బత్తాయి బాలరాజు నందిని చూస్తూ ఇదిగో మాస్టారు అంటూ.. తులసి, సామ్రాట్ వైపు చూస్తూ.. వాళ్ళిద్దరూ కచ్చితంగా ఓ రోజు పెళ్లి చేసుకుంటారు మీరు చూస్తూ ఉండండి అని అంటాడు.. ఫ్లైట్ దిగాక నీ సంగతి చెబుతాను అని నందు కోపంగా అంటాడు.. ఊరుకో నందు అని లాస్య అంటుండగా వీడి టార్చర్ నాకు ఎక్కువైపోయింది అని అంటాడు.. అప్పుడే ఫ్లైట్లో చిన్న సమస్య ఉంది అని అనౌన్స్మెంట్ వస్తుంది ..ఇక తులసి అందరినీ కూల్ చేసి ధైర్యంగా ఉండమని చెబుతుంది.. ఆ కాసేపట్లోనే ఫ్లైట్ బాగుందని టేక్ ఆఫ్ అవ్వడానికి సిద్ధంగా ఉందని అనౌన్స్ చేస్తారు.. తులసి స్పీచ్ కి అంతా క్లాప్స్ కొడతారు..
తులసి సామ్రాట్ ఇద్దరూ ఫ్లైట్ ప్రయాణం ముగించుకుని టేక్ ఆఫ్ అవుతారు ఇక సామ్రాట్ తులసిని నేరుగా ఓ ఫైవ్ స్టార్ హోటల్ కి తీసుకువెళ్తారు వారితో పట్టే లాస్య నందు కూడా వస్తారు.. సామ్రాట్ హోటల్లో మూడు రూమ్స్ ఇవ్వమని అడుగుతారు.. ఇప్పుడు రెండు రూమ్స్ ఉన్నాయని వాళ్ళు చెబుతారు విను అని లాస్య రన్నింగ్ కామెంటరీ చెప్తుంది.. ఇదంతా కేవలం సామ్రాట్ ప్లాన్ అని లాస్య అంటుంది.. నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు అని నందు లాసెను కంట్రోల్ చేస్తాడు.. లాస్య చెప్పినట్టుగానే ఒక రెండు రూములు మాత్రమే ఖాళీగా ఉన్నాయి అని చెబుతారు.. అయిత ఒక రూమ్ లో మీరు నేను ఉందమ.. ఇంకొక రూము తులసి లాస్య ఇద్దామని నందు అంటాడు.. లేదు లేదు మీరిద్దరూ కలిసి వచ్చారు కదా అలాంటప్పుడు మీ ఎంజాయ్మెంట్ ను నేను ఎందుకు దూరం చేయాలి.. మీరిద్దరూ ఒక రూమ్ లో ఉండండి అని నందు చూస్తూ సామ్రాట్ అంటాడు..
మరి మీ సంగతేంటంటే ఇక మేము ఇద్దరం చూసుకుంటాము అని సామ్రాట్ అంటాడు.. లాస్య పదా వాళ్ళిద్దరూ చూసుకుంటారు అన్నారు కానీ లాస్య అంటుంది.. ఈ రోజంతా ఖాళీగా ఉండటం కదా ఏం చేద్దామని లాస్య అంటుంది ఏం చేస్తాం ఎవరు రూంలో వెళ్లి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందామని సామ్రాట్ అంటాడు.. సామ్రాట్ తులసిని తీసుకుని వైజాగ్ బీచ్ తీసుకెళ్తాడు.. తులసి బీచ్ లోకి కొడుతూ ఆడుతుంది.. ఎక్కడ లేని సంతోషం తులసి కళ్లలో చూసి సామ్రాట్ కూడా ఆనందిస్తాడు.. ఇక అలా తులసి బీచ్ లో ఆడుతూ ఉండగా.. సామ్రాట్ కు ఓ న్యూస్ వినిపిస్తుంది.. ఎవరో ఒక ఆవిడ బీచ్ లో ఆడోళ్ళకి కొట్టుకుపోయారట అని వెంటనే అక్కడికి వెళ్లి చూస్తే తులసి కనిపించదు.. ఇక ఏమవుతుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..