NewsOrbit
Telugu TV Serials న్యూస్

Guppedantha Manasu November 1 Episode: పెద్దమ్మపై ప్రేమ…. వసు, రిషిల బంధానికి అడ్డుగా నిలవనుందా..??

rishi fire on vasudara

Guppedantha Manasu November 1 Episode: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది.ఇక ఈరోజు November 1వ తేదీ Guppedantha Manasu సీరియల్ 595వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం.గత ఎపిసోడ్ లో వసు, రిషిల మధ్య ఉన్న అడ్డుతెర తొలగిపోతుంది.. గురుదక్షణ విషయంలో నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను సార్ అంటూ రిషికి చెప్పడంతో రిషి చాలా. సంతోషిస్తాడు.

సంతోషంలో రిషి, వసు :

rishi vasu convesation
rishi vasu convesation

ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి. వసు, రిషిలు ఇద్దరు కారులో వెళ్తూ ఉండగా రిషి నాకు చాలా సంతోషంగా ఉంది అని వసుతో అంటాడు.నాకు కూడా సార్ అని వసు అని రిషి తల మీద ఉన్న గులాబీ పూల రేకులను తీస్తుంది.వాటిని రిషి తీసుకుని జేబులో పెట్టుకుంటాడు..అదేంటి సార్ ఎందుకు అవి అంటే.. దాచుకుంటా వసుధార అని అంటాడు. ఇవి ఒక జ్ఞాపకాలుగా ఉంచుకుంటా అంటాడు.. ఇక వసు కూడా సార్ మీతో గడిపిన ప్రతి క్షణం నాకు ఒక జ్ఞాపకమే సార్ అంటుంది వసుధార..

వసు మనసులో ఏముందో గౌతమ్ ను తెలుసుకోమన్న మహేంద్ర :

mahendra jagathi with gowtham
mahendra jagathi with gowtham

సీన్ కట్ చేస్తే మహేంద్ర, జగతి, గౌతమ్ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. రిషి ఎలా ఉన్నాడు అని మహేంద్ర అడుగుతాడు. ఎలా ఉంటాడు బాధ పడుతూనే ఉన్నాడు అంటాడు గౌతమ్. ఒక ఫ్రెండ్ గా వాడికి అబద్దం చెప్పలేక చాలా బాధపడుతున్నాడు అంటాడు.. వచ్చేయొచ్చుగా అంకుల్ అంటే దానికి ఇంకా టైమ్ ఉంది అంటాడు.. సరే గౌతమ్ వసు ధార మనసులో ఏమి ఉందో అనేది తెలుసుకుని నాకు చెప్పు అనడంతో సరే అంటాడు గౌతమ్..

దేవయాని కల నిజం అవుతుందా..?

rishi vasudara romance
rishi vasudara romance

ఇక కాలేజ్ లో వసు వెనుక రిషి పరుగుబేడుతూ ఉంటాడు. రిషికి అందకుండా వసు పరుగేడుతూ ఉంటుంది. రిషి ఎలాగోలా వసును పట్టుకుని వసు నువ్వు కాలేజ్ టాపర్ అయ్యావ్.. అందుకే నీకు ఈ గిఫ్ట్ అంటు ఒక గిఫ్ట్ ఇచ్చి వసును దగ్గరకు తీసుకుంటాడు.అయితే ఇదంతా దేవయాని కల.వామ్మో ఇలా జరగడానికి వీల్లెదు.. కాలేజ్ లో వీళ్ళు ఇంకా దగ్గర అయ్యే అవకాశం ఉంది.. ఏదోటి చేయాలి అని వసు మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

పెద్దమ్మపై ప్రేమతో వసుపై కోప్పడిన రిషి :

rishi fire on vasudara
rishi fire on vasudara

తరువాత సీన్ లో వసును ఒక మేడం వచ్చి ఏంటి వసు.. జగతి మేడం వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్లిపోయారట అని అడుగుతుంది. వసు ఏమి మాట్లాడకుండా ఉండేసరికి నిన్న ఇంటికి ఫోన్ చేస్తే దేవయాని మేడం చెప్పారు అని మేడం అంటుంది. ఇక వెంటనే వసు రిషి దగ్గరికి వెళ్లి విషయం చెప్పి దేవయాని మేడం ఇలా చెప్పడం ఏంటి సార్ అనడంతో రిషి వసుపై సీరియస్ అవుతాడు. పెద్దమ్మ తప్పు ఏముంది డాడ్ వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు కాబట్టి అదే విషయం పెద్దమ్మ చెప్పారు ఇందులో ఆవిడ తప్పు ఏమి ఉంది అని అరుస్తాడు.అయినా డాడ్ వెళ్ళిపోదాం అంటే మీ మేడం అయినా చెప్పాలి కదా అని రిషి అంటాడు. పక్కనే ఉన్న గౌతం రిషిని కంట్రోల్ చేసి వసును బయటకు పంపించేస్తాడు. ఇక రిషి ఈరోజు కాలేజ్ లో తెలిసింది.. రేపు అందరికి తెలుస్తుంది. అందుకే డాడ్ వాళ్ళు కనిపించడం లేదు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని గౌతమ్ తో అనగా గౌతమ్ ఒక్కసారిగా షాక్ అవ్వడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju