Intinti Gruhalakshmi: నందు రెడీ అయ్యి బయటకు వెళ్తుండగా.. ఎక్కడికి అని లాస్య అడుగుతుంది. ఈ మధ్య నువ్వు ప్రతి విషయాన్నికి ఎగ్జాక్ట్ అవుతున్నావు లాస్య. డాక్టర్ కి చూపించుకోమని నందు సలహా ఇస్తాడు. నందు ఇంకా తులసి దగ్గర అవుతున్నాడు అని లాస్య మనసులో అనుకుంటుంది. ఇప్పుడు ఎక్కడికి అని అడుగగా.. తులసి తో కలిసి ఇప్పుడు సక్సెస్ అయిన కేఫ్ కి రివ్యూ, సూచనలు అడిగి తెలుసుకోవడానికి వెళ్తున్నాం అని చెబుతాడు.

నందు తను సంపాదించిన డబ్బులతో ఇంట్లో అందరికీ బట్టలు తీసుకొని వస్తాడు. వాళ్ళ అమ్మానాన్నలకి కొడుకులు కోడళ్ళకి అందరికీ ఇస్తాడు తులసికి కూడా ఒక చీరను తీసుకొచ్చి ఇస్తాడు. ప్లీజ్ తీసుకో అని నందు రిక్వెస్టింగా తులసితో అంటాడు. మా పాతికేళ్ల కాపురంలో ఇంతవరకు ఏనాడు నాకు ఒక్క చీర తీసుకురాలేదు.

విడిపోయిన తర్వాత చీర తీసుకువచ్చి ఇస్తున్నారు అని తులసి మనసులో అనుకుంటుంది అప్పుడే లాస్య నందు అని కోపంగా చూస్తుంది. లాస్య కు నా సెలక్షన్ నచ్చదు.. అందుకే తనకి డబ్బులు ఇస్తున్నాను. నీకు నచ్చిన డ్రెస్ అయితే నందు క్లాస్ కి డబ్బులు ఇస్తాడు.

తులసి కేఫ్ కి సంబంధించిన నిర్ణయాలలో భాగంగా.. వాలెంటైన్ డే కి కేఫ్ లో అందంగా డెకరేట్ చేయాలని.. మరి కొంత మంది కష్టమర్స్ కేఫ్ కి రావడానికి తులసి ఓ ఐడియా చెబుతుంది. దానికి ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకుంటారు. అప్పుడే నందు లాస్య అక్కడికి వస్తారు. లాస్య తులసిని చూస్తూ నందు డిసిషన్ తీసుకోవాలని అంటుంది. అప్పుడే ప్రేమ్ అసలు కేఫ్ ఐడియా ఇచ్చింది.

అమ్మ తనకి ఏం చేయాలో తెలిసి చెబుతుంది. ఇక నందు ఫైనల్ గా ఈ కేస్ విషయంలో ఏ నిర్ణయం అయినా తులసి తీసుకునే ఫుల్ రైట్స్ తనకు ఉన్నాయి అని చెబుతాడు.అభి ఫారిన్ వెళ్ళిపోవడానికి తన అత్త గాయత్రి ని అందుకు కావలసిన డబ్బులు వేయమని చెబుతాడు. ఆ మాటలు కాస్త తులసి వింటుంది.

అభి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా.. నువ్వు సంపాదించిన డబ్బులతో అంకితని ఫారన తీసుకెళ్తున్నావాని అనుకుంటుంది. ఇది నిజం కాదని అంకితకు తెలిస్తే తను ఫారన్ లో ఉన్నా కూడా తన ఇండియాకి తిరిగి వచ్చేస్తుంది.. నీ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు అని తులసి సలహా ఇస్తుంది ..శాపనార్ధాలు పెడుతున్నావా అని అభి తులసితో చెబుతాడు.

ఇక రేపటి ఎపిసోడ్లో తులసి తో పాటు కలిసి బయటకు వెళ్లాలి అని నందు డిసైడ్ అవుతాడు. అందుకు లాస్య తను తీసి పెట్టిన డ్రెస్లు కావాలని టీ పోసి అక్కడ పడేస్తాడు. తులసి నేను ఆఫీస్ కి వెళ్ళాలి. నా కార్ స్టార్ట్ అవ్వడం లేదు అని తులసి వెళుతున్న బైక్ దగ్గరకు వచ్చి తనక్కూడా లిఫ్ట్ ఇవ్వమని అడుగుతాడు. లాస్య టెర్రస్ మీద నుంచి నందు తులసి ఒకే బైక్ మీద వెళ్లడం చూస్తుంది.