Intinti Gruhalakshmi: తులసి వాళ్ళమ్మతో సామ్రాట్ గురించి గొప్పగా చెబుతుంది. ఇక అప్పుడే తులసి వాళ్ళమ్మని ఓ ప్రశ్న అడగాలని ఉంది అనగానే.. అడగమని తులసి వాళ్ళమ్మ అంటుంది.. అమ్మ నేను నందు తో విడాకులు తీసుకునేటప్పుడు చాలా సార్లు ఆలోచించాను. ఆ తర్వాత నాకు తనని తలుచుకొని బాధపడేంత బాధ కనిపించలేదు.. కానీ నువ్వు నాన్నని ఏ రోజు ఎందుకు బాధపడలేదు అని తులసి అడుగుతుంది..

మీ నాన్న చనిపోయేటప్పుడు నువ్వు చాలా చిన్న పిల్లగాని ఇక నీ తమ్ముడికి ఊహ కూడా తెలియదు. ఆ సమయంలో నా మనసుకు నేనే ధైర్యం చెప్పుకొని.. మీ బాధల్ని తీర్చా. మీకు ధైర్యాన్ని చెప్పాను. నీకు ఎవరు చెప్పారు నా కళ్ళల్లో వచ్చే కన్నీళ్లను నీళ్లతో కడిగేసుకుని ఆ నీళ్లలో నా కన్నీళ్లు కలిసిపోయేలాగా చేసేదాన్ని అని వాళ్ళ అమ్మ తులసితో అంటుంది. అయినా నీ బాధ వేరు. నా బాధ వేరు. నువ్వు భర్త నుంచి విడాకులు తీసుకున్న నాకు నా భర్త శాశ్వతంగా దూరమయ్యారు అని వాళ్ళ అమ్మ అంటుంది. క్షమించమ్మా ఈ ప్రశ్న నిన్ను అడిగి నిన్ను చాలా బాధ పెట్టాను అని తులసి అంటుంది. పోనీలే ఇప్పటికైనా ఈ ప్రశ్న అడిగి నీ మనసులోని భారాన్ని దింపేసుకున్నావు అని వాళ్ళ అమ్మ అంటుంది..
దివ్య బయట కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతకు ముందు అంటే మామ్ నేర్పించేది. అందరూ మారిపోయారు అని శృతి అడుగుతుంది. అవకాశం ఇస్తేనే కదా మా టాలెంట్ ఏంటో తెలిసేది అని అంకిత.. అయితే మీరు నాకు డ్యాన్స్ నేర్పిస్తార వదినలు అని దివ్య అడుగుతుంది. హా.. అనగానే.. దివ్య ఎగిరి గంతేసి తన ఫ్రెండ్స్ ను కూడా తీసుకువస్తా అని వెళ్తుంది.
తులసి ముగ్గు వేస్తూ పరధ్యానంలో ఉంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి ఏంటి తులసి దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. నీ మనసు ఇక్కడ లేదనుకుంటా అని అనగానే.. అవునమ్మా నిజంగానే నా మనసు ఇక్కడ లేదు అని తులసి చెబుతుంది. నా మనసంతా మన సొంతూరు లోని ఇంటి దగ్గరే వదిలేసి వచ్చాను అని అంటుంది. అసలు నిన్ను కాదు ఆ సామ్రాట్ ని అనాలి అని తులసి వాళ్ళ అమ్మ అంటుంది. ప్లీజ్ అమ్మ నన్ను ఏమైనా అనగానే సామ్రాట్ ని ఏమి అనవద్దు అని తులసి ఉంటుంది. తులసి కోరుకుంటున్నట్టుగానే చిన్నప్పటి తన అమ్మ పాటను టేప్ రికార్డర్ లో వినేలాగా చేస్తాడు సామ్రాట్ ఇక ఆ పాట వింటూ తులసి సరస్వతి ఇద్దరు ఆనందంతో పొంగిపోతారు.
ఇక రేపటి ఎపిసోడ్ లో అత్తమామలను చూడటానికి తులసి వస్తుంది. అప్పుడే మందులు అయిపోయాయని అనసూయమ్మ పరంధామయ్య మాట్లాడుకుంటూ ఉంటారు. మందులు అయిపోయిన విషయం నందుతో చెప్పమని పరంధామయ్య అంటాడు. అనసూయమ్మ నందుకి సంపాదన లేదు కదా అని అంటుంది. అయినా ఇప్పుడు మనం మందులు వేసుకుని ఎవరిని ఉద్ధరించాలి అని పరంధామయ్య సలహా ఇస్తాడు. ఆ మాటలను విన్న తులసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.