18.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసి మనసు తెలుసుకుంటన్న సామ్రాట్.. అత్తింట్లో సమస్యలు..

Intinti Gruhalakshmi serial 26 December 2022 Today 824 Episode Highlights
Share

Intinti Gruhalakshmi: శృతి తాతయ్య అమ్మమ్మకి టీ పెట్టడానికి లాస్య తాళం ఇవ్వదని తెలిసి ఇక డికాషన్ మరిగించి వాళ్లకి టీ ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటుంది.. ఇక అనసూయమ్మ ఏంటమ్మా శృతి ఇంత ఆలస్యం చేసావు త్వరగా రా అని అంటారు. ఇక మొత్తానికి శృతి ఆ డికాషన్ తీసుకువెళ్లి అనసూయమ్మ పరంధామయ్యకు ఇస్తుంది. టీ కప్పులో డికాషన్ చూసి ఇద్దరు కంగు తింటారు. డికాషన్ ఇచ్చావ్ కానీ పాలు పోయడం మర్చిపోయావా అని అంటారు. లేదు తాతయ్య ఫ్రిడ్జ్ కి తాళం వేసి ఉంది తాళం మీ కోడలు దగ్గర ఉంది అని శృతి చెబుతుంది.

Intinti Gruhalakshmi: serial 19 December 2022 Today 819 Episode Highlights
Intinti Gruhalakshmi: serial 19 December 2022 Today 819 Episode Highlights

లాస్య ఫ్రిడ్జ్ కి తాళం వేసిందని రోజుకి రెండుసార్లు టీ కాఫీ పెట్టుకోవాలి అని చెప్పిందని చెప్పింది. ఆ మాటలకు అనసూయమ్మ కోపంగా లాస్యతో గొడవ పడటానికి వెళ్తుంది. కానీ పరంధామయ్య అడ్డుపడి మనం కాస్త ఓపికగా ఉందామని అనుకున్నాం కదా.. అదే నిర్ణయం మీద ఉందాం కొన్ని రోజులు ఓపిక పట్టమని పరంధామయ్య అంటాడు. సరే అని అనసూయమ్మ పరంధామయ్య మాటలకు మౌనం వహిస్తుంది.

Intinti Gruhalakshmi: serial 19 December 2022 Today 819 Episode Highlights
Intinti Gruhalakshmi: serial 19 December 2022 Today 819 Episode Highlights

అంతలో తులసి అనసూయమ్మకు ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని అడుగుతుంది. అనసూయమ్మ అక్కడ జరిగింది మొత్తం అర్థమయ్యేలాగా తులసికి చెప్పాలని అనుకుంటుంది కానీ పరంధామయ్య అడ్డుపడి ఇక్కడ జరిగిన విషయాలు ఏవి తులసికి చెప్పడానికి వీల్లేదు అని అంటాడు ఇక నేనే రేపు అక్కడికి వస్తాను అత్తయ్య మిమ్మల్ని వచ్చే పలకరిస్తాను అని తులసి అంటుంది.

సామ్రాట్ తులసి ఇద్దరు అక్కడి నుంచి కార్ లో వస్తారు. సామ్రాట్ గారు చాలా థాంక్యూ అండి మీకు నా మనసులో ఉన్న ఆలోచనలన్నీ మీరు అర్థం చేసుకున్నారు నన్ను మా ఇంటికి తీసుకువెళ్లారు. ఎంత ఆనందాన్ని ఇచ్చిన మిమ్మల్ని నేను అస్సలు మర్చిపోలేను అని తులసి అంటుంది. అదే కదండీ మరి ఫ్రెండ్ అంటే అని సామ్రాట్ అంటారు. మీరు ఇంటికి వెళ్ళాక మీకు ఇంకో సర్ప్రైజ్ ఉందని సామ్రాట్ అంటాడు అదేంటో చెప్పమని తులసి అడుగుతుంది. ఇంటికి వెళ్ళాక మీకే తెలుస్తుంది కదా అని సామ్రాట్ అంటాడు ఇక ఇంటికి వెళ్లిన తర్వాత తులసి దగ్గరికి వాళ్ళ అమ్మ వస్తుంది. ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు అని తులసి అడుగుతుంది. నువ్వే కదా రమ్మన్నావు అని వాళ్ళ అమ్మ అంటుంది. నేను రా నేను ఇంటికి వచ్చాక నీతో మాట్లాడాలని నీతో కబుర్లు చెప్పుకోవాలని అనుకున్న మాట వాస్తవమే కానీ నేను నీకు ఫోన్ చేయలేదు కదా అని అంటుంది. కాసేపు తులసిని వాళ్ళ మాట పట్టించిన తర్వాత సామ్రాట్ నీ దగ్గరకు వెళ్ళమని నాతో చెప్పాడని చెబుతుంది నిజంగా సామ్రాట్ నీ మనసు అర్థం చేసుకుంటున్నాడు అని తులసి వాళ్ళ అమ్మ అంటుంది. మిగతా విశేషాలు తర్వాత చూద్దాం..


Share

Related posts

“లైగర్” హిందీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి ప్రముఖ స్టార్ హీరో..??

sekhar

సౌందర్య ఎంట్రీతో మోనితకు హై టెన్షన్.. ఈసారి అత్తా కోడళ్ళు కలిస్తే రచ్చ రచ్చే..!!

Ram

థ్రిల్లింగ్‌గా `తెలిసినవాళ్లు` టీజర్..బెద‌ర‌గొట్టేసిన హెబ్బా ప‌టేల్‌!

kavya N