18.7 C
Hyderabad
January 29, 2023
NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసి ఇచ్చిన టాస్క్ లో ఓడిపోయిన సామ్రాట్.. దివ్యకి చివాట్లు పెట్టిన లాస్య.! 

Intinti Gruhalakshmi serial 23 December 2022 Today 823 Episode Highlights
Share

Intinti Gruhalakshmi: తులసి వెళ్లిన రెస్టారెంట్ కి వచ్చిన నందు.. తులసి సామ్రాట్ కలిసి నవ్వుకుంటూ ఉండగా.. నందు సైలెంట్ గా భోజనం చేయడం చూస్తాడు. తులసికి ఎంత దూరంగా ఉండాలన్నా కానీ నావల్ల కావడం లేదు అని నందు మనసులో మధన పడతాడు. ఇక లంచ్ చేసిన నందు బిల్ కట్టకోకుండా నిలబడి ఉండటం సామ్రాట్ తులసి చూస్తారు.. నందు చెప్పే సాకులను ఆ బేరర్ కొట్టు పారేస్తాడు. ఇక తులసి వచ్చి ఆయన చెప్పేది నిజంగా నిజమే అయి ఉంటుంది. ఒక్కసారి ఆయన మొహం చూడండి మీకే అర్థమవుతుంది అని తులసి అంటుంది. ఇక నందు బిల్డింగ్ తులసి పే చేస్తుంది.. ఇంటికి వెళ్ళాక మీ డబ్బులు రిటన్ ఇచ్చేస్తాను అని నందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Intinti Gruhalakshmi: serial 23 December 2022 Today 823 Episode Highlights
Intinti Gruhalakshmi: serial 23 December 2022 Today 823 Episode Highlights
Intinti Gruhalakshmi: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన శృతి.. సామ్రాట్ ని ఓ ఆట ఆడించిన తులసి..

ఇక సామ్రాట్ తులసి ఇద్దరు రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి నడుచుకుంటూ వెళుతుండగా.. తులసి నేను మీకు ఓ టాస్క్ ఇస్తాను అందులో మీరు గెలిస్తే మీరు నిజంగా మధ్యతరగతి వారిలా మారిపోయారని నేను నమ్ముతాను. లేదంటే మీరు రిచ్ పర్సన్ అని ఒప్పుకోవాల్సిందే అని తులసి అంటుంది. సరే అయితే చెప్పండి ఏంటో అంటాడు. నేను మీకు డబ్బులు ఇస్తాను ఆ డబ్బులతో చాలా ఎక్కువ ఐటమ్స్ కొనాలి అని తులసి చెబుతుంది. ఓ అంతేగా ఇదిగోండి అని 500 నోట్ తీస్తారు అంత డబ్బులు అవసరం లేదు అని తులసి ₹10 కాయితం తీసి ఇస్తుంది. ఇద్దరూ చెరో పది రూపాయలు తీసుకొని చేరో దిక్కు వెళతారు. తులసి ఆ పది రూపాయల కాగితం కూరగాయల కొట్టు అతనికి ఇచ్చి అన్ని రకాల కూరగాయలను ఇవ్వమని చెబుతుంది. ఇక సామ్రాట్ కిరాణా షాప్ లోకి వెళ్లి పది రూపాయలకి ఎంత బియ్యం వస్తే అంతే ఇవ్వమని చెబుతాడు. ఇక సామ్రాట్ తులసి ఎవరు గెలిచారు అని అడగగా.. తులసి నేనే గెలిచాను అని అంటుంది. ఎందుకంటే ఎక్కువ ఐటమ్స్ తీసుకొచ్చింది నేనే కదా అని తులసి అంటుంది. అయితే ఇంకొన్ని రోజులు నేను మీకు శిష్యరికం చేయాలి అని సామ్రాట్ అంటారు. ఇక ఇద్దరూ కలిసి ఓ అనాధాశ్రమానికి వెళ్తారు. వాళ్ళందరికీ లంచ్ ప్యాకెట్స్ ను తులసి ఇస్తుంది. ఇదే మీకు నేను ఇస్తానన్న సర్ప్రైజ్ పార్టీ అని తులసి అంటుంది.

Intinti Gruhalakshmi serial
Intinti Gruhalakshmi serial

దివ్య తన ఫ్రెండ్స్ ని తీసుకుని డాన్స్ నేర్చుకోవడానికి ఇంటికి వస్తుంది. అప్పుడే లాస్య అక్కడికి వస్తుంది. ఈమె ఎవరు అని తన ఫ్రెండ్స్ లాస్ అని అడగగానే.. మా డాడీకి సెకండ్ వైఫ్ అని చెబుతుంది. అదేంటి మీ వదినలను పరిచయం చేసినప్పుడు నన్ను కూడా మీ ఫ్రెండ్స్ కి పరిచయం కదా చేయాలి కదా అని లాస్య అంటుంది. పిల్లలు మీరు చెప్పండి వాళ్ళ డాడీ కి నేను సెకండ్ వైఫ్ అంటే తనకి నేనేం అవుతాను అని అంటుంది. వెంటనే తన ఫ్రెండ్స్ పిన్ని అవుతుంది అని అంటారు.

పిన్ని అని పరిచయం చేయాలి కదా ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా మీ అమ్మని నేర్పించలేదా నీకు అని లాస్య దివ్యకి తన ఫ్రెండ్స్ ముందే చివాట్లు పెడుతుంది. ఇక దివ్య వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి డాన్స్ వేస్తుండగా పరంధామయ్య వచ్చి తను కూడా డాన్స్ చేస్తానని ఎవరు గెలుస్తామో చూద్దామని బెట్ట్ వేసుకుంటారు.

ఇక రేపటి ఎపిసోడ్ లో అంకిత ఎప్పుడు లేనిది కొత్తగా ఫ్రిడ్జ్ డోర్ కి తాళం వేశారు ఏంటి అని అంకిత అడుగుతుంది. ఎప్పుడు చూసినా నా ఇల్లు నా ఇల్లు అని ఎగిసి పడతారేంటి.. షటప్ అని అంకిత అనగానే యు షట్ అప్ అని శృతి అంటూ.. కళ్ళు తిరిగి పడిపోతుంది.. మరోవైపు తులసి దేవుడికి హారతి ఇస్తున్న పళ్లెం పడిపోతుంది..


Share

Related posts

కార్తీక్ ను తనవైపు తిప్పుకునే ప్రయత్నంలో మోనిత విజయం సాధిస్తుందా..?

Ram

వైర‌ల్ వీడియో: ఒకే వేదిక‌పై మాస్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టిన ర‌ష్మిక-కృతి శెట్టి!

kavya N

Puri Jagannadh: భార్య‌కు పూరీ జ‌గ‌న్నాథ్ విడాకులు.. ఇదిగో ఫుల్ క్లారిటీ!

kavya N