Intinti Gruhalakshmi: లాస్య కి నందు గిఫ్ట్ గా నెక్లెస్ ఇస్తాడు. ఇక మొత్తానికి లాస్య అనుకుంది సాధిస్తుంది. ఆ తర్వాత ప్రేమ్ శృతి కోసం కూడా ఒక గిఫ్ట్ తీసుకొస్తాడు. ఆ గిఫ్ట్ చూసి శృతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది శృతి వాళ్ళ నాన్న ఆయన గుర్తుగా మిగిలింది. అదొక్కటే ఇది కనిపించకుండా పోయింది. ఆరు నెలల నుంచి వెతికితే ఇప్పటికీ దొరికింది.. అది నాకు శృతి మీద ఉన్న ప్రేమని ప్రేమ్ అంటాడు.. ఇక్కడతో అంతా అయిపోయినట్టే కదా నేను భోజనాలకు ఏర్పాటు చేస్తాను అని తులసి అంటుంది..

ప్రేమ్ అప్పుడే తులసిని ఒక చీటీ తీయమని అంటాడు. మాకంటే పార్ట్నర్స్ ఉన్నారు. కానీ తులసికి పార్ట్నర్ లేరు గాని లాస్య అంటుంది. నాకు కూడా లైఫ్ పార్ట్నర్ ఉన్నారని తులసి చెప్పగానే. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయి తులసి వైపు చూస్తారు. అయితే తులసి చీటీ ఓపెన్ చేయగానే అందులో తన పార్టనర్ కి ప్రపోజ్ చేయాలని రాసి ఉంటుంది. తులసి రోజ్ ఫ్లవర్ తీసుకొని రెడీగా ఉంటుంది. ఎవరికి ప్రపోజ్ చేస్తుందని అందరూ ఈగరుగా వెయిట్ చేస్తూ ఉండగా.. ఇంట్లో అందరినీ తన పక్కకి రమ్మని పిలుస్తుంది.
Krishna Mukunda Murari: అందరి మురారికి ప్రపోజ్ ముకుంద చేస్తానని ఛాలెంజ్.. కంగారులో రేవతి..

ఇంట్లో వాళ్ళందరూ వచ్చి తన పక్కన నిలబడగానే .. వీళ్ళి తన లైఫ్ పార్ట్నర్స్ అని తులసి చెబుతుంది. వీళ్ళు లేకపోతే నేను లేనని తులసి అంటుంది. వీళ్ళ కళ్ళు ఉంటే నాకు ఇంకెవరితో అవసరం లేదని తులసి లాస్య మాటలకు తిప్పికొడుతుంది.దెబ్బతో లాస్య నోరు మూతపడుతుంది.

తులసి చెప్పిన సలహా మేరకు అభి తన అత్తగారి దగ్గర తీసుకున్న డబ్బులు ఇచ్చేయాలని గాయత్రి వాళ్ళింటికి వెళ్తాడు. ఏంటి అభి ఇలా వచ్చావు. అమెరికా ప్రయాణం ఎప్పుడు అని అడుగుతుంది. నా డబ్బులతో నేను వెళ్తాను. మీ డబ్బులు నాకు అవసరం లేదని. అభు ఆ డబ్బులు ఇచ్చేసి గాయత్రి నుంచి వెళ్ళిపోతాడు. కేఫ్ బాగా నడుస్తుంది. కాబట్టి వీళ్ళందరికీ కొమ్ములు వచ్చాయి.. వెంటనే ఆ కేఫ్ ని మూతపడేలాగా చేయాలి అని గాయత్రి మనసులో అనుకుంటుంది. ఇంకా పక్కాగా వ్యూహం రచించి సిద్ధంగా పెట్టుకుంటుంది.
Intinti Gruhalakshmi: అందరి ముందు తన పార్ట్నర్ కి రోజా పువ్వు ఇచ్చిన తులసి.. నందు గుండెల్లో రాయి..
అభి ఇంటికి వెళ్లి ప్రేమగా గోరుముద్దలు పెట్టమని అడుగుతాడు. నేను చేసిన తప్పు తెలుసుకున్నానని నన్ను క్షమించు అంకిత అని అందరి ముందు క్షమాపణలు చెబుతాడు అభి. నా డబ్బులతో కాకుండా మీ అమ్మ డబ్బులతో అమెరికా తీసుకువెళ్లాలని అనుకున్నాను.. కానీ నా డబ్బులతోనే అమెరికా తీసుకువెళ్తాను అని అభి అందరి ముందు గర్వంగా చెబుతాడు. ఇక రేపటి ఎపిసోడ్లో గాయత్రి అనుకున్న ప్రకారం కేఫ్ సీజ్ చేయడానికి పక్కాగా వ్యూహం రచిస్తుంది. ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూడాలి.