హనీ తులసిని ఊరంతా తిప్పుతుంది.. కానీ తన ఇంటి అడ్రస్ మాత్రం చెప్పదు.. తను కొనుక్కోవాలి అనుకున్న ఐస్ క్రీమ్, బెలూన్స్ అన్ని ఎక్కడ దొరుకుతాయో ఆ అడ్రస్ అని చెబుతూ.. చాలా తెలివిగా అన్ని చోట్లకి తిప్పుతుంది తులసిని.. పాపం చిన్నపిల్ల కదా తనకు ఏమీ తెలియట్లేదు ఏమో అని తులసి కూడా హనీ చెప్పినట్టు ప్రతి చోటకు వెళ్తుంది.. అంతలో తులసికి ప్రేమ్ ఫోన్ చేస్తాడు.. అమ్మ నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతాడు.. నేను ఇంటికి వద్దాం అనుకుంటున్నాను నీతో చిన్న పని ఉంది అని చెబుతాడు.. సరే నేను త్వరగా వచ్చేస్తాను అని అంటుంది తులసి..
సామ్రాట్ కి హనీ కనిపించకపోవడంతో కోపంతో రగిలిపోతూ ఉంటాడు.. బాబాయ్ నాకు ఎందుకు ఇలా జరుగుతుంది.. ఇక హనీ నా దగ్గరకు వస్తుందంటావా అని అంటాడు.. నువ్వేం బాధపడకు సామ్రాట్ హనీ తప్పకుండా మన దగ్గరకు వస్తుంది.. తనకు ఏం కాదన్నా నమ్మకం నాకుంది అని అంటాడు.. అంతలో పోలీసులు కాల్ చేసి హనీ ఎక్కడ ఉందో ఫోటో పంపిస్తారు.. ఈమె కిడ్నాపర్ లాగా ఉంది సార్ అని చెబుతారు.. అయితే మీరు వెంటనే తన అడ్రస్ తెలుసుకుని తీసుకురమ్మని చెబుతారు.. ఇక పోలీసులు తులసి వాళ్ళ ఇంటికి వెళ్లి ఇల్లంతా వెతుకుతారు.. కానీ తులసి కనిపించదు.. వెంటనే పోలీసులు సామ్రాట్ కి ఫోన్ చేసి ఇంట్లో తులసి లేదని చెబుతారు.. అయితే ఆ ఇంట్లో ఎవరున్నారు అని అడిగితే.. వాళ్ళు అత్తయ్య మామయ్య ఉన్నారు అని చెబుతారు. అయితే వాళ్ళని తీసుకువచ్చి జైల్లో వేయమని చెబుతాడు సామ్రాట్ ఇక వాళ్ళు చెప్పింది చెప్పినట్లు చేస్తారు పోలీసులు. దివ్య, అంకిత ఎంతగా ఆపుతున్నా కూడా ఆగరు. అంతలో ప్రేమ్ అక్కడికి వస్తాడు..
విషయం తెలుసుకొని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెబుతాడు.. నువ్వు ఎవరో పాపను కిడ్నాప్ చేశావని అమ్మమ్మ తాతయ్యలను తీసుకెళ్లి జైల్లో వేశారు అని ప్రేమ్ చెబుతాడు. ఇక తులసి హనీతో నువ్వు మీ ఇంటి అడ్రస్ చెప్పమంటే చెప్పడం లేదు. ఇప్పుడు నీ కారణంగా మా ఇంట్లో వాళ్ళని పోలీసులు తీసుకువెళ్లారంట. ఇప్పటికైనా అడ్రస్ చెప్పు అని అంటుంది. సారీ తులసి ఆంటీ నేను మా డాడీ తో పాటు బయటకు వస్తే ఐస్ క్రీమ్స్ తిననివ్వరు.. సరదాగా ఇలా బయటకి చూడనివ్వరు.. అందుకే నా కోరికలన్నీ మీతో తీర్చుకున్నాను. అందుకే అడ్రస్ చెప్పకుండా ఎలా చేశాను నన్ను క్షమించండి ఆంటీ.. మీరు నాకు ఒక ప్రామిస్ చేస్తారా అని హనీ అమాయకంగా అడుగుతుంది.. తులసి అని ఏంటమ్మా అని అంటుంది. తులసి ఆంటీ నేను మీతో ఎలా ఐస్ క్రీమ్ లవి తిన్నానని బజారుకు వచ్చినట్లు మా డాడీతో చెప్పకండి అంటుంది.. సరే అని తులసి మాట ఇస్తుంది. హని తీసుకుని తులసి పోలీస్ స్టేషన్ కు వెళుతుంది తులసి.
నేను నిజంగా ఏ తప్పు చేయలేదని పాప యాక్సిడెంట్ అయి పడి ఉంటే నేను సేవ్ చేసి హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాను అని చెబుతుంది . మరి ఎందుకు ఇంటికి తీసుకురాలేదు అని సామ్రాట్ అడిగితే ఇంటి అడ్రస్ తెలీదు అని చెబుతావు కదా అని అంటాడు. ఇదంతా నీ ప్లాన్ మీకుట్ర హనీ ని కిడ్నాప్ చేయాలని మీ ముఠా వేసిన ప్లాన్ అని సామ్రాట్ అంటాడు. తులసి ఏమి మాట్లాడలేక మౌనంగా ఉంటుంది. హనీకి ఇచ్చిన మాట కోసం.. అసలు ఏం జరిగిందో చెప్పలేక పోతుంది. నన్ను స్టేషన్లో ఉంచిన కానీ మా ఇంట్లో వాళ్ళని పంపించామని ప్రాధేయపడుతుంది తులసి. కానీ సామ్రాట్ అందుకు ఒప్పుకోడు. నందు హనీకి యాక్సిడెంట్ చేసింది నేనే అని లో లోపల మదన పడుతూ ఉంటాడు.
రేపు మళ్ళీ సామ్రాట్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ తులసి జైల్లోనే ఉంది కదా తను ఏమైనా నిజం చెప్పిందని అడుగుతాడు.. ఏం చెప్పలేదు అని చెప్పడంతో వారిని ఇంకా టార్చర్ చేయమని చెబుతాడు సామ్రాట్.. ఆ విషయం విన్న నందు అసలు యాక్సిడెంట్ చేసింది నేనేనని.. తులసిది తప్ప ఏమీ లేదని ఒప్పుకుంటాడా లేదా అనేది తర్వాయ భాగంలో చూడాలి…