Intinti Gruhalakshmi: ఇక నుంచి తులసి తన లిమిట్స్ లో ఉంటే మంచిదని చెబుతాడు. తులసి ముగ్గురు పిల్లల తల్లి రా అలా వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే మంచిది అని అనసూయమ్మ అంటుంది.. రాత్రి పరంధామయ్య నిద్రపోతుండగా షుగర్ డౌన్ అయిందని ఇబ్బంది పడుతూ ఉంటాడు.. అనసూయమ్మ ఏమైందని కంగారుపడుతూ అడగగా.. వెంటనే పంచదార కలిపి నీళ్లు ఇవ్వమని అడిగితే.. అనసూయమ్మ లాస్య దగ్గరకు వెళ్లి వంటగది కబోర్డ్ కీస్ ఇవ్వమని అడుగుతుంది.. ఇప్పుడు కాదు అత్తయ్య ఆ కేసు ఎక్కడ పెట్టానో మర్చిపోయాను అని లాస్య అంటుంది. అదేంటమ్మా అవతల మీ మామయ్యకి షుగర్ డౌన్ అవుతుంది.

ఆయన పరిస్థితికి చాలా ఇబ్బందిగా ఉంది. అర్థం చేసుకోమ్మ లాస్య.. త్వరగా తాళాలు ఇవ్వమని అనసూయమ్మ అడుగుతుంది.. ప్లీజ్ అత్తయ్య ఎలాగోలా మేనేజ్ చేయండి. పొద్దున్నే లేచాక ఇస్తాను అని లాస్య అంటుంది. అప్పుడే అంకిత మంచినీళ్లు తాగడానికి అని వంట గదిలోకి వస్తుంది. ఆ విషయాన్ని అంకితకు చెప్పి చెప్పగానే.. అంకిత శృతి రూమ్ లోకి వెళ్లి గ్లూకోస్ తీసుకొచ్చి ఇస్తుంది. తాతయ్యకు సెట్ అవుతుంది అని అంటుంది..
సామ్రాట్ ఏదో ఫైల్ మీద సంతకం పెట్టబోతుండగా సామ్రాట్ గారు ఆగండి అని తులసి అడ్డుపడుతుంది. సర్ మనకు లైన్ కి చెప్పిన ప్లేస్ లో మనం స్కూల్ కట్టడానికి ఎలాంటి పర్మిషన్ లేదు అని తులసి అంటుంది ఇప్పుడు అందరూ పర్మిషన్ తీసుకుని చేయటం లేదు కదా అని అతను అంటాడు ఈ డి క్యాన్సిల్ చేసుకోవడమే బెటర్ అన్నట్టుగా తులసి మాటలు ఉంటాయి సరే అలా అయితే ఈ డీల్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను అని సామ్రాట్ అనగానే.. తన ఎదురుగా ఉన్న క్లైంట్ తులసిని బెదిరిస్తాడు.
ఇక రేపటి ఎపిసోడ్ లో తులసి సామ్రాట్ ఇద్దరు గుడికి వెళ్తారు ఇక అదే గుడికి వచ్చిన పరంధామయ్య అనసూయ జీవితాన్ని ఇలాగే గడిపేయాలి కానీ మన రెండు పక్షుల్లో ఒక్క పక్షి దూరమైతే ఇంకో పక్షి ఏమైపోతుందో అని భయంగా ఉంది అనసూయ అని పరంధామయ్య అంటున్న మాటలను తులసి సామ్రాట్ వింటారు వాళ్ళిద్దరూ అలా బాధపడడానికి ఓ రకంగా తులసినే కారణం ఇక ఆ విషయం తెలుసుకొని తను ఏం చేస్తుందో చూడాలి..