Intinti Gruhalakshmi: తులసి స్టేషనరీ షాప్ కి వెళ్లి ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే బుక్కులు కొనుక్కొని తీసుకొని ఇంటికి వస్తుంది. అప్పుడే పరంధామయ్య తులసి ఇంగ్లీష్ 30 రోజుల్లో నేర్చుకోవడం ఎలా అనే ఎవరికి అని అడుగుతాడు. తులసి అది నా కోసమేనని ఆ బుక్ కొన్ననాని.. ఈరోజు నుంచి ప్రాక్టీస్ చేస్తానని అంటుంది. అప్పుడే శృతి నేను మీకు సపోర్ట్ చేస్తా ఆంటీ అంటుంది. ఆంటీ మీరు నేర్చుకోవాల్సింది ఫారెయిన్ ఇంగ్లీష్.. అని అంకిత వచ్చి నేను కాన్వెంట్ స్కూల్లో నేర్చుకున్నాను కదా ఆంటీ మీకు ట్రైనింగ్ నేను ఇస్తాను అని అంటుంది.
అంతలో లాస్య వచ్చి ఏంటి అంకిత శృతి బట్లర్ ఇంగ్లీష్ అని ఇండైరెక్టుగా అనేసావా అని అనగానే.. శృతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లాస్య తన వంకర బుద్ధితో ఇంట్లో వాళ్ళందరికీ చిచ్చు పెట్టి తను పర్సనల్ గా దగ్గర అవ్వాలని అనుకుంటుంది. ఇక అదే విషయాన్ని అంకిత లాస్య మొహం మీద అంటుంది. ఇక తులసి శృతికి సర్ది చెప్పి మొత్తానికి ఆ సమస్య సద్దుమణిగేలా చేస్తుంది.
తులసి రెడీ ఆఫీస్ కి వెళ్ళిపోతుండగా దివ్య వచ్చి అమ్మ నాకు కొత్త లాప్టాప్ కావాలి అని అడుగుతుంది. నాకు రేపటికి ఎగ్జామ్ ఉంది. ఇది ఓల్డ్ వర్షన్ నాకు న్యూ వర్షన్ కావాలి అర్జెంటుగా కొని పెట్టమని దివ్య పట్టుబడుతుంది. తులసి ససేమేరా ఒప్పుకోనని.. తర్వాత కొనిస్తానని ఎప్పటికీ అడ్జస్ట్ అవమని చెబుతుంది. అప్పుడే దివ్య సామ్రాట్ అంకుల్ ని అడుగుతానని అంటుంది. మధ్యలో ఆయన్ని ఎందుకు తీసుకువస్తావు. మన అవసరాల కోసం మన ఫ్రెండ్స్ ని ఉపయోగించుకోకూడదు అని తులసి హితబోధ చేస్తుంది.
ఇక అప్పుడే లాస్య వచ్చి దివ్య అడిగిన దాంట్లో తప్పేముంది తనేమీ అవసరాల కోసం అడగడం లేదు కదా చదువుకోసమే కదా లాప్ టాప్ కొనివ్వమంది అని అంటుంది. ఈ విషయంలో నువ్వు కల్పించుకోకు అని తులసి లాస్యకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది . ఇక రేపటి ఎపిసోడ్ లో సామ్రాట్ జూమ్ మీటింగ్ లో తులసిని క్లైంట్స్ ముందు కూర్చోబెట్టి పరిచయం చేస్తాడు. ఈరోజు నా బదులుగా మీతో తులసి మాట్లాడుతుందని చెబుతాడు. క్లైంట్స్ వేసే క్యూస్షన్లకు తులసి నవ్వుతూ ఉంటుంది . కానీ ఎలాంటి సమాధానం చెప్పదు. ఇక తులసి వలన సామ్రాట్ కి ఏమైనా చిక్కులు వస్తాయా అనేది తరువాయి భాగంలో చూద్దాం.