Intinti Gruhalakshmi: దివ్య వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి డాన్స్ వేస్తుండగా పరంధామయ్య వచ్చి తను కూడా డాన్స్ చేస్తానని ఎవరు గెలుస్తామో చూద్దామని బెట్ట్ వేసుకుంటారు. ఇక పరంధామయ్య దివ్యతో కలిసి డాన్స్ వేయడం ఇల్లంతా పాటలతో హోరెత్తించడం చూసి .. లాస్య కోపంగా వచ్చి ఆ టేప్ రికార్డర్ ను కట్ చేస్తుంది ఎందుకు లాస్య ఆంటీ పాటలు ఆపాలని దివ్య ప్రశ్నిస్తుంది. ఇల్లంతా ఏంటి ఈ గొడవ అసలు ఇది ఇల్ల అంటారా.. ఇంకేమైనా అంటారని.. లాస్య దివ్య వాళ్ళతో గొడవపడుతుంది. సరిగ్గా అప్పుడే నందు బయటనుంచి ఇంట్లోకి వస్తాడు ఏమైంది అని అడగగా.. లాస్య తన వైపు తప్పు లేదన్నట్టుగా ఇంటి పక్క వాళ్ళు మన సౌండ్ కి తట్టుకోలేక వచ్చినాకే కంప్లైంట్ చేశారని నేను వాళ్లకి నచ్చి చెప్పి పంపించాను. ఇక చాలు డాన్స్ లో ఆపమని చెబుతున్న దివ్య వెళ్ళటం లేదు అని చెబుతుంది. అది కాదు డాడీ నేను చెప్పేది వినండి అని దివ్య వాళ్ళ డాడీ కి సంజయ్ ప్రయత్నం చేస్తుంది. కానీ నందు దివ్య మాటలు వినకుండా లాస్ట్ చెప్పినట్టు వినమని చెప్పి నాకు చిరాగ్గా ఉంది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయమని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు..

లాస్య అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇంట్లో వాళ్ళందరూ కలిసి నందుకు ఈ విషయాన్ని చెప్పాలి అని అనుకుంటారు. కానీ పరంధామయ్య ఈ ఇంట్లో ఎప్పటికీ గొడవలు జరుగుతున్నాయి. ఈ సమస్య చెప్పే ఇంకా గొడవలు పెంచడం నాకిష్టం లేదు. అయినా మనందరం సర్దుకుంటే ఈ సమస్య సద్దుమడుగుతుంది అని అంటాడు. నందుకి ఉద్యోగం లేదు ఇంట్లో ఎలా జరుగుతుందని తెలిసి తన్ని ఇంకా ఇబ్బంది పెట్టొద్దు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. అప్పటివరకు ఓపిక పట్టమని పరంధామయ్య అంటారు లాస్య ఆంటీకి అందరం బుద్ధి వచ్చేలాగా రివర్స్ ప్లాన్ వేద్దామని అంకిత, శృతి, అభి, ప్రేమ్ అంటారు. దివ్యకి తులసి ఫోన్ చేస్తుంది ఇంట్లో జరిగిన విషయాలు ఏమీ చెప్పకూడదని దివ్య తులసికి ఇంట్లో జరిగినవి ఏవి చెప్పదు. రేపు జరిగే కాలేజ్ ఫంక్షన్ కి తులసిని రమ్మని చెబుతుంది. తప్పకుండా వస్తాను అని అంటుంది.

అంకిత ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక పరంధామయ్య ఆకలితో బాధపడుతూ ఉంటాడు. అది చూసి ఏమైంది తాతయ్య అని అడుగుతుంది. అయినా నేను మూడు గంటలకు ఒకసారి మిమ్మల్ని ఏదో ఒకటి తినమని చెప్పాను కదా. ఎందుకు తినలేదు. సరే ఉండండి నేను ఇప్పుడే వంటగదిలోకి వెళ్లి ఏదో ఒకటి చేసి తీసుకు వస్తాను అని వండి గదిలోకి వెళ్తుంది. నీ పద్ధతి ఏం బాగోలేదు శృతి.. తాతయ్యని చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా.. ఎందుకు తాతకి కావాల్సినవన్నీ చేసిపెట్టడం లేదు అని అడుగుతుంది. సరే ఇప్పుడు మన ఇద్దరికీ వాదన వద్దు తాతయ్యకి నేను ఏదో ఒకటి చేస్తాను అని వాళ్ల ప్యాకెట్ ఎక్కడ అని అడుగుతుంది.. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయబోతుండగా దానికి తాళం వేసి ఉంటుంది. అంకిత కోపంగా శృతి దగ్గరకు వెళ్ళు ఎప్పుడు లేనిది కొత్తగా ఫ్రిడ్జ్ డోర్ కి తాళం వేశారు ఏంటి అని అంకిత అడుగుతుంది. అప్పుడే లాస్య ను వెళ్లి ఫ్రిడ్జ్ తాళం ఇవ్వమని అడుగుతుంది అంకిత నేను ఇవ్వను అని అంకితకి లాస్య కోపంగా సమాధానం చెబుతుంది..
Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నుండి 2022 లో ఉత్తమ టాప్ 10 ఎపిసోడ్‌లు, రోజువారీ ఎపిసోడ్ సారాంశం రచయితలచే ఎంపిక చేయబడింది
లాస్య మాటలకు కోపం వచ్చిన శృతి ఎప్పుడు చూసినా నా ఇల్లు నా ఇల్లు అని ఎగిసి పడతారేంటి.. షటప్ అని లాస్య అనగానే యు షట్ అప్ అని శృతి అంటూ.. కళ్ళు తిరిగి పడిపోతుంది.. మరోవైపు తులసి దేవుడికి హారతి ఇస్తున్న పళ్లెం పడిపోతుంది.. శృతి ఆరోగ్యం బాగోలేదని తులసికి ఇంట్లో వాళ్ళు చెప్పడంతో తులసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.