లాస్య నందుతో నువ్వు విడాకులు ఇచ్చిన తర్వాత తులసికి వచ్చిన బెస్ట్ ఛాన్స్ ఇది.. తులసి అలాంటిది కాకపోయినా కూడా సామ్రాట్ వేసిన వలలో చిక్కుకుంది.. ఇప్పుడు తులసి సామ్రాట్ తో వెళితే నీకు వచ్చిన నష్టం ఏమిటంట్ట అని లాస్య అడుగుతుంది.. తులసి గురించి నాకు ఎలాంటి భయం ఆలోచన లేదు తులసి వలన అనవసరంగా మా కుటుంబ పరువు పోతుందని మాత్రమే ఆలోచిస్తున్నాను అని నందు అంటాడు.. నేనే ఎలాగోలా తులసి వెళ్ళకోకుండా ఆపాలి అని అనుకుంటాడు నందు.. నువ్వు ఆపకపోయినా తులసి ముందరి కాళ్లకు బంధం నేను వేస్తా గాని లాస్య మనసులో అనుకుంటుంది..
తులసి ఇంట్లో వాళ్ళ అందరితో కలిసి రేపటి ఫ్లైట్ ప్రయాణం గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఈనాటికీ ఫ్లైట్లో ప్రయాణించ గలుగుతున్నానని తులసి ఆనందిస్తుంది. తులసి ఇకనుంచి నువ్వు పాత విషయాలు గురించి ఏమీ ఆలోచించకుండా జీవితంలో ఎలా ఎదగాలి అనే దాని గురించి ఆలోచించాలని వాళ్ళ మామయ్య చెబుతాడు.. తులసి ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నిద్రపోతుంది తులసి గారు ఎనిమిది అయిపోయింది. త్వరగా రండి ఫస్ట్ ఫ్లైట్ మిస్ అయిపోయింది. మీరు గనక టయానికి రాకపోతే నెక్స్ట్ ఫ్లైట్ కూడా మిస్ అవుతుంది అని సామ్రాట్ అంటాడు. వెంటనే లెగుస్తుండగా తులసి మంచం మీద నుంచి కింద పడిపోతుంది. అప్పుడు తన ఫోన్లో టైం చూస్తే నాలుగు అవుతుంది.. ఓహో ఇదంతా నా కల అని తులసి అనుకుంటుంది. అమ్మ ఎప్పుడు చెబుతూ ఉండేది ఏదైనా చెడు జరిగితే ఆ తర్వాత కచ్చితంగా మంచి జరుగుతుందని అనుకొని ఇక లెగిసి రెడీ అవుతుంది..
సామ్రాట్ తో కలిసి ఫ్లైట్ ప్రయాణానికి తులసి అన్ని సిద్ధం చేసుకుని దేవుడికి దండం పెట్టుకొని బయలుదేరుతుంది. అప్పుడే అభి మీ ఫ్రెండ్ నీకు రిసీవ్ చేసుకోవడానికి కార్ పంపించలేదని అంటాడు. ఇక్కడ ఒక చిన్న సవరణ సామ్రాట్ గారు నా ఫ్రెండ్ కాదు బిజినెస్ పార్టనర్ మాత్రమే.. ఆయన కారు పంపిస్తాను అని అన్నారు.. కానీ నేనే వద్దని చెప్పాను.. నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని అనుకుంటున్నాను అందుకే ఎవరి సహాయం తీసుకోవాలి అని అనుకోవడం లేదని తులసి అంటుంది.. ఇక తరువాయి భాగంలో తులసి సామ్రాట్ తో కలిసి ఫ్లైట్ ఎక్కుతుంది. ఇక ఆ విషయం గురించి అడిగి కడిగేయడానికి లాస్య నందు కలిసి తులసి వాళ్ళ ఇంటికి వస్తారు.. అప్పుడే ఇంటికి వచ్చిన వాళ్ళు తులసి ఎక్కడా అని అడుగుతారు. లాస్య కావాలని కల్పించుకొని సామ్రాట్ తో కలిసి షికారుకి వెళ్ళింది. ఇలాంటి వాళ్ళని మీరు ఏమంటారు అక్కయ్య గారు అని లాస్య అంటుంది.. తిరుగుబోతు అని అంటామని వాళ్ళందరూ అంటారు.. తులసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం..