Intinti Gruhalakshmi: భాగ్య తులసి ప్లాన్ విని అది వెంటనే లాస్య కు కాల్ చేస్తుంది.. ముందు అక్కడ ఏం జరుగుతుందో చెప్పు అని అంటుంది.. తులసికి మన పిలక అదే రంజిత్ గాడి అడ్రెస్స్ దొరికిపోయింది. తులసి అక్క మనుషులు ఆ రంజిత్ ను వెతికి పట్టుకొని ఇక్కడికి తీసుకు వస్తారు.. ముందు రంజిత్ ఎక్కడ ఉన్నాడో అక్కడికి మనం వెళ్దాం అని అంటుంది లాస్య.. సరే అని అంటుంది భాగ్య..! ఏమైంది అంత కంగారు పడుతున్నావు అని అంటాడు నందు.. నువ్వు రెడీ అవ్వు ఈవెనింగ్ అన్లిమిటెడ్ గా ఎంజాయ్ చేద్దాం అంటాడు..!

- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తులసి ఇంట్లోకి వెళుతుండగా న్యూస్ పేపర్ లో నుంచి ఒక పాంప్లెట్ బయటకు వస్తుంది.. అందులో మ్యూజిక్ కాంపిటీషన్ జరుగుతుందని.. ఆ కాంపిటీషన్ లో గెలిస్తే ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తారని రాస్తుంటుంది.. ఆ కాంపిటీషన్ ని కండక్ట్ చేసేది సంజనా అని కూడా ఉంటుంది.. అందులోనే ఫోన్ నెంబర్ కూడా తెలియజేస్తారు.. వెంటనే ఈ విషయాన్ని శృతికి కాల్ చేసి చెబుతుంది తులసి.. ఈ కాంపిటీషన్లో ఎలాగైనా ప్రేమ్ పాల్గొనేలా చేయమని చెబుతుంది.. సంజనా తో నేను మాట్లాడుతాను అని చెబుతుంది తులసి.. శృతి సరే అంటుంది..

- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రేమ్ దగ్గరికి మ్యూజిక్ డైరెక్టర్ మపిల్ హరి వచ్చి ఈ గిటార్ పై ఒక లవ్ సాంగ్ ప్లే చేయమని చెబుతాడు.. ప్రేమ్ సరిగ్గా ప్లే చేయకపోతే.. సరిగ్గా ప్లే చేయమని మరొక ఛాన్స్ ఇస్తాడు.. అప్పుడు కూడా ప్రేమ్ సరిగ్గా వాయించలేడు.. అవకాశం కావాలి అంటావు ఇస్తే వాడుకోవడం రాదు.. నువ్వు కుర్చీలు, బల్లలు తుడుచుకోవడానికి తప్ప దేనికి పనికిరావు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని విసుక్కుంటాడు..
లాస్య భాగ్య ఇద్దరు కలిసి బైక్ పై ఫాస్ట్ గా వెళ్తారు.. ఇక వెనకాలా తులసి వాళ్ళు ఫాలో అవుతారు. మధ్యలో లాస్య బైక్ ఆగిపోతుంది.. దాంతో వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తారు.. అది చూసిన తులసి, దివ్య, లాస్య ఆటోలో నుంచి చూస్తూ పక పకపక నువ్వుతారు.. మొత్తానికి తులసి వాళ్ళు లాస్య, భాగ్య వెళ్ళిన దగ్గరికి వెళ్తారు. తులసి లాస్య తో రంజిత్ ఇప్పుడే నీ గురించి అంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. ఈ విషయం నీ నందుకు తెలియకూడదు అంటే 24 గంటల్లో 20 లక్షలు నా అకౌంట్ లో ఉండాలి అని తులసి అంటుంది.. ఇక లాస్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తరువాయి భాగంలో చూద్దాం..