Entertainment News Telugu TV Serials

తులసి సామ్రాట్ లది భార్యాభర్తల బంధం..!! రచ్చ రచ్చ చేసిన అభి..!

Share

తులసి, సామ్రాట్ కలిసి చేస్తున్న భూమి పూజ ఫంక్షన్ కి తులసి తన తమ్ముడు వినోద్ కూడా రమ్మని చెబుతుంది తులసి.. తనతో పాటు అమ్మ రాలేదేంటి అని వినోద్ ను అడుగుతుంది తులసి.. వినోద్ వస్తు వస్తూనే నందుతో గొడవ పెట్టుకోవడం చూసి ఇవన్నీ ఇప్పుడు ఎందుకు తమ్ముడు.. పదా లోపలికి వెళ్దామని అంటుంది తులసి.. నీకు చేసినా గాయం నిలువెత్తు నిదర్శనం లా కనిపిస్తుంటే.. చూస్తూ ఎలా మర్చిపోతాను అక్క.. నువ్వు మర్చిపోతావేమో కానీ నీకు చేసిన ద్రోహం మాత్రమే నేను మర్చిపోను.. వాళ్ళని అంత సులువుగా వదిలిపెట్టను అని నందుని చూస్తూ వినోద్ అంటాడు..

తులసి, సామ్రాట్ ఇద్దరు మీడియా కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వస్తారు.. ఎప్పుడూ తెరవనక ఉండే అమ్మ ఈసారి తెర ముందుకు వస్తె ఎంత గుర్తింపు వచ్చింది అని ప్రేమ్ అంటాడు.. అమ్మ మనందరికీ రోల్ మోడల్ ఏమంటావు వదిన అని శృతిని చూస్తూ దివ్య అంటుంది.. అవును ఆడది సమాజంలో ఎదగగలదు.. ఒంటరిగా కూడా బ్రతకగలదు అని ఆంటీ ప్రూవ్ చేసింది అని ప్రేమ్ ని ఉద్దేశిస్తూ శృతి అంటుంది.. సామ్రాట్ మీడియా తో మాట్లాడుతూ.. ఈ మ్యూజిక్ స్కూల్ ద్వారా సంగీతాన్ని మనిషి జీవితంలో ఒక భాగం చేయాలన్న సదుద్దేశంతో మెదలు పెట్టిన ఒక పవిత్ర కార్యం.. ఇది నా ఆలోచన కాదు.. ఒక సామాన్య మహిళ లో ఉద్భవించిన ఆశ.. అందమైన కళ.. తులసి గారు నా బిజినెస్ కి పార్టనర్.. ఇది తులసి గారి కల కాబట్టి ఈ వెంచర్ కు తులసి వనం అని పేరు పెట్టాము అని సామ్రాట్ అంటాడు.. తులసి ఆ పేరు వినగనే చాలా సంతోషిస్తుంది.. తులసి గతంలో నందు చేసిన పని తలుచుకుని బాధపడుతుంది..


తులసి, సామ్రాట్ ఇద్దరు కలిసి హోమం చేస్తారు.. అలా వాళ్ళు హోమం చేస్తుండగా.. పంతులు గారు తులసి, సామ్రాట్ ఉద్దేశిస్తూ.. ఒక విధంగా చెప్పాలంటే వ్యాపార భాగస్వామ్యం అంటే భార్యాభర్తల బంధం లాంటిది.. వావ్ ఏం చెప్పారు పంతులుగారు అని అభి అంటాడు.. సామ్రాట్ గారు మామ్ కి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నారు అని అభి లాస్య ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాడు.. నిన్ను రెచ్చగొట్టించి మీ నాన్న ఇలా మాట్లాడిస్తున్నాడు అని తులసి వాళ్ళ తమ్ముడు వినోద్ అంటాడు.. రేయ్ వాడికి కడుపు మండి ఏదో మాట్లాడితే దానికి నాకు లింకు పడతావ్ ఏంటి అని నందు అంటాడు.. నందు ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాడని అని సామ్రాట్ షాక్ చూస్తాడు.. నందుని లాస్య కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది.. మిగతా విశేషాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం..


Share

Related posts

`య‌శోద‌`కు 50 రోజుల కాల్షీట్స్ ఇచ్చి స‌మంత అన్ని కోట్లు పుచ్చుకుందా?

kavya N

హ‌మ్మ‌య్య‌.. మౌనం వీడిన స‌మంత‌.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్‌!

kavya N

బిగ్ బాస్ సీజన్ 6కి నాగార్జున తీసుకుంటున్న రెమ్యూనరేషన్.. ఎంత అంటే..??

sekhar