తులసి వాళ్ళ ఇంటికి అభిప్రాయం ఇద్దరూ వస్తారు.. కానీ ప్రేమ్ తో పాటు శృతి రాదు.. శృతి ఎందుకు రాలేదు అని తులసి అడుగుతుంది.. వాళ్ళ అత్తయ్యకు బాగోకపోతే అక్కడ ఉంది అని ఒక సాకు చెప్పి ప్రేమ్ తప్పించుకుంటాడు.. సంగీతం క్లాస్ చెప్పడానికి తులసి వెళ్తుంది.. హనీ క్లాసులోకి రాకుండా దిగాలుగా కూర్చోవడం గమనించిన తులసి ఏమైందమ్మా అని అడుగుతుంది.. రేపు మా స్కూల్లో డాన్స్ కాంపిటీషన్ ఉంది నాకు.. నన్ను కృష్ణుడు గెటప్ వేసుకొని మా టీచర్ రమ్మన్నారు.. నాకు ఆ గెటప్ ఎలా వేసుకోవాలో తెలియడం లేదు అని అంటుంది.. ఇంట్లో మీ వాళ్లంతా ఉన్నారుగా వాళ్ళు హెల్ప్ చేస్తారులే అని అంటుంది తులసి. వాళ్లకి కొనడమే తప్ప రెడీ వేయడం రాదు అని అంటుంది.. మీరు నాకు హెల్ప్ చేస్తాను అంటేనే నేను క్లాస్ లోకి వస్తాను అని అంటుంది అని సరే అని ఒప్పుకుంటుంది తులసి..!
ప్రేమ్ ను వెతుక్కుంటూ శృతి ఇంటికి వెళ్తుంది. ఆంటీ ప్రేమ్ ఎక్కడ అని పక్కింటి ఆమెను అడుగుతుంది శృతి.. మా అమ్మ రమ్మని చెప్పింది అందుకే వెళ్తున్నాను అని చెప్పాడు.. నువ్వు కూడా వాళ్ళ అమ్మ.. దగ్గరే ఉన్నావు అని చెప్పాడు ఏమ్మా ఏమైంది ప్రేమ్ నువ్వు మాట్లాడుకోవడం లేదా.. ఏమైనా గొడవ జరిగిందా.. మీరు విడిపోతున్నారా అంటూ ప్రశ్నలు వేస్తుంది.. ప్రేమ్ దగ్గరకు వెళ్తున్నట్టు నాతో ఒక్కమాట కూడా చెప్పలేదు అని వాళ్ళ కమల అత్తయ్య అక్కడికి వస్తుంది.. ప్రేమ్ ఎలాంటివాడో ఇప్పటికైనా నీకు అర్థం అవుతుందా శృతి తో అంటుంది వాళ్ళ అత్తయ్య..
నందు నువ్వు సామ్రాట్ ని అబ్జర్వ్ చేసావా తులసివైపు అతను అదోలా చూస్తున్నాడు అని అంటుంది. నువ్వు ప్రతి దానికి పేడర్థాలు తీయకు అని అంటాడు.. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఏ విధంగా చూస్తాడో నాకు తెలియదా.. ఆయన చూపులలో చాలా తేడా ఉంది.. నేను బాగా అబ్జర్వ్ చేశాను అని లాస్య చెబుతుంది.. నువ్వు ఏమైనా చెప్పు లాస్య నేను అందుకు ఒప్పుకోను అని అంటాడు నందు..
సామ్రాట్ హనీ నీ కృష్ణుడి గెటప్ లో రెడీ చేయడానికి నాన్న తండాలు పడతాడు.. అప్పుడే నందు లాస్య కూడా అక్కడికి వస్తారు.. లాస్య వచ్చి హెల్ప్ చెయ్యి అని అంటాడు సామ్రాట్.. నాకు మేకప్ వేసుకోవడం వచ్చు కానీ.. వేరొకరికి గెటప్ చేయడం రాదు అని అంటుంది లాస్య.. అంతలో హనీ మీ వల్ల కాదని నాకు తెలిసి నేను తులసి ఆంటీని రమ్మని చెప్పాను అని అంటుంది.. తులసి హనీ ని రెడీ చేయడానికి లోపల తీసుకెళ్తుంది.. అప్పుడు సామ్రాట్ డిసప్పాయింట్ లాస్య అయ్యాను అనగానే.. ఎందుకు సార్ అని లాస్య అడుగుతుంది. నీకు కృష్ణుడు గెటప్ చేయడం లేకపోతె ఎలా ఈ రోజు పిల్లలు చిన్నప్పటినుంచి వాళ్ళ తల్లులు కృష్ణుడి గెటప్ వేస్తున్నారు.. అవును వాళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు మీకు పిల్లలు లేరా అని సామ్రాట్ అడుగుతారు.. నేను పెళ్లికి ముందు నుంచి ఆఫీస్ లో జాబ్ చేసే దానిని వీటి మీద ఇంత కాన్సంట్రేట్ చెయ్యను అని లాస్య అంటుంది..
అంతలో తులసి హనీ కృష్ణుడిగా గెటప్ లో రెడీ చేసి తీసుకొస్తుంది.. భక్త నీకు ఏం కోరిక కావాలో కోరుకో అని హనీ సామ్రాట్ ను అడుగుతుంది.. నిన్ను రెడీ చేసిన మీ తులసి ఆంటీనే డాన్స్ కూడా నేర్పించమని వరం కోరుకుంటాను.. అయ్యో సార్ నాకు డాన్స్ రాదు అని అంటుంది. ఇక హనీ బలవంతం మేరకు డాన్స్ నేర్పించడానికి తులసి ఒప్పుకుంటుంది.. అలా డాన్స్ చేస్తుండగా వెళ్లి సామ్రాట్ కు తలుగుతుంది తులసి.. అలా తనను పడిపోకుండా తులసి పట్టుకున్న సామ్రాట్ ని చూసి నందు గుండె ముక్కలవుతుంది..
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!