NewOrbit
Telugu TV Serials న్యూస్

Guppedantha manasu today episode, October 28: అమ్మ ప్రేమతో పాటుగా అమ్మాయి ప్రేమను కుడా పోగొట్టుకుని రిషి లూజర్ అవుతాడా..??

Guppedantha Manasu October 28 Today Episode Highlights
Share

Guppedantha manasu today episode, October 28: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది.ఇక ఈరోజు అక్టోబర్ 28 వ తేదీ Guppedantha Manasu సీరియల్ 593 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం.గత ఎపిసోడ్ లో రిషి తన బాధను గౌతమ్ తో చెప్పుకుంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో కూడా అదే సీన్ కంటిన్యూ అవుతుంది. చిన్నప్పుడు రెండు అక్షరాల ఒక పిలుపు కోసం బాధపడ్డాను.ఇప్పుడు అదే పిలుపు నాకు నా ప్రేమను దూరం చేసేలాగా ఉంది అని గౌతమ్ దగ్గర బాధ పడుతూ ఉంటాడు రిషి.

 

rishi feels looser
rishi feels looser


నేనొక లూజర్ అంటూ బాధపడుతున్న రిషి :

గౌతమ్, రిషిల మాటలను వసు డోర్ బయట నుంచిని విని ఏడుస్తూ ఉంటుంది.వసు నన్ను అన్ని విషయాల్లోనూ బాగానే అర్థం చేసుకుంటుంది ఈ ఒక్క విషయంలో తప్ప. ఆ పిలుపు వెనకాతల ఎన్ని బాధలు ఉన్నాయో ఎవరు అర్థం చేసుకోవడం లేదు.నేను ఒక లూజర్ ని అని చాలా బాధపడతాడు రిషి. గౌతమ్ కూడా రిషిని ఓదారుస్తూ బాధపడతాడు. డాడ్ వెళ్లిపోయాక ఇంకేం మిగిలిందిరా నాకు పోగొట్టుకోవడానికి, వసుధార,ఆమె ప్రేమే కదా అని ఇంకా ఏదో చెప్పే సమయానికి వసు వచ్చి రిషి నోటికి అడ్డంగా చేయి పెట్టి మాట్లాడకుండా ఆపేస్తుంది.

Advertisements
vasudara supports rishi
vasudara supports rishi

మీకు నేను ఉన్నాను.. అంటూ రిషిని ఓదార్చిన వసు :


వసు రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గౌతమ్. మీరు అలా అనకండి సార్ మీరు నేను వేరు కాదు.నేను మీ నీడని సార్ అంటుంది..మీ నుంచి విడిపోవలసి వస్తే నేను బ్రతికి ఉండలేను సార్ అని రిషిని ఓదార్చుతుంది. అన్నిట్లోని నన్ను బాగా అర్థం చేసుకుంటావు ఎందుకు ఆ ఒక్క విషయంలోనే ఎందుకు అంత పట్టుదల నీకు అని అడుగుతాడు రిషి. వసు మళ్ళీ మొదటికే వచ్చి తన స్టైల్ లో రిషిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది.తరువాత అసలు ఈ పొగరు కి బుద్ధి లేదు సార్ అని, మీరు ఏమి ఆలోచించకుండా పడుకోండి అని చెప్పి వెళ్ళబోతుంటే.. రిషి వసును పిలిచి “ప్రేమంటే శాసనం కాదు ప్రేమంటే అంకింతం ” అంటాడు.ఆ మాట విన్న వసుకు ఏడుపు వస్తుంది..ఇక సీరియల్ లో ఒక ఎమోషనల్ సాంగ్ రన్ అవుతుంది. ఒక పక్క రిషి బాధ పడుతుంటే మరో పక్క వసు కూడా రిషిని తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. అలాగే మహేంద్ర, జగతి కూడా రిషిని తలుచుకుని బాధ పడుతూ ఉంటారు..

rishi gives coffee to vasudara
rishi gives coffee to vasudara

వసుకు కాఫీ తీసుకుని వెళ్లిన రిషి :

సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం వంటగదిలో వున్న ధరణి దగ్గరికి వస్తుంది దేవయాని.రిషికి కాఫీ ఇచ్చేవా అని అడుగుతుంది. ఇంకా లేదు అని ధరణి అనడంతో తన గురించి పట్టించుకోకపోతే ఎలాగా మహేంద్ర జగతిలు ఎలాగో వదిలేశారు నువ్వు అయినా పట్టించుకోకపోతే ఎలాగా అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రిషిని చూసి నీకు ఈ పెద్దమ్మ ఉంది అని అతనికి కాఫీ కలిపి తాగమని. చెబుతుంది దేవయాని. ఇక ధరణి మాత్రం. మనసులో ఏం నటిస్తుంది అని అనుకుంటుంది.రిషి మాత్రం కాఫీ తాగకుండా ఆగి వసు కాఫీ తాగిందా అని అడుగుతాడు. ఇంకా రాలేదు రిషి అని అంటుంది ధరణి. సరే నేను తీసుకుని వెళ్లి ఇస్తాను అని అంటాడు రిషి. నువ్వెందుకు తీసుకుని వెళ్లి ఇవ్వడం తనే వచ్చి తాగుతుందిలే అని అంటుంది దేవయాని. తను పరాయిదేమి కాదు కదా పెద్దమ్మ మన ఇంట్లో ఉంది తన బాగోగులు మనమే చూసుకోవాలి అని అక్కడ వసు దగ్గరకు కాఫీని తీసుకుని వెళ్తాడు రిషి.

devayani fire on rishi
devayani fire on rishi

 

రిషి చేసిన పనికి కోపంతో ఉగిపోతున్న దేవయాని :

రిషి ప్రవర్తన చూసి రిషి మారిపోయాడు నాకేమీ నచ్చట్లేదు అని అంటుంది దేవయాని. అందరూ మనకి నచ్చినట్లుగా ఉండాలనుకోవడం తప్పు అంటుంది ధరణి. ఇక దేవయాని మాత్రం నువ్వు కూడా నాకు చెప్తున్నావా? ఈమధ్య నీకు కూడా పొగరు ఎక్కువైంది అని ధరణిని అంటుంది.ఇక వసు మాత్రం మేడం నా మీద కోపం వస్తే కొట్టాలి లేదంటే తిట్టాలి కానీ ఇల్లు వదిలి వెళ్లిపోవడమేమిటి అని జగతిని అడుగుతుంది.రిషి సార్ ఎంత బాధ పడుతున్నారు. అయినా ఇదంతా మీకోసమే కదా చేస్తున్నాను. మీ బాధ రిషి సర్ బాధ రెండు కరెక్టే, అయినా అలా వెళ్లిపోవడం ఏమిటి వచ్చేయండి మేడం అని అంటుంది వసు. అప్పుడే కాఫీ తీసుకొని అక్కడికి వచ్చిన రిషికి వసు ఎవరితో మాట్లాడుతుందో అర్థం కాదు. నిద్రపోతున్న వసును లేపి వసు అని అంటాడు.స్పృహలోకి వచ్చిన వసు మేడమ్ కి మెయిల్ పెట్టాను కదా అదే ధ్యాసలో ఉండిపోయినట్టు ఉన్నాను అని అనుకుంటుంది.సరే కాఫీ తాగు అని సాసర్లో పోసి ఇస్తాడు.అయినా మీరు ఎందుకు కాఫీ తెచ్చారు సార్ అని అడుగుతుంది వసు. ఏం నేను తేకూడదా అని అడుగుతాడు రిషి. మీరు ప్రిన్స్ సర్, మీకు ఏ ఇబ్బంది కలగనివ్వనుమీ ప్రతి పని వెనకాల నేను ఉంటాను అని అంటుంది వసు.

vasudara punches to devayani
vasudara punches to devayani
వసు ఇచ్చిన షాక్ కి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితిలో దేవయాని:

ఇక వసు రెడీ అయ్యి బ్యాగ్ తగిలించుకుని మెట్లు దిగి కిందకి వస్తుంది. అక్కడే సోఫాలో కూర్చున్న వసుని చూసి వెళ్ళిపోతున్నావా? నీ ఆరోగ్యం జాగ్రత్త అని అంటుంది దేవయాని. నేను అంత తొందరగా వెళ్ళిపోను. రిషి సార్ వెళ్ళమంటేనే వెళ్తాను.ఒకవేళ సార్ వెళ్ళమని చెప్పినా కూడా నాకు నచ్చకపోతే వెళ్ళను అని అంటుంది వసు. నీకు ఈమధ్య పొగరు బాగా ఎక్కువైంది అని గట్టిగా అంటుంది దేవయాని.అప్పుడే రిషి బయటకు వచ్చి ఏంటి పెద్దమ్మ వసుని ఏదో అడుగుతున్నారు అని అంటాడు. వెంటనే వసు నేను చెబుతాను సార్ అంటూ నేను మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నాను అంట, ముందు ముందు కూడా ఇంకా బాగా చూసుకోమని నాకు చెబుతున్నారు అని రిషి దగ్గర దేవయానిని బుక్. చేస్తుంది.. ఇక దేవయాని అయితే నవ్వాలో ఏడవాలో తెలియక అలానే నవ్వు నటిస్తుంది.తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Share

Related posts

Prabhas : ‘ ఆ సినిమా ఆపేయి అన్నా .. నీకు దండం పెడతాం ‘ ప్రభాస్‌కు మొర పెట్టుకుంటున్న ఫ్యాన్స్ !

Ram

పాక్ ఉగ్రవాదుల సముందర్ జిహాద్!

Siva Prasad

బిగ్ బాస్ 4 : ఈ వారం డబుల్ ఎలిమినేషన్…? 9 మందిలో ఎవరు వెళ్ళిపోతున్నారు అంటే…

arun kanna