Intinti Gruhalakshmi: నందు కోపంగా వచ్చి వినోద్ చంప పగలగొడతాడు. ఇక కోపంతో తులసి వాళ్ళ అమ్మ నందు అని పెద్దగా అరుస్తుంది. నాకు సంస్కారం ఉంది కాబట్టే నిన్ను పేరు పెట్టి పిలవడంతోనే ఆగిపోయాను నందు.. లేదంటే నేను పిలిచే పిలుపుకి నువ్వు చెవులు మూసుకోవాల్సి వస్తుంది అని తులసి వాళ్ళ అమ్మ అంటుంది. అప్పుడే లాస్య మీ నుంచి మీ అమ్మాయి కూడా సంస్కారం నేర్చుకుంది .మాజీ భర్తని పేరు పెట్టి పిలిచే దాకా వెళ్ళిపోయింది.

నందు నా కూతురుతో పాతికేళ్లతో నాకు కాపురం చేశావు. తన నిజాయితీ ఏంటో నీకు తెలియదా అంటూ సరస్వతి ప్రశ్నించింది. రేయ్ వినోద్ వచ్చి ఆ లాస్య చంప పగలగొట్టారా.. ఎవరు అడ్డం వస్తారో నేను చూస్తాను అని సరస్వతి అంటుంది. వినోద్ 4 అడుగుల ముందుకు వేయగానే సరస్వతి వినోద్ భుజం మీద చేయి వేసి వద్దు వినోద్ ఆగు అని అంటుంది. ఇది మా సంస్కారం కొట్టే హక్కు మాకు ఉన్న కొట్టకుండా వదిలేయడమే మా సంస్కారం. అయినా మీరన్న మాటలు ఐసీయూ బెడ్ పై ఉన్న తులసి వెంటే నిజంగానే కోమాలోకి వెళుతుంది. దయచేసి మీరు ఎక్కడి నుంచి వెళ్లిపోండి అని నాలుగు చివాట్లు పెట్టి సరస్వతి తన అల్లుడిని లాసెను అక్కడి నుంచి పంపించేస్తుంది.
అనసూయ బాధపడుతూ నన్ను క్షమించండి వదిన అని అంటుంది పరంధామయ్య ఆ లాస్య ఆగడాలను మేమందరం మౌనంగా భరిస్తున్నాము. ఇప్పుడు తనని మీరన్న మాటలే నేను అంటే కుటుంబం ముక్కలవుతుందని ఊరుకున్నాను అని పరంధామయ్య అంటాడు. మమ్మల్ని పెద్ద మనసుతో క్షమించమని అనసూయమ్మ వేడుకుంటుంది. తర్వాత సామ్రాట్ అక్కడికి వస్తాడు మీరందరూ రెస్ట్ తీసుకోండి తులసి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది అని అంటాడు. మరి రాత్రంతా నువ్వు ఎందుకు మేల్కొని ఉన్నావు అని సరస్వతి అడుగుతుంది. అంతలో డాక్టర్స్ వచ్చి తులసి పరిస్థితి బానే ఉంది తను స్పృహలోకి వచ్చింది మీరంతా వెళ్లి మాట్లాడమని డాక్టర్స్ చెబుతారు కాకపోతే తనకు ప్రెషర్ ఇచ్చే మాటలు ఏవి చెప్పకండి అని అంటారు.
ఇక తులసిని తన ఇంటికి తీసుకువెళ్తారు అంతా సద్దుమణిగిన తర్వాత సామ్రాట్ వినోద్ కి క్షమాపణ చెప్పాలని అంటాడు. నేను హాస్పటల్లో హస్బెండ్ కాలంలో సరి చేసినందుకే ఇదంతా జరిగిందని సామ్రాట్ అంటాడు నన్ను క్షమించండి అని చెప్పబోతుంటే.. మీరు నాకు ఇప్పుడేంటి ఎప్పటినుంచో మీరు నా భర్త అని తులసి అంటుంది. ఆ మాటకి అందరూ షాక్ అవుతారు. ఆఖరికి సామ్రాట్ తో సహా .. హనీ కి యాక్సిడెంట్ జరిగిన రోజు తల్లి ప్లేస్ లో నేనే సంతకం పెట్టాను. ఆ రోజే నేను మీ భార్యను అయినట్టు ఆ రోజు వీళ్లందరి నోరులు ఎందుకు పెట్టలేదు ఈరోజే ఎందుకు నోర్లు లేచాయి అని తులసి ఉంటుంది.
ఇక రేపటి ఎపిసోడ్ లో పరంధామయ్య దగ్గరికి వచ్చిన నందు ఈ ఇల్లు ని నా బిజినెస్ కోసం తాకట్టు పెడుతున్నానని నందు చెబుతాడు ఇది కేవలం మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే అని నందు అంటాడు ఇక అదే విషయాన్ని శృతి తులసికి చెబుతుంది ఇక ఏం జరుగుతుందో చూద్దాం.