Intinti Gruhalakshmi: అనసూయమ్మ తులసిని ఒక కోరిక కొరతాను అని అంటుంది.. మళ్ళీ నన్ను ఈ ఇంటికి రమ్మని చెప్పడం తప్ప ఇంక మీరు ఏం అడిగినా పర్లేదు చేస్తాను అని తులసి అంటుంది.. నాకు తెలుసు తులసి నువ్వు ఆ మాట అంటావని.. నువ్వు ఈ ఇంటికి తిరిగి రవాని నాకు తెలుసు.. కానీ అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండమని చెబుతుంది.. ఆ మాటకు అంతా తులసి వైపు చూస్తారు.. తులసి ఏం సమాధానం చెబుతుందా అని చూస్తున్నారు..
తులసి అనసూయమ్మ తో అత్తయ్య మీకోసం నా పంతాలు , పట్టింపులు అని పక్కన పెట్టీ అప్పుడప్పుడు ఇలాగే వస్తు పోతు ఉంటాను అని చెబుతుంది. ఆ మాటకి అంతా సంతోషిస్తారు.. పరంధామయ్య కూడా అనసూయమ్మ తో సరదాగా మాట్లాడతాడు. నవ్వుతూ జోకులు వేస్తాడు. రూమ్ లోపల ఏం జరుగుతోందో అని లాస్య కంగారు పడుతుంది. తులసి ఆ గదిలో నుంచి బయటకు వచ్చి పూజ గదిలో దీపం వెలిగిస్తుంది. అది చూసిన లాస్య కి ఇంకా కోపం వస్తుంది..
Intinti Gruhalakshmi: తులసి సామ్రాట్ పాటల పోటీ.! అనసూయమ్మ కోరిక తులసి నెరవేరుస్తుందా.!?
లాస్య తులసి గురించి నీచంగా మాట్లాడుతుంది. తులసి కూడా లాస్య కి స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇస్తుంది. ఇద్దరి మధ్య మాటల తూటాలు పెలతాయి. మొత్తానికి తులసి లాస్య కి సరైన రీతిలో బుద్ది చెబుతుంది. పెద్దగా ఆరవకు లాస్య నువ్వు అరిస్తే ఆ అరుపులకు మీ ఆయన బయటకు వచ్చేసాడు. నీకే నలుగంటి తలస్నానం చేయిస్తాడు. నాకు ఏం కాదు అని తులసి అంటుంది.
ఇక రేపటి ఎపిసోడ్ లో తులసి ఒంటరిగా ఎదగడానికి సామ్రాట్ సహాయం చేయాలని అనుకుంటాడు. తనని న్యూ లైఫ్ స్టార్ట్ చేయమని సలహా ఇచ్చిన సామ్రాట్ తులసి కోసం బస్ లో ట్రావెల్ చేస్తాడు. సామ్రాట్ వాలకం చూసి కండక్టర్ కూడా తన పై పంచ్ వేస్తాడు. మొత్తానికి రేపటి ఎపిసోడ్ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అర్థమవుతుంది.