24.2 C
Hyderabad
February 5, 2023
NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసికి సామ్రాట్ స్వీట్ మెమోరీ.. అంతా కలిసిపోయి లాస్య ఓ ఆట ఆడుకున్నారు.!

Share

Intinti Gruhalakshmi: లాస్య ఉదయం నిద్ర లేచి వచ్చేసరికల్లా ఇంట్లో అందరూ కూర్చుని ఉంటారు. పొద్దున్నే అందరూ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టేసారుగా అని లాస్య మనసులో అనుకుంటుంది .వీళ్ళతో నెగిటివ్ గా మాట్లాడుకోకుండా పాజిటివ్ గా నా వైపు తిప్పుకునేలాగా మాట్లాడుకోవాలి అని లాస్య డిసైడ్ అయ్యి.. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు.. ఎలా ఉన్నారు అత్తయ్య గారు అని అనసూయమ్మను అడుగుతుంది. బాగానే ఉన్నాను అని తల ఊపుతూ సమాధానం చెబుతుంది..

Intinti Gruhalakshmi Serial 2december 2022 today 805 episode Highlights
Intinti Gruhalakshmi Serial 2december 2022 today 805 episode Highlights

అత్తయ్య మీకు మందులు వేసుకునే టైం అయింది. తీసుకు వస్తాను ఉండండి అని లాస్య అంటుంది. ఏం అవసరం లేదు నేనే ఇందాక ఇచ్చాను అని పరంధామయ్య అంటాడు. అత్తయ్య మీకు జావా తాగే టైం అయింది. ఉండండి వేడివేడిగా జవపెట్టి తీసుకువస్తాను అని లాస్య అంటుంది. అక్కర్లేదమ్మ ఇందాకే అంకిత చేసి ఇచ్చింది అని పరంధామయ్య మరోసారి పంచ్ వేస్తాడు. అత్తయ్య మీకు కాళ్లు నొప్పులుగా ఉంటాయి కదా.. నేను నొక్కుతాను అని లాస్య దగ్గరికి వస్తుంది.. అక్కర్లేదు అమ్మ ఇప్పుడు దాకా శృతి నొక్కుతూనే ఉంది. మీ అత్తయ్య ఆపమంటేనే శృతి వెళ్లి అక్కడ కూర్చుంది అని పరంధామయ్య మరోసారి లాస్యకి రివర్స్ పంచ్ వేస్తాడు. ఏంటి వీళ్ళందరూ నన్ను కావాలని టార్గెట్ చేసినట్టున్నారు.. నేను ఏం చెప్పినా ఏం చేస్తానన్న వద్దని అంటున్నారు వీళ్ళందరూ కలిసిపోయారు. నన్ను ఒక్కదాన్నే దూరంగా ఉంచి వీళ్లంతా మంచి అని అనిపించుకోవాలని అనుకుంటున్నారు. అలా జరగడానికి వీల్లేదు నేను కూడా వీళ్ళతో పాటే కలిసిపోవాలి అని లాస్య అనుకుంటుంది.

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి రేపటి దిమ్మతిరిపోయే ట్విస్ట్..! 

Intinti Gruhalakshmi Serial 2december 2022 today 805 episode Highlights
Intinti Gruhalakshmi Serial 2december 2022 today 805 episode Highlights

సామ్రాట్ నన్ను ఎందుకు ఇంటికి రమ్మని చెప్పారు అని తులసి వాళ్ళ ఇంటికి వెళ్లి అడుగుతుంది. మీకు ఓ చిన్న విషయం గుర్తుకు చేయాలి. మీరు సక్సెస్ ఫుల్ గా నా కంపెనీలో మేనేజర్ జాబ్ ని వన్ మంత్ కంప్లీట్ చేశారు. అందుకే మీకు స్వీట్ మెమోరీని అందించాలని అనిపించింది. అందుకే ఇక్కడికి పిలిపించాను. అందరి అకౌంట్స్ లోకి వాళ్ళ సాలరీ క్రెడిట్ అయింది. మీకు మాత్రం హనీ చేతుల మీదుగా శాలరీ ఇవ్వాలని అనిపించింది. మీకేం అభ్యంతరం లేదుగా.. హనీ చేతుల మీదుగా తీసుకోవడం అని సామ్రాట్ అంటాడు. అయ్యో అలాంటిది ఏమీ లేదు. ఇవ్వమ్మా అని అని సామ్రాట్ అంటాడు. తులసి హనీ చేతుల నుంచి డబ్బులు తీసుకొని తనకి ముద్దు పెడుతుంది. హనీ నువ్వు వెళ్లి ఆడుకోమ్మా నేను మళ్ళీ పిలుస్తాను అని సామ్రాట్ అంటాడు.

Intinti Gruhalakshmi: లాస్యకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తులసి.. బస్సులో సామ్రాట్ గాలి తుస్..

Intinti Gruhalakshmi Serial 2december 2022 today 805 episode Highlights
Intinti Gruhalakshmi Serial 2december 2022 today 805 episode Highlights

ఇంకేంటండి ఈరోజు ప్లాన్స్ నెక్స్ట్ ఏంటి అని సామ్రాట్ అంటాడు. శాలరీ వచ్చింది కదా ఈ మంత్ అంతా ఈ డబ్బులతో ఎలా ఖర్చు పెట్టాలో ఒక గృహిణిగా నాకు ఈరోజు చాలా టఫ్. మరీ మీరంతా గ్రేట్ అని చెప్పకండి. మా మగాళ్లు కూడా ఏం తీసిపోము అని సామ్రాట్ అంటాడు. అయితే ఈరోజు నా ప్లేస్ లో గృహిణీగా మీరు ఉండి చూడండి ఎంత కష్టమో మీకే అర్థమవుతుంది అని తులసి అంటుంది. అయితే డీల్ ఓకే అని సామ్రాట్ అంటాడు..

అంకిత శృతి ఇద్దరూ వచ్చి అంకుల్ ఇదిగోండి సరుకుల లిస్ట్ రాసామని.. పరంధామయ్య భుజాలు నొక్కుతున్న నందుకు ఇస్తారు. ఏంటమ్మా ఇది అని నందు అంటాడు సరుకుల లిస్ట్ అంకుల్.. మీకే కదా ఇవ్వాల్సింది అని అంకిత అంటుంది. ఆ లిస్టు నందు తీసుకోగానే లాస్య వచ్చి నందు చేతులో నుంచి లిస్ట్ తీసుకుంటుంది. నువ్వు సరుకులు తీసుకురాలేవు కదా నందు.. నీ దగ్గర డబ్బులు లేవు కదా.. ప్రస్తుతం మీకు జాబ్ లేదు కదా అని లాస్య అంటుంది. లాస్య ఆ లిస్ట్ చూసి జీడిపప్పు ఏంటి కేజీ రాశారు. మనది జీడిపప్పు రేంజ్ కాదు పల్లీల రేంజ్ అని లాస్య వెటకారంగా ఉంటుంది.

అప్పుడే లాస్య చేతిలో నుంచి సరుకుల లిస్టును అభి తీసుకుంటాడు. ఏంటి అభి సరుకుల లిస్ట్ అలా తీసుకున్నావు అని అంటుంది. ఎందుకంటే సరుకుల లిస్ట్ నేనే తీసుకు వస్తాను. అందుకే తీసుకున్నాను ఆంటీ అని అభి అంటాడు. ఈ విషయంలో మీరు ఏమంటారు డాడ్ అని అభి అడగగానే.. లాస్య వాళ్ళు తీసుకురావడమే కరెక్ట్. వాళ్లకి కూడా బాధ్యత తెలియాలి కదా అని నందు అంటాడు. ఈ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది రా నందు.. తులసి కోరుకున్న కోరికను ఇప్పటికీ నా మనవళ్లు తీర్చారు. వాళ్ళ నాన్న పరువు పోకుండా కాపాడారు. ఒకసారి ఇలా రండి అంటూ అభి, ప్రేమ్ వాళ్ళిద్దర్నీ దగ్గరికి తీసుకొని హత్తుకుంటాడు పరంధామయ్య.


Share

Related posts

Waltair Veerayya: చిరంజీవి రాజకీయాలకు పనికిరారు పవన్ కళ్యాణ్ పై డైరెక్టర్ బాబీ ఆసక్తి వ్యాఖ్యలు..!!

sekhar

ఆ హీరోతో ఒక్క‌సారైనా న‌టించాలి.. అనుప‌మ కోరిక తీరేనా?

kavya N

చెన్నకేశవరెడ్డి రీరిలీజ్.. మ‌హేశ్‌, ప‌వ‌న్ రికార్డుల‌ను చిత్తు చిత్తు చేసిన బాల‌య్య‌!

kavya N