NewsOrbit
Telugu TV Serials

Guppedantha manasu : వసు, రిషిల ప్రేమబంధంకు అడ్డుగా నిలుస్తున్న “అమ్మా” అనే అనుబంధం..!!

Guppedantha manasu: బుల్లితెర ప్రేక్షకుల మనసును గెలుచుకున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ 566 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు 2022 సెప్టెంబర్ 28న ప్రసారం కానున్న గుప్పెడంత మనసు సీరియల్లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..గత ఎపిసోడ్ లో జగతి మేడం వసు దగ్గరకు వచ్చి గురుదక్షణ మాట వదిలేసి రిషితో ప్రేమగా ఉండు అని చెప్తుంది కానీ వసు మాత్రం ఈ విషయంలో నేను తగ్గను మేడం. రిషి సార్ మిమ్మల్ని అమ్మా అని పిలవాలి అంతే అనే మొండిగా మాట్లాడంతో జగతి కోపంగా ఇంటికి వచ్చి బట్టలు సర్దుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోబోతుంటే రిషి వచ్చి అడ్డుకుంటాడు.సరిగ్గా అప్పుడే దేవయాని వస్తుంది.

దేవాయని దొంగ కన్నీళ్లు… అబద్ధంను నిజం అని నమ్ముతున్న రిషి :

Devayani rishi


ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి. ఈరోజు కూడా అదే సీన్ కంటిన్యూ అవుతుంది.దేవయాని పరిస్థితులను తనకి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. జగతి మహేంద్ర లను ఉద్దేశించి ఎందుకు మీరిద్దరూ రిషిని అలా బాధ పెడుతున్నారు అని చెప్పి అంటుంది. జగతి నీ గురించి నాకు బాగా తెలుసు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పి రిషి ని బ్లాక్ మెయిల్ చేసి ఎమోషనల్ గా బాద పెట్టాలని అనుకుంటున్నావా అంటుంది. దేవయాని మాటలకు మహేంద్ర కోపం తెచ్చుకుని వదినగారు మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది అని అంటాడు. మహేంద్ర మాటలకు దేవయాని ఒక్కసారిగా షాక్ అయ్యి కాస్త కన్నీటిని జోడించి అంటే మీ కుటుంబ విషయంలో నన్ను కలగ చేసుకోవద్దు అంటారా అంటే నా ఇంట్లోనే నన్ను పరాయిదాన్ని చేశారా అంటూ కన్నీళ్లు పెట్టి రిషి దగ్గర సింపతీ కొట్టేస్తుంది. దేవయాని దొంగ ఏడుపుని నిజం అనుకున్న రిషి పెద్దమ్మ మీరు ఎందుకు ఏడుస్తారు మీరు నాకు ఎప్పుడు అయిన వాళ్లే.పరాయి వాళ్ళు కాదు అన్నట్లుగా మాట్లాడి దేవయానిని పక్కకు తీసుకుని వెళ్తాడు. పాపం జగతి మాత్రం జరిగిన సంఘటనను గుర్తుచేసుకుని ఏడుస్తుంది

రిషి, వసుల మధ్య అనే బంధం తెచ్చిన తిప్పలు :

vasu rishi

ఇక రిషి కోపంగా కారు వేసుకుని వసు దగ్గరకు బయలుదేరుతాడు. వసు అమ్మవారి గుడిలో ఉండి రిషి సార్ మారాలని కోరుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రుషి వస్తాడు. జగతి మేడంకి నీకు మధ్య ఏం జరిగింది అసలు మేడం ఎందుకు ఇంటి నుంచి వెళ్లిపోతా అని అంటున్నారు అని అడుగుతాడు. వసు ఒకసారిగా షాక్ అయ్యి జగతి మేడం మీరు తనని అమ్మ అని పిలవకపోయినా పర్వాలేదు కానీ రిషిని మాత్రం దూరం చేసుకోకు అని నన్ను అడిగారు అని అసలు విషయం చెబుతుంది.నా విషయంలో అలా ఆలోచించినదుకు మీ మేడంకు థాంక్స్ చెప్పాను అని చెప్పు అంటాడు రిషి. అయినా మీ మేడంకు నా చేత అమ్మా అని పిలిపించుకోవాలని అనే ఆసక్తి లేనప్పుడు మధ్యలో నీకెందుకు అంటాడు వసును. సార్ మీరు చాలా మంచి వారు. అన్ని మంచి లక్షణాలున్న మీరు అమ్మ విషయంలో ఇలా ఉండటం నాకు నచ్చలేదు సార్ అంటుంది వసుధార. మీరు జగతి మేడంని అమ్మ అని పిలవాలి సార్ అని పిలవాలి అనే లోపు రిషి సీరియస్ అయి దేవుడి గుడిలో పైన ఉన్న గంటను ఒక్కసారిగా కొడతాడు.

రిషి చేతికి దెబ్బ… తల్లడిల్లి పోతున్న వసుధార :

Vasu rishi

రిషి చేయికి దెబ్బ తగిలి రక్తం వస్తూ ఉంటుంది. అది చూసి వసు టెన్షన్ పడుతూ సార్ కట్టు కడతా ఆగండి అంటుంది. వద్దు అని చెప్పి రిషి అక్కడ నుండి కోపంగా వచ్చేస్తాడు.వసు రిషి వెంట పరిగెడుతూ ఉంటుంది.. ఇక కారులో ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. వసు మాత్రం సార్ నా మాట వినండి హాస్పిటల్ కు వెళదాం అంటుంది. రిషి మాత్రం సీరియస్ గా ఉంటూ ఏమి మాట్లాడడు. మరోపక్క జగతి మహేంద్ర గౌతమ్ ముగ్గురు కూడా రిషి గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలో గౌతమ్ ఆ వెళితే రిషి వసుధార దగ్గరికి వెళ్లి ఉంటాడు ఒకసారి ఫోన్ చేస్తానని రిషికి ఫోన్ చేస్తాడు గౌతమ్. కానీ రిషి ఫోన్ లిఫ్ట్ చేయడు. మళ్లీ గౌతమ్ బస్సు దారికి ఫోన్ చేస్తాడు వాసు కూడా ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. ఇక రిషి ఒకచోట కారు ఆపి వస్తుందా అని దిగిపోమని చెప్పేసి వెళ్లిపోతాడు.

రిషి చేతికి కట్టు కట్టిన వసు :

Vasu rishi

కాలేజీకి వచ్చి కార్ దిగి బయటకు వచ్చే సమయానికి వసుధర రిషి ఎదురుగా నుంచుని ఉంటుంది సార్ నా మాట వినండి హాస్పిటల్ కి వెళ్దాం పదండి అని అంటుంది వసుధార నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అని రిషి ఒకసారిగా అరుస్తాడు తీరా చూస్తే అక్కడ వసుధర ఉండదు ఇదంతా నా భ్రమ ఎందుకు వసుధాన నన్ను ఇలా పట్టిపీడిస్తున్నావు అనుకుని కాలేజీ లోపలికి వెళ్ళిపోతాడు. కాసేపు అయిన తర్వాత అ రిషి సోఫాలో పడుకుని ఉంటే వసుధార కింద కూర్చుని దెబ్బ తగిలిన రిషి చేతికి కట్టు కడుతూ ఉంటుంది.మెలకువ వచ్చి చూసిన రిషి వసదారును చూసి షాక్ అయ్యి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు సర్ మీకు ఇలా దెబ్బ తగిలితే నేను ఎలా ఉండగలను అని చెప్పి వసుధార రిషిని మార్చే ప్రయత్నం చేస్తూ కొన్ని ప్రేమ గురించిన మాటలు చెబుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న రిషి వసుధార నీ మాటలతో నన్ను మార్చాలని చూస్తున్నావా అన్నట్టు మాట్లాడతాడు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu