NewsOrbit
Telugu TV Serials

Guppedantha manasu: వసు బైక్ ఎక్కిన రిషి…. మరోపక్క వీళ్ళ ప్రేమ బంధానికి అడ్డుగా మారుతున్న అమ్మ అనే అనుబంధం..!!

Guppedantha manasu :బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 573వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు అక్టోబర్ 06 న ప్రసారం కానున్న గుప్పెడంత మనసు సీరియల్లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.గత ఎపిసోడ్ లో దేవయాని మహేంద్ర దగ్గరకు వచ్చి వసు, సాక్షిలు కాకుండా వేరే అమ్మాయితో రిషికి పెళ్లి చేద్దాం.. దానికి నువ్వే రిషిని ఒప్పించు అని మహేంద్రను అడుగుతుంది. అలాగే వసు, రిషి ఇద్దరు కలిసి మెషిన్ ఎడ్యుకేషన్ లొకేషన్ విజిట్‌కి వెళ్లి తిరిగి ప్రయాణం అయ్యారు. అదే సీన్ నేటి కథనంలో కంటిన్యూ అయ్యింది.చాలా సేపు ఇద్దరు కలిసి జామకాయ ముక్కలు తింటూ ప్రేమగా సరదాగా మాట్లాడుకుంటారు.

రిషిని బైక్ ఎక్కించుకున్న వసు :

Vasu rishi bike


ఇద్దరు కలిసి కారు దగ్గరకు వెళ్తున్నప్పుడు వసు గురుదక్షిణ గురించిన టాపిక్ ఎత్తడంతో బై అని కారు వేసుకుని వెళ్లిపోతాడు. ఇక వసు బైక్ తీసుకుని బయలుదేరుతుంటే రిషి ఎదురుపడతాడు.ఏమైంది సార్ అంటే కార్ టైర్ పంచర్ అయ్యింది లిఫ్ట్ కావాలి ఇస్తావా అంటాడు. వెంటనే వసు కాసేపు ఆటపట్టించి రిషిని బండి ఎక్కించుకుంటుంది. అయితే రిషి బండి మీద ముందు తిరిగి కూర్చోకుండా వెనక్కి తిరిగి కూర్చుంటాడు. అలాగే వసు మధ్య మధ్యలో బ్రేక్స్ వేస్తూ సరదాగా వెళ్తూ ఉంటారు.కొంత మంది అయితే రిషిని చూసి నవ్వడంతో బండి ఆపించి వసును బైక్ వెనకాల కూర్చోమని తను డ్రైవ్ చేస్తూ వసు ఉండే బస్తీకి వస్తాడు.

బలపడుతున్న వసు, రిషిల బంధం :

Vasu rishi love track

అక్కడ రిషి వసుకి బై చెప్పి వెళ్తాడు కానీ మళ్ళీ వసు రూమ్ కు వచ్చి వసు పక్కన కూర్చుని వసుధారా నేను చెప్పేది పూర్తిగా విను.. మనిద్దరం కారులో కలిసి ప్రయాణం చేస్తేనే బోలెడన్ని జ్ఞాపకాలు.అదే జీవితాంతం కలిసి ప్రయాణం చేస్తే ఇంకెంత బాగుంటుంది. ప్రేమ అంటే ఎదుటి వారిని భరించడమా? గౌరవించడమా?’ అంటాడు రిషి. ‘సార్ ప్రేమంటే అన్నీ సార్.. మిమ్మల్ని బాధించాలని నేను ఎప్పుడూ అనుకోను సార్ అంటుంది. రిషి చిన్నప్పటి. సంఘటనలు గుర్తు చేసుకుంటూ కాస్త ఎమోషనల్ అవ్వడంతో వసు కూడా ఏడుస్తుంది.

రిషి మాటలకూ వసు ఎందుకు ఏడ్చింది:

Vasu rishi

‘ఏడుస్తున్నావేంటీ.? అని రిషి అడిగితే ఆనందం సార్.. నాకు తెలియకుండానే కన్నీళ్లు వస్తున్నాయి అంటుంది.మీరెక్కడ నాకు దూరం అవుతారోనని మనసులో భయంగా ఉంది. పరీక్షలు కాగానే అమ్మా నాన్నల దగ్గరకు వెళ్లాలి అనుకున్నాను. కానీ మీకు దూరంగా ఉండలేక పరీక్షల రిజల్ట్ వచ్చాక వెళ్దామని నిర్ణయించుకున్నాను అంటుంది ఏడుస్తూ..మాయ చేసారు సార్ అని వసు అంటే నిజంగా మాయే వసుదార పాఠాల లెక్కలు చెప్పే నాకు జీవిత పాఠాలు చెప్పావు.. చివరి శ్వాస దాకా మనం కలిసి ఉండాలని ప్రయాణించాలని కోరుకున్నాను.. ఇప్పుడు ఈ దూరం శ్వాస ఆగిపోయేలా చేస్తోంది.

వసు, రిషిల ప్రేమకు అడ్డుగా మారనున్న జగతి :

ఎందుకు మన మధ్య ఈ దూరం?’ అంటాడు రిషి.నేను అదే చెబుతున్నాను.. ఈ దూరం జగతీ మేడమ్ అనే అభిప్రాయభేదం మాత్రమే ఉంది.. జగతీ మేడమ్‌ని మీరు అమ్మ అని పిలిచేస్తే..’ అంటూ వసు మాట పూర్తి కాకుండానే.. ‘ఆపు వసుధారా.. జీవితంలో నేనేం కోల్పోయానో నీకేం తెలుసు?’ అంటాడు ఆవేశంగా పైకి లేచి. ‘కోల్పోయిన తల్లి ప్రేమని ఇప్పుడైనా పొందొచ్చు కదా? జగతీ మేడమ్‌తో బంధం తెంచుకుంటారా?’ అంటుంది వసు. ‘ఏది పెంచుకోవాలో ఏది తెంచుకోవాలో నాకు బాగా తెలుసు.. నువ్వేం చెప్పాల్సిన పని లేదు’ అంటాడు రిషి.సార్ జగతీ మేడమ్ ఆ రోజు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఎప్పుడైనా తెలుసుకున్నారా?’ అంటుంది వసు. ‘తను ఎందుకు వెళ్లిందో.. నన్ను ఎందుకు వదిలిందో?వదిలేసి వెళ్తే నేనెంత బాధపడ్డానో నీకు తెలుసా? తెలుసుకోవడానికి ఏం లేదు వసుధారా అనేసి రిషి ఆవేశంగా అక్కడ నుంచి వెళ్లిపోతాడు.


author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Mamagaru: నా పెళ్లి వల్ల అందరూ కలుస్తారంటే తప్పకుండా చేసుకుంటాను అంటున్న సిరి..

siddhu

Naga Panchami: మోక్ష బాధను వైదేహి అర్థం చేసుకుంటుందా లేదా.

siddhu

Kumkuma Puvvu April 17 2024 Episode 2157: యుగంధర్ ఆశ ని గుర్తుపడతాడా లేదా

siddhu

Guppedanta Manasu April 17 2024 Episode 1052: మహేంద్ర ఇచ్చిన షాకింగ్ న్యూస్ కి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

siddhu

Malli Nindu Jabili April 17 2024 Episode 625: అరవింద్ మాలిని కళ్యాణం చేయించడం నాకు ఇష్టం లేదు అని చెప్పిన వసుంధర…

siddhu

Nindu Noorella Saavasam April 17 2024 Episode 213: పిల్లల బాధని విన్న అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 17 2024 Episode 340: రాధ తో గొడవ పడుతున్న రుక్మిణి…

siddhu

Karthika Deepam 2 April 17th 2024 Episode: శౌర్యకు తండ్రి ప్రేమ అందించిన కార్తీక్.. ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేసిన దీప..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 17 2024 Episode 204: అభితో రానని చెప్పి ఊరికి బయలుదేరుతున్న స్వర…

siddhu

Trinayani April 17 2024 Episode 1215: తిలోత్తమ విశాలాక్షి మెడలో తాళి పట్టుకోగానే, గాయత్రి ఏం చేయనున్నది..

siddhu

Jagadhatri April 17 2024 Episode 207: నిన్ను సీఈవో చేస్తాను అంటున్నా మీనన్, కౌశికి మీద రివేంజ్ తీర్చుకో అంటున్న మీనన్..

siddhu

Brahmamudi April 17 2024 Episode 386: వెన్నెల అబద్ధం.. రాజ్ పై కావ్య ప్రేమ నిజం.. రుద్రాణి ప్లాన్ సక్సెస్..ఆస్తి పేపర్లు అత్తచేతిలోకి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema April 17 2024 Episode 600: విక్కీని కాపాడిన పద్మావతి.. పోలీసుల రాకతో దివ్య కంగారు.. పద్మావతి ని కిడ్నాప్ చేయాలనుకున్న కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష చెప్పిన మాటలకు వైదేహి మనసు కరుగుతుందా లేదా.

siddhu

Krishna Mukunda Murari April 17 2024 Episode 447: డాక్టర్ తో కలిసి ముకుంద ప్లాన్.. ముకుందని నిలదీసిన ఆదర్శ.. రేపటి ట్విస్ట్.?

bharani jella