తులసి ఇన్విటేషన్ కార్డు ఓపెన్ చేయగానే పరంధామయ్య సామ్రాట్ వల్ల బాబాయ్ సామ్రాట్ క్లాప్స్ కొడతారు.. నీ కళ్ళల్లో ఈ ఆనందం చూడాలని నీకు ఈ సర్ప్రైజ్ అమ్మ అని వాళ్ల మామయ్య అంటాడు.. సరే మావయ్య నేను ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని అందరితో చెబుతాను అని అంటుంది.. తులసి అమ్మ తులసి కాస్త గుర్రాన్ని కట్టేసి ఇక్కడ మాకు స్వీట్ చేసి పెట్టమ్మా అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అంటాడు.. బాబాయ్ అని సామ్రాట్ అంటుండగా.. ఇది నా కోరిక మా వాడి మాటలు ఏం పట్టించుకోబాకు అని తులసిని చూస్తూ ఉంటాడు.. మీరు స్వీట్ చేయడానికి నేను ఒప్పుకోను.. మీతో పాటు నేను కూడా చేస్తాను.. మీ పార్ట్నర్ ని కదా అని సామ్రాట్ అందరినీ నవ్విస్తాడు..!
లాస్య, నందు మళ్ళీ పని గట్టుకుని తులసి వాళ్ళ ఇంటికి వస్తారు.. అనసూయమ్మ వాళ్ళిద్దరిని చూసి కూడా పట్టించుకోనట్టు ఉంటుంది.. అత్తయ్య గారు మనల్ని పట్టించుకునే అంత తీరికలేదు అని లాస్య అంటుంది.. పాడైపోయినా అసలు ఎన్నిసార్లు తుంచేసిన మళ్లీ వస్తూనే ఉంటాయి.. కాస్త ఓపిక పట్టాలి అని అనసూయమ్మ ఇన్ డైరెక్ట్ గా ఉంటుంది.. నువ్వేంటి నాన్న ఇటు వైపు వచ్చావు అమ్మ మీద బెంగ వేసుకున్నావా అని అనసూయమ్మ అడుగుతుంది.. ఆఫీస్ వర్క్ మీద తులసిని కలవడానికి వచ్చాను అని నందు అంటాడు అవునా.. నా మీద ప్రేమతో వచ్చావనుకున్నాను అని అనసూయమ్మ నందుపై సెటైర్ వేస్తుంది.. తులసి ఇంట్లో లేదు ఇక మీరు వెళ్లి రావచ్చు అని అనసూయ అంటుంది.. కట్టుకున్న మొగుడు ఇలాంటి ప్రశ్నలు అడిగితే పర్వాలేదు కానీ వదిలేసిన మొగుడివి ఇలాంటి ఆరాలు అడిగితే బాగోదు నాన్న అని అనసూయమ్మ అడుగుతుంది.. అందులో అభి వచ్చి ఏదో ఫోన్ వస్తే కంగారుగా వెళ్ళింది డాడ్ అని అంటాడు.. మహారాణి కదా.. అదే అత్తయ్య ఈ ఇంటి యజమాని కదా.. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అని లాస్య అంటుంది అదేంటి డాడ్.. గుమ్మం దగ్గరే నేను ఇలా పడిపోయారు అని అభి అంటాడు.. ఆ మాట మీ నానమ్మ అంటుందేమోనని ఎదురుచూస్తున్నామని లాస్య అంటుంది అవును మరి ప్రతిసారి నేను పిలిస్తేనే లోపలికి వస్తున్నారు.. కాస్త మర్యాదగా చూసుకోండి అని అభి తో చెప్పి అనసూయమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఇక తులసి భూమి పూజ ఇన్విటేషన్ కార్డు తీసుకొని ఇంటికి వస్తుంది.. ఆ కార్డులో తులసి పక్కన సామ్రాట్ పేరు.. ఉండడం చూసి లాస్య ఇది నిజంగానే పెళ్లి కార్డు లాగా ఉంది అని అంటుంది అభి తులసి పై ఫైర్ అవుతాడు.. మన ఇంటి పరువు గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు.. అంటూ తులసిని అరుస్తాడు.. అవి కోపంతో ఆ ఇన్విటేషన్ కార్డుని చించేస్తాడు.. దానికి కోపం వచ్చినా పరంధామయ్య అభి అని అంటాడు.. అభి కోపంతో ఇన్విటేషన్ కార్డు ని ముక్కలు చేసి కింద విసిరేస్తాడు.. పరంధామయ్య కోపంతో అభిని కొట్టబోతాడు.. మామయ్య వద్దు అని తులసి అడ్డుపడుతుంది ఇది అభి చేసిన తప్పు కాదు.. తన మనసుని కావాలని ఎవరో విరిచేశారు అని తులసి అంటుంది.. అభి కింద చించేసిన ఇన్విటేషన్ కార్డుని చేత్తో తీస్తుంది..
బాబాయ్ మనం ఈ స్వీట్ ని షాపులో తెచ్చుకొని తింటాను కానీ ఇంత టేస్ట్ గా ఉండదు ఏంటి అని సామ్రాట్ అనగానే ఇది తులసి చేసిన స్వీట్ తను నెయ్యి పంచదారతో పాటు ప్రేమను కూడా కలిపి వండుతుంది అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అంటాడు అంతేనంటావా బాబాయ్ అని సామ్రాట్ అంటాడు.. ఈమధ్య పొట్ట వచ్చేస్తుంది బాబాయ్ స్వీట్లు తినడం తగ్గించేయాలి అని సామ్రాట్ అంటాడు అని వాళ్ళ బాబాయ్ ఉంటాడు.. అయితే ఈ ఇంటికి చక్కగా స్వీట్లు చేసి పెట్టి ఒక ఇంటి మనిషిని కూడా తీసుకురావాలి అని అనగానే.. సామ్రాట్ మౌనంగా ఉండిపోతాడు.. శుభ్రంగా స్వీట్ తింటున్నాము ఇలాంటప్పుడు ఈ విషయాలు ఎందుకు బాబాయ్ అని నందు.. హనీ ని సరిగ్గా చూసుకోవాలని నా బాధ ఆ విషయం నీకు తెలుసు కదా.. బాబాయ్ అని సామ్రాట్ అంటాడు. తులసి లాంటి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి అయితే నీకు ఓకేనా అని వాళ్ళ బాబాయ్ అడుగుతాడు.. అలాంటి వాళ్ళు దొరకాలి కదా అని సామ్రాట్ అంటాడు.. ఆ విషయం నాకు వదిలేయ్ నీకు ఓకేనా అని సామ్రాట్ ని వాళ్ళ బాబాయి అడగగానే సరే అని సామ్రాట్ అంటాడు..