తులసి వాళ్ళ ఇంటికి నందు, లాస్య వాళ్ళ పలకరించడానికి వస్తారు.. అలా అనసూయమ్మ ను పక్కకు పిలుస్తారు.. ఎందుకురా పక్కకు రమ్మని పిలిచావు ఇంట్లో అందరినీ వదిలి పెట్టేసి నాతో మాట్లాడుతున్న విషయం ఏముంది అని నందు లాస్యను చూస్తూ అనసూయమ్మ అడుగుతుంది.. ఈ వయసులో కూడా మీ కంటి చూపు చాలా షార్ప్ గా ఉంది అత్తయ్య.. కానీ విచిత్రం ఏమిటంటే మీ పక్కనున్న తులసి చేసే తప్పులు మాత్రం మీకు కనిపించడం లేదు అని లాస్య అంటుంది.. ఇక మళ్ళీ స్టార్ట్ చేసావా తులసి మీద కంప్లైంట్ ఇవ్వడానికి అని లాస్యను దెప్పి పొడుస్తుంది అనసూయమ్మ..
తులసి నిప్పులాంటిది రా అలా మాట్లాడకు అని అనసూయమ్మ అంది.. ఒక్కసారి ఈ ఫోటోలు చూసి ఆ మాట చెప్పండి అని లాస్య సామ్రాట్, తులసి కలిసి ఉన్న ఫోటోలు చూపిస్తుంది.. ఇప్పుడు చెప్పండి అత్తయ్య.. ఆ ఫోటోలలో ఉంది తులసి కాదు కదా.. చూశావా అక్కడ వాళ్లతో ఉన్న మేము కూడా ఆ దృశ్యాలు చూడలేక చచ్చం.. అయినా తులసి ఏం తప్పులేదు ఏం చేయదు అని మీకు అనిపిస్తే మేము చేసేది ఏమీ లేదు అని లాస్య అంటుంది.. నీ వెనకమాల ఏం జరుగుతుందో ఇప్పటికైనా తెలుసుకో అమ్మా అని నందు అంటాడు.. ఈ ఇంట్లో వాళ్లందరూ ముందు తులసి గురించి ఏం చెప్పినా చెవిటోడి ముందు శంఖం ఊదినట్లే నువ్వేమంటావు నందు అని లాస్య అడుగుతుంది అవును అని అంటాడు.. కేవలం మీరు మాత్రమే నిష్పక్షపాతంగా బ్యాలెన్స్డ్ గా ఆలోచిస్తారు.. అత్తయ్య అని లాస్య తులసి మీదకి అనసూయమ్మను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది.. ఏది మంచో ఏది చెడో చూసుకొని సరైన డిసిషన్ తీసుకుంటారు అని అంటుంది లాస్య.. అందుకే ఈ ఫోటోలు అందరి ముందు పెట్టకుండా మీ చేతికి ఇచ్చాను అని లాస్య అంటుంది.. ఇప్పటికీ తులసి పై ఉన్న నమ్మకం ఉంటే ఆ ఫోటోలు చింపేసేయండి.. మన ఇంటి పరువు పోకూడదు అనుకుంటే మీరే సరైన డేసిషన్ తీసుకోవాలి అత్తయ్య అని లాస్య అంటుంది.. ఇక మీరే సరైన నిర్ణయం తీసుకోవాలని నందు, లాస్య అక్కడ నుంచి వెళ్ళిపోతారు..
శృతి నేను వెళ్లాలి అని అంటుంది.. మొన్న ఎక్కడో మార్కెట్ లో అభీకి కనిపించిందట.. అంటే కౌసల్య కు బాగానే ఉంటుంది కదా.. శృతిని నువ్వు ఇక్కడే ఉండిపో అని అంటుంది తులసి.. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఇక్కడే ఉండిపో అని తులసి అంటుంది.. నీ మనసులో ఉన్న అలోచలన్ని మరిచిపోయి ఇక్కడే ఉండిపోమని చెబుతాడు.. ప్రేమ్ మనసులో శృతి మనసు మార్చుకుందా.. అది జరిగితే అంత కంటే మంచిది ఇంకేం ఉంటుంది అని ప్రేమ్ అనుకుంటాడు..