Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

Share

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్ ఆఫ్ చేసి దుప్పటి కప్పుకుంటే హాయిగా నిద్ర పడుతుంది అని సామ్రాట్ అంటాడు.. నాకు అలాంటి నిద్ర వద్దు డాడీ.. అమ్మ ఒడిలో పడుకొని తను చెప్పి కబుర్లు కథలు వింటూ నిద్ర వస్తున్నా కానీ ఆ మాటల్లో పడి ప్రశాంతంగా నిద్ర పోవాలని ఉంది అని హనీ అంటుంది..! అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసంట.. నాకే తెలుసుకొనే ఛాన్స్ కూడా లేదు కదా నాన్న అని హనీ అని అంటుంది..!ఆ దేవుడు అందరికీ అన్ని ఇవ్వడు.. !

ఇలారా నా ఒడిలో తల పెట్టుకొని పడుకో నేను కథ చెబుతాను అని సామ్రాట్ అంటాడు.. ఒక్కసారి తులసి ఆంటీ కూడా ఇలాగే నన్ను ఒడిలో పడుకోబెట్టుకుని కబుర్లు చెబుతూ అన్నం తినిపించింది అమ్మ బ్రతికే ఉంటే అచ్చం తులసి ఆంటీ లాగి నన్ను చూసుకునేది కదా తులసి ఆంటీని అమ్మ అని పిలవాలని ఉంది పిలిస్తే తను ఏమనుకుంటుందోనని భయం.. తను ప్రేమగా చూసుకుంటుంది నాన్న అంటూ అని హనీ నిద్రపోతుంది.. హనీ మాటలకు సామ్రాట్ కు తెలియకుండానే తన కళ్ళలో నుంచి నీళ్లు వస్తాయి..

హనీ నేను నిద్రపుచ్చి సామ్రాట్ కూడా నిద్రపోతాడు.. సామ్రాట్ నిద్రలోకి జారుకోగానే తులసి వీణ వాయిస్తూ యమునా నదిలో నల్లనయ్య అంటూ పడుతున్నట్టు.. సామ్రాట్ కలలోకి తులసి పాటపడుతున్నట్టు వస్తుంది.. వెంటనే సామ్రాట్ నిద్రలో నుంచి మేల్కొని మొహం కడుక్కొని.. తులసి కేవలం నా ఫ్రెండ్ మాత్రమే.. ఇంకొకసారి ఇలాంటి కలలు కనకుడదు అని అనుకుంటాడు సామ్రాట్..

నందు వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి తులసి మా బాస్ తో కలిసి వైజాగ్ టూర్ వెళ్తుంది.. నిన్ను పర్మిషన్ అడిగితే ఇవ్వవద్దు అని చెబుతాడు.. అనసూయమ్మ నందు మాటలు పూర్తిగా కాకుండానే కాల్ కట్ చేస్తుంది.. తులసి వైజాగ్ ప్రయాణం చెప్పే ప్రయత్నం చేయగా తనని తప్పు పట్టినట్టు మాట్లాడి నిర్మొహమాటంగా నువ్వు వైజాగ్ వెళ్లొచ్చు అని ఒప్పుకుంటుంది నీకు నీ నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది అని చెబుతుంది.. ఇక రేపటి ఎపిసోడ్లో సామ్రాట్ ఎయిర్పోర్ట్ లో ఉంటాడు.. కానీ తులసి టైం అయినా కూడా రాదు సరే కదా అని సామ్రాట్ కాల్ చేస్తాడు.. త్వరగా రమ్మని అంతలో తులసి మంచం మీద నుంచి కింద పడి పోతుంది.. ఇక తులసి వైజాగ్ వెళ్తుందా లేదా అనేది చూడాలి..


Share

Related posts

“బాహుబలి” మానీయా జపాన్ లో “RRR”..??

sekhar

Krithi Shetty: బేబ‌మ్మ‌ను వ‌ద‌ల‌ని చైతు.. మ‌ళ్లీ లైన్‌లో పెట్టేశాడు!

kavya N

ర‌వితేజ ఖాతాలో బిగ్ డిజాస్ట‌ర్‌.. తేల్చేసిన `రామారావు` వీకెండ్ క‌లెక్ష‌న్స్!

kavya N