Intinti Gruhalakshmi: వారం రోజుల పాటు నుంచి నలుగుతున్న పరంధామయ్య ఇంటికి తిరిగి రావడం ఇవాల్టితో సమాప్తం అయింది. లాస్య తులసి పేరు మీద ఉన్న ఆస్తిని తన పేరు మీదకి రాయించుకుంటుంది. ఇక అటు తిరిగి ఇటు తిరిగి పరంధామయ్య ఆ ఇంట్లో నే ఉండమని అందరూ అడుగుతారు. ఇక తులసి ఈ ఇల్లు నా కారణంగా ముక్కలు అవడం నాకు ఇష్టం లేదు.. అంతా కలిసి ఉండక తప్పదు అన్నట్టుగా మిగతా వారందరికీ సలహా ఇస్తుంది. వాళ్ళ మామయ్య అని కూడా ఆ ఇంట్లో ఉండమని చెబుతుంది..

నందు పరంధామయ్య చేతుల్ని పట్టుకొని వేడుకుంటాడు. నాన్న నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది అని అనగానే.. తులసి ఇక్కడే ఉండి పొమ్మని పరంధామయ్యేది కళ్ళతో సైగ చేస్తుంది ఇక పరంధామయ్య కూడా ఇంట్లోకి వెళ్లిపోతాడు.. తులసి అక్కడి నుంచి బయటే నిలబడి ఉన్న సామ్రాట్ కార్ లో ఎక్కి కూర్చుంటుంది.

సామ్రాట్ తులసి ఇద్దరూ కలిసి వెళ్తున్న కార్ సడన్ గా మధ్యలో ఆగిపోతుంది .కారు స్టార్ట్ అవ్వట్లేదు అండి మెకానిక్ ని పిలవాల్సిందే తులసి గారు.. పదండి మిమ్మల్ని మీ ఇంటి వరకు డ్రాప్ చేస్తాను అని సామ్రాట్ అంటాడు. వద్దులేండి అని తులసి అంటుంది. ఇక ఇద్దరూ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ దారిలో టేప్ రికార్డులో ఇళయరాజ పాటలు వినిపిస్తూ ఉంటాయి. ఆ పాట వింటూ ఇద్దరు అక్కడే రోడ్డు మీద నిలబడి వింటూ ఆస్వాదిస్తూ ఉంటారు. అంతలో ఆ టీ కొట్టు అతను ఆ టేప్ రికార్డులోని ఆ పాటను మార్చేస్తాడు. సామ్రాట్ ఆ టీ కొట్టు అతన్ని తిట్టుకుంటూ ముందుకు అడుగులు వేస్తాడు. ఇళయరాజా కి నేను పెద్ద ఫ్యాన్ని అని అంటాడు. నేను కూడా ఫ్యాన్ అని తులసి అంటుంది. అవునా అయితే నేను ఇళయరాజా గారి పాట లోని పదం ఒకటి చెబుతాను మీరు ఆ పాటను సరిగ్గా గెస్ చేయమని చెబుతాడు. మొదటి ప్రయత్నంలో తులసి ఫెయిల్ అవుతుంది. ఈసారి నేను పల్లవి చెబుతాను మీరు చరణం చెప్పండి అని సామ్రాట్ అంటాడు. ఇక ఇద్దరూ ఆ పాటల పోటీలో పడి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. సామ్రాట్ పల్లవి ఇస్తే తులసి చరణం పాడుతుంది. పల్లవి పూర్తి చేసేలోపే తులసి పాట అందుకొని మళ్ళీ పాడుతుంది.

రేపటి ఎపిసోడ్ లో పరంధామయ్య దగ్గరికి అనసూయమ్మ వచ్చి ఏదో చెబుతుంది. తను చెప్పేది ముగిగానే పరంధామయ్య ఎక్కడి నుంచి వెళ్ళిపోతుండగా.. అనసూయ కళ్ళు తిరిగి పడిపోతుంది. అనసూయ అనసూయ అని పరంధామయ్య తనని పిలుస్తాడు. ఇక స్పృహలోకి వచ్చి చూసేసరికి అనసూయమ్మ పక్కన తులసి ఉంటుంది. తులసి నేను నిన్ను ఒక కోరిక కోరుకుంటాను తీరుస్తావా అని అనసూయమ్మ అడుగుతుంది. ఈ ఇంటికి రమ్మని చెప్పడం తప్ప మీరు ఏం అడిగినా నేను చేస్తాను అని తులసి అంటుంది. నాకు తెలుసమ్మ నువ్వు ఎప్పటికీ రావని.. కానీ అప్పుడప్పుడు వస్తూ ఉండిపో అని తులసిని అనసూయమ్మ అడుగుతుంది. ఇక తులసి అలాంటి నిర్ణయం తీసుకుంటుందో తరువాయి చూద్దాం.