Intinti Gruhalakshmi: శృతిని తులసి పని మనిషిగా మానేయమని చెబుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే మాకు జీవనాధారం అని చెబుతోంది శృతి. ప్రేమ్ ను కాన్సెప్ట్ చూసుకోమని చెబుతుంది వాళ్ళమ్మ. ప్రేమ్ అదే పనిలో ఉన్నాడు. ఏదైనా ఆల్బమ్ చేయాలని ఆలోచనలో ఉన్నాడు అని శృతి అంటుంది. కానీ అందుకు సరిపోయినంత డబ్బు లేదు అని శృతి అనగానే.. ప్రేమ్ ఆల్బమ్ చేయడానికి కావలసినంత డబ్బులు నేను ఇస్తాను అని అంటుంది అంకిత.. తులసి అందుకు ఒప్పుకోకపోతే అంకిత ఒప్పిస్తుంది.. కాకపోతే ప్రేమ్ కి ఈ విషయం చెప్పద్దని అంకిత శృతి తో అంటుంది..
అంకిత ఇంటికి వెళ్లేసరికి అభి తనకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళావ్ అంకిత నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను అని అంటాడు అభి. పని ఉండి బయటకు వెళ్లాను అని చెబుతుంది అంకిత. అదే ఎక్కడికి అని అడుగుతాడు అభి. తులసి ఆంటీ దగ్గరికి వెళ్ళాను అని చెబుతుంది అంకిత. నేను మా ఇంట్లో వాళ్ళకి సహాయం చేయాలి అనుకుంటున్నాను. అందుకే డబ్బు కావాలి అని అంటాడు అభి. అంకిత అభి ప్రేమ్ కి సహాయం చేయాలని అనుకుంటున్నాడు. తన పెద్ద కొడుకు బాధ్యతను తీసుకున్నాడు అని అనుకుంటుంది మనసులో అంకిత. ప్రేమ్ కు నేను సహాయం చేస్తే అది వేరే లాగా ఉంటుంది.
అదే అభి సహాయం చేస్తే చాలా బాగుంటుంది అని మనసులో అనుకొని అంకిత డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. అభి వాళ్ళ నాన్న స్టార్ట్ చేయబోయే కంపెనీకి అంకిత డబ్బులు ఇస్తుంది అని అనుకుని వెంటనే.. నందు కి ఫోన్ చేసి చెబుతాడు. డాడ్ కంగ్రాట్స్ అంకిత మీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకుంది అని అంటాడు. నా కోడలు పైకి కోపంగా ఉన్నా లోపల నేను అంటే చాలా ప్రేమ ఉంది అని అంటాడు నందు. మనం స్టార్ట్ చేయబోయే కొత్త కంపెనీ కి అంకిత చేత ప్రారంభోత్సవం చేయించాలి అని అంటాడు నందు. ఏంటి డాడీ కోడలు మీద ప్రేమ ఎక్కువ అయినట్టు ఉంది. కొడుకు మీ దృష్టిలో తగ్గిపోయినట్లు ఉన్నాడు అని అంటాడు అభి. ఈ క్రెడిట్ అంతా నీదే అభి అని లాస్య అభిని వెనుక వేసుకు వస్తుంది.
Thaman: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో ప్రస్తుతం తెరకేక్కుతున్న చాలా ప్రతిష్టాత్మక చిత్రాలకి తమన్(Thaman) యే మ్యూజిక్ డైరెక్టర్. 2020 త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో…
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…