మిషన్ ఎడ్యుకేషన్ కోసం ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను అని అంటుంది.దాంతో అందరూ తనను చప్పట్లతో ప్రశంసిస్తారు.
రిషి ఇగోను ఇంకా పెంచుతున్న వసు :

ఆ తర్వాత వసు ప్రాజెక్టు గురించి తను ఒక ఒపీనియన్ చెబుతుంది. ఆ తర్వాత రిషిని సంతకం కావాలని అంటుంది. ఇక రిషి జగతిని ఇవన్నీ మీరే చూసుకోండి అని అంటాడు. ఆ తర్వాత రిషి చేతికి అక్కడ ఉన్న లాప్ టాప్ తగలడంతో అందరూ కంగారు పడతారు. తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయాక వసు వచ్చి చూసుకోవాలి కదా అని జాగ్రత్తలు చెబుతుంది. ఆ తర్వాత గౌతమ్ గేమ్స్ ఆడుకుంటూ ఉండగా దేవయాని వచ్చి ఇందాక ఏం మాట్లాడుకున్నారో అని ఆరా తీస్తుంది.కానీ గౌతమ్ అసలు విషయం చెప్పకుండా దానిని మరోలా చెబుతాడు.
మినిస్టర్ కి థాంక్స్ చెప్పిన మహేంద్ర :

ఆ తర్వాత మహేంద్ర వర్మ మినిస్టర్ కి ఫోన్ చేసి వసుకు జాబ్ ఇచ్చినందుకు థాంక్స్ చెబుతాడు. ఇక మినిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాక అక్కడికి వసు కూడా వస్తుంది. ఇంతలో రిషి వచ్చి నాకు చెప్పకుండా జాబ్ ఎందుకు అప్లై చేశావు అని రిషి వసును అడుగుతాడు. ఇంట్లో ఖాళీగా ఉండటం ఎందుకు అని అప్లై చేశాను అని అంటుంది.