ఇంట్లో వాళ్ళందరూ కలిసి తులసిని ఆటో ఎక్కిస్తూ ఉంటారు.. తులసి ఆటోలో ఏం చెక్క విమానం ఎక్కుతాను అనుకుంటూ గాల్లో తేలుతూ ఉంటుంది. అంతలో ఆటో డ్రైవర్ మేడం ఎవరో లిఫ్ట్ అడుగుతున్నారు.. పాపం బాగా అర్జెంట్ అనుకుంటా చేతిలో లగేజ్ బ్యాగ్ కూడా ఉంది అని ఆటో డ్రైవర్ అంటాడు.. ఇదేమైనా క్యాబ్ అనుకుంటున్నావా ఎవరికి పడితే వాళ్లకి ఆకు లిఫ్ట్ ఇవ్వడానికి నేను ఎవరికీ లిఫ్ట్ ఇవ్వను నువ్వు నేను చెప్పినట్టు వినాలి అని తులసి ఉంటుంది.. సరే అని ఆటో డ్రైవర్ ముందుకు వెళ్తాడు.. అప్పుడే ఆటో సైడ్ మిర్రర్ లో సామ్రాట్ ను చూసి ఆటో డ్రైవర్ని ఆటో ఆపమని చెబుతోంది తులసి..
ఏంటి సామ్రాట్ గారు మీరు ఎక్కడున్నారు అని తులసి అడుగుతుంది.. జాగింగ్ చేసుకుంటూ వస్తున్నాను బాడీ ఫిట్నెస్ కోసం అని సామ్రాట్ అంటాడు.. సరే అని తులసి ఉంటుంది. అప్పుడే ఆటో డ్రైవర్ సార్ మీ ఏజ్ ఎంత అని అడుగుతాడు.. మొన్నే 24 వెళ్లి 28 వచ్చిందని సామ్రాట్ జోక్ చేస్తాడు.. అలా కాదులే కానీ ఇంకో మాట చెప్పండి సార్ అని ఆటో డ్రైవర్ అంటాడు.. సరే సామ్రాట్ గారు మీరు జాగింగ్ చేసుకుంటూ ఏర్పాటుకు రండి.. ఈ లోపు నేను ఆటోలో వెళ్తాను అని తులసి అంటుంది.. అది కాదు తులసి గారు నాకు లిఫ్ట్ ఇవ్వండి అని.. సామ్రాట్ రెండు చేతులతో దండం పెడతాడు.. తులసి నవ్వుకుంటూ ఆటోలో పెట్టమని చెబుతుంది.. ఇద్దరూ కలిసి ఎయిర్ పోర్ట్ కి వెళ్తారు చెకింగ్ అయ్యి ఇద్దరూ కూర్చుంటారు..
అప్పుడే తులసి సామ్రాట్ ని మ్యూజిక్ స్కూల్ కి సంబంధించిన ప్రాజెక్ట్ ఫైల్ తీసుకొచ్చారని అడుగుతుంది తీసుకువచ్చాను మీకు నమ్మకం లేదేమో ఒకసారి చూపిస్తాను అని తన బ్యాగ్ లో నుంచి ఒక బుక్ తీస్తాడు ఫైల్ మిస్ అయిందని వెంటనే నందుకు కాల్ చేస్తాడు.. ప్రాజెక్ట్ ఫైల్ ఎక్కడుంది అని సామ్రాట్ అడుగుతారు ఆఫీసులో టేబుల్ పైన ఉందని చెబుతాడు.. అంటే మీరు తీసుకోలేదా సార్ అని నన్ను అడుగుతారు.. అదే కదా అర్థం. అర్జెంటుగా ఫైల్ తీసుకొని రా.. మీ ఇంటర్వ్యూస్ కూడా క్యాన్సిల్ చేసుకోమని చెబుతాడు.. నందు లాస్య ను తీసుకొని ఎయిర్ పోర్టుకు వస్తాడు.. నందు నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది.. నువ్వు మీ భార్యకు ఇస్తున్న ఇంపార్టెన్స్ నాకు నచ్చింది తులసి గారు మీరు ఏమంటారు అని సామ్రాట్ అడుగుతాడు..
.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!