సామ్రాట్ వాళ్ళ ఇంట్లో స్పెషల్ పార్టీ సంబరాలు బాగా జరుగుతున్నాయి.. హనీ కోసం సామ్రాట్ ఏర్పాటు చేసిన ఈ పార్టీలో నందు సామ్రాట్ ఇద్దరు కలిసి వంటలు చేస్తారు.. వంటలను ముందుగా తులసి లాస్య టేస్ట్ చేసి ఫైనల్ విన్నర్స్ ఎవరో చెప్పాలి అని అనుకుంటారు కానీ.. తులసి ఆ ప్లాన్ ను చేంజ్ చేస్తుంది. ఈ కాంపిటీషన్లో వాళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ చెప్పవలసిందిగా పరంధామయ్య అనసూయమ్మకు బాధ్యత అప్పగిస్తుంది.. వాళ్ళిద్దరూ వాళ్ళు చేసిన వంటలను టేస్ట్ చేసి సామ్రాట్ వంటలు బాగున్నాయని చెబుతారు..
సామ్రాట్ దివ్య ఇద్దరు చెస్ ఆడుతుంటారు.. మా డాడీని మీరంతా ఒక్కడినే చేసి ఆడుతున్నారు. ఇది చీటింగ్ అని అంటుంది హనీ.. వెంటనే లక్కీ కావాలంటే తులసి ఆంటీని సపోర్ట్ తెచ్చుకోమని హనీ కి సలహా ఇస్తాడు.. వీడొకడు ఎప్పుడు చూసినా సామ్రాట్ కి సపోర్ట్ చేస్తున్నాడు అని నందు కోపంగా అంటాడు.. లాస్య కూల్ నందు వాడు చిన్నపిల్లోడు ఏదో తెలియక అలా అన్నాడు అని అంటుంది. అయినా మీ ఆవిడకు చెస్ ఆడటం రాదా అని అంటుంది ఏమో నాకు తెలియదు అని విసుగ్గా అంటాడు నందు అంత మంది ఉన్నా కూడా సామ్రాట్ దివ్య కు చెక్‌మేట్ పెడతాడు..
అప్పుడే తులసి ఇంటికి వెళ్దాం అని అంటుంది.. మా నాన్న వన్ హ్యాండ్ బాగా ఆడతాడు అని అంటుంది.. అయితే అంకుల్ అడండి అని లక్కీ అంటాడు.. హనీ డాడీ నువ్వు ఆడాల్సిందే అని ఒత్తిడి చేయగా సామ్రాట్ ఒప్పుకుంటాడు.. నందు సామ్రాట్ ఇద్దరు బలాబలాలు చూపిస్తారు… కానీ తులసి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతోంది.. మిగతా విశేషాలు తరువాయి భాగంలో చూద్దాం..