23.2 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
Telugu TV Serials న్యూస్

Guppedantha Manasu November 4 Today Episode: వసు, రిషిల రొమాన్స్..కోపంతో ఊగిపోతున్న దేవయాని..!!

vasudara and rishi expressions
Share

Guppedantha Manasu November 4 Today Episode: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది.ఇక ఈరోజు November 4వ తేదీ Guppedantha Manasu సీరియల్ 598 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం.గత ఎపిసోడ్ లో వసు, రిషిలు చెరువు దగ్గర పడవలు వదులుతు సరదాగా గడుపుతారు. మరో పక్క దేవయాని వీళ్ళ గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది…

చపాతీలు చేస్తున్న వసు :

vasu with dharani
vasu with dharani

ఇక ఈరోజు ఎపిసోడ్ లో వసు కిచెన్‌లోకి వచ్చేసరికి.. ధరణీ చపాతీలు చేస్తూ ఉంటుంది. ‘రిషీకి చపాతీలంటే చాలా ఇష్టం అని చెప్పడంతో వెంటనే నేను చేస్తాను అని రిక్వస్ట్ చేస్తుంది. ఇక ధరణి కూడా రిషికి. చపాతీలు అంటే ఇష్టం అని వసు చేస్తా అంటుందా అనుకుని సరే అని అనడంతో వసు చపాతీలు చేయడం మొదలుపెడుతుంది. ఎలాగో వసుధార చపాతీలు చేస్తుంది కదా అని ధరణీ చిన్న పని ఉంది ఇప్పుడే వస్తాను అని వెళ్తుంది.

అమాయకత్వం నటిస్తూ దేవయానికి చుక్కలు చూపిస్తున్న ధరణి :

devayani reaction
devayani reaction

నాకు కాస్త తలనొప్పిగా ఉంది అని ధరణిని పిలిచి తనచేత జండూబామ్. రాపించుకుంటూ ఉంటుంది దేవయాని. ఎప్పటిలాగానే ధరణి. కూడా కాస్త అమాయకత్వం నటిస్తూ దేవయాని చెప్పిన ప్రతి దానికి అలాగే అత్తయ్యగారు అని అంటుంది. వాళ్ళు ఏమి చేస్తున్నారు ధరణి అని అడగగానే ఎవరు జగతి అత్తయ్యా వాళ్ళ అని ధరణి అంటే… దేవయాని కోపంగా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నేను ఎందుకు అడుగుతాను.. ఆ రిషి, వసుదారలు గురించి అంటున్న అంటుంది. వాళ్ళని కనిపెట్టుకుని ఉండలేక చస్తున్నా అంటూ కాస్త అసహనంగా అంటుంది దేవయని..

వసు, రిషిల రొమాన్స్ :

rishi vasu romance
rishi vasu romance

సీన్ కట్ చేస్తే వెనుక ఏదో అలికిడి అవ్వడంతో ధరణి వచ్చింది అనుకుని వసుధార ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. నిజానికి వచ్చింది ధరణి కాదు రిషి.ఆ విషయం తెలియక వసు మేడమ్.. రిషీ సార్‌కి చపాతీలంటే అంత ఇష్టమా.. నాకు చాలా బాగా చేయడం వచ్చు ఈ చపాతీలు రకరకాలుగా చేయగలను నేను అని దీనికి రిషి సార్ పేరే పెడతాను. ప్రిన్స్ చపాతీ..’ అంటూ ఏదేదో మాట్లాడేస్తూ ఉంటుంది వసు. తీరా చూస్తే వెనుక ఉన్నది రిషి అని తెలిసి నాలుక కరుచుకుంటుంది. ఇక రిషి వచ్చి డీబీఎస్‌టీ చపాతీ అని పెట్టకపోయావా.? అంటూ వెటకారం చేస్తాడు. నీతో పాటుగా నేను చపాతీలు చేస్తాను అనడంతో వద్దు అంటుంది వసు.. పర్లేదు నాకు నేర్పించు అనడంతో ఇద్దరి మద్య రొమాన్స్ సీన్ నడుస్తుంది. ఇద్దరి చూపులు కలిసి వీళ్ళ మధ్య రొమాన్స్ పండే సమయంలో అనుకోకుండా ధరణీ.. ‘రిషీ’ అని వచేస్తుంది. వాళ్లని అలా చూసి పక్కకు తప్పుకుని ‘రిషి మీ పెద్దమ్మ పిలుస్తున్నారు’ అంటుంది. దాంతో రిషి, వసులు ఉలిక్కిపడి దూరం జరిగిపోతారు. సరే వదినా అంటూ రిషి తలదించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

దేవయాని మాటలను వినని రిషి :
rishi reaction
rishi reaction

ఇక రిషి దేవయాని దగ్గరకు వెళ్లి పెద్దమ్మా రమ్మన్నారట..?’ అంటూ వెళ్తాడు. ఇక దేవయాని దొంగ ప్రేమ నటిస్తూ త్వరలో మీ పెదనాన్నగారు వస్తా అన్నారు.. ఆయన రాగానే వసుధార వాళ్ల అమ్మానాన్నలకు కలుద్దాం. పెళ్లి నిశ్చయించుకుందాం..’ అంటుంది దేవయాని. సరే అంటాడని ఆశపడుతుంది. కానీ రిషి నో అంటాడు. ‘పెద్దమ్మా పెళ్లి విషయం డాడ్ లేకుండా ఎలా నిర్ణయించుకుంటాం? డాడ్ వాళ్లు వచ్చాకే ఇవన్నీ ఆలోచించుకుందాం పెద్దమ్మా..’ అంటాడు. దేవయాని మాత్రం అలా కాదు రిషి పెళ్లి పనులు మొదలుపెడితేనైనా వాళ్లు వస్తారేమో కదా?’ అంటుంది. ‘డాడ్ లేకుండా ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు పెద్దమ్మా..’ అని తెగేసి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు రిషి.

మేడపై దీపాలు వెలిగిస్తున్న రిషి, వసూలు :
rishi vasudara on night mood
rishi vasudara on night mood

ఇక దేవయాని కోపంతో రిషి ఈ మధ్య.. నా మాటని వినడం మానేశాడు..’ అనుకుంటుంది.ఇక రిషి, వసులు మేడ మీద దీపాలు పెట్టి దేవుడికి దన్నం పెట్టుకునే సీన్ ఓపెన్ అవుతుంది. ఇద్దరు కలిసి మెడ మీద కాండిల్స్ తో దీపాలు పెడుతూ ఉంటారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో వసు తలస్నానం చేసి రూమ్ లోకి వస్తే రిషి హెయిర్ డ్రైయర్ పట్టుకుని వసు తల ఆర్పేందుకు సిద్ధమైపోతాడు. మీరు ఇలా చేయడం ఏంటి వద్దు అంటుంది వసు.ఆ సమయంలో కూడా ఇద్దరి మధ్య రొమాన్స్ మొదలవుతుంది. మరిన్ని వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం!


Share

Related posts

కొలువుల జాతర … నోటిఫికేషన్ లు విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం …

venkat mahesh

YCP Plenary 2022: వైసీపీ ప్లీనరీ .. జగన్ టార్గెట్స్ ..! టీడీపీని వణికించేలా భారీ ప్లాన్స్

Special Bureau

25 వేల టన్నుల..! ఉల్లి దిగుమతి..!!

Vissu