Intinti Gruhalakshmi: నందు తులసికి దగ్గరే ఎలాగోలా తను తీసుకున్న తనకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ నందు ప్రయత్నాలన్ని బూడిదల పోసిన పన్నీరు అవుతాయి. ఎంతగా తను ట్రై చేసి తులసి దగ్గరకు వెళ్లి ఆ గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటాడు. ఆ లోపు ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒక విధంగా చెడగొడుతూనే ఉంటారు.. మరోవైపు లాస్య నందు తన కోసమే ఆ నక్లెస్ తెచ్చాడు అనుకుని.. ఎప్పుడెప్పుడు తన కోసం నక్లెస్ తీసి అందరు ముందు ప్రజెంట్ చేస్తాడా అని తహతహలాడుతూ ఎదురు చూస్తూ ఉంటుంది..

తులసి ఎక్కడ సామ్రాట్ కి దగ్గర అయిపోతుందో ఏమోనని నందు ఒకవైపు తులసికి గిఫ్ట్ ఇవ్వాలని మరోవైపు.. సామ్రాట్ కి తులసి దగ్గర కాకుండా చేయాలని నందు తర్జనభర్జన పడుతూ ఉంటాడు. ఇది చాలదన్నట్టు నక్లెస్ నాకు ఇన్ డైరెక్ట్ గా నందు దగ్గరకు వెళ్లి ఏదో ఒక వంక పెట్టుకొని ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది..

తులసి వాళ్ళ ఇంట్లో వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. అందులో భాగంగా సామ్రాట్ కూడా అక్కడికి వస్తారు. ఈ ఫంక్షన్ లో దివ్యలేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది అంటూ పరంధామయ్య అనసూయమ్మ అంటారు. మేమిద్దరం తీరుస్తామని ప్రేమ్ శృతి ఇద్దరూ ఈరోజు మేమే యాంకరింగ్ చేస్తామని చెబుతారు. ఇక ముందుగా కపుల్స్ గా వచ్చి ఈ చీటీని ఓపెన్ చేసి పెర్ఫార్మన్స్ చేయాలి. ముందుగా అంకిత అభి వచ్చి ఒక స్లిప్ తీ స్తారు . అలిగిన భార్యను భర్త బుజ్జగించాలని రాసి ఉంటుంది అభి బుజ్జగించి అంకిత కన్విన్స్ చేస్తాడు.

ఆ తరువాత పరంధామయ్య, అనసూయములు ఇద్దరూ కలిసి ఓ పాత సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేస్తారు. ఆ తరువాత నందు లాస్య డాన్స్ చేసి.. లాస్య నందు గిఫ్ట్ గా నెక్లెస్ ఇస్తాడు. ప్రేమ్ అప్పుడే తులసిని ఒక చీటీ తీయమని అంటాడు. మాకంటే పార్ట్నర్స్ ఉన్నారు తులసికి పార్ట్నర్ లేరు గాని లాస్య అంటుంది. నాకు కూడా లైఫ్ పార్ట్నర్ ఉన్నారని తులసి చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయి తులసి వైపు చూస్తారు. అయితే తులసి చీటీ ఓపెన్ చేయగానే అందులో తన పార్టనర్ కి ప్రపోజ్ చేయాలని రాసి ఉంటుంది. తులసి రోజ్ ఫ్లవర్ తీసుకొని రెడీగా ఉంటుంది. ఎవరికి ప్రపోజ్ చేస్తుందని అందరూ ఈగరుగా వెయిట్ చేస్తూ ఉండగా నేటి ఎపిసోడ్ ముగిస్తుంది.