Intinti Gruhalakshmi: సామ్రాట్ తో కొత్త ప్రాజెక్టు గురించి మాట్లాడడానికి వచ్చిన బెనర్జీ బ్యాక్ గ్రౌండ్ మంచిది కాదని తెలుసుకుని.. తులసి ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేయాలని చెబుతుంది. బెనర్జీ ప్రపోజ్ చేసిన ల్యాండ్ లో అసలు స్కూల్ కట్టడానికి పర్మిషన్ లేదని తులసి చెబుతుంది. ఇక ఆ మాటలకు కోపం వచ్చినా బెనర్జీ తులసి నీ సంగతి చూస్తానని.. నీ అంతు తెలుస్తానని అంటాడు.. సామ్రాట్ కూల్ గా మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని ఒకే ఒక్క మాట అంటాడు. మీ మేనేజర్ చెప్పిన మాటలు విని నా ప్రాజెక్టు మిస్ చేసుకున్నందుకు మీరు కచ్చితంగా ఫీల్ అయ్యేలాగా చేస్తాను. ఇక అదే ప్లేస్ లో స్కూల్ కట్టి మిమ్మల్ని మీ మేనేజర్ తులసిని అక్కడికి పిలుస్తానని బెనర్జీ శబదం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..ఇక తులసి మంచి పని చేసిందని సామ్రాట్ ఆకాశానికి ఎత్తేస్తాడు.. ఇక తులసి ఎప్పట్టి లాగే నేను ఏమి చేయలేదని నా డ్యూటీ నేను చేశానని చెబుతుంది.

ప్రేమ్ శృతి తల తుడుచుకుంటూ ఉండగా తను వెళ్లి తన చేతిలో ఉన్న టవల్ తీసుకొని నేను తుడుస్తానని తనతో అంటాడు. ఈ టైంలో అంకిత కూడా ప్రెగ్నెంట్ అయి ఉంటే బాగుండేది అని శృతి అంటున్న మాటల్ని దూరంగా ఉన్న అంకిత వింటుంది. ఒకేసారి మేమిద్దరం ప్రెగ్నెంట్ అయితే ఇంట్లో డబల్ ధమాకా ఉండేది అని శృతి అంటుంది. అదేం కాదులే ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ కదా తను నీకు హెల్ప్ చేస్తుంది. తను ప్రెగ్నెంట్ అయినందుకు అయినప్పుడు నువ్వు తనకు హెల్ప్ చేయొచ్చు కదా దేవుడు ఇలా ప్లాన్ చేశారేమో అని ప్రేమ్ అంటాడు.. ఫస్ట్ తను ప్రెగ్నెంట్ అయి ఉంటే బాగుండేది అని శృతి అన్నమాట లకు అంకిత కళ్ళల్లో ఆటోమేటిక్ గా నీళ్లు తిరుగుతాయి. అది గమనించిన లాస్య అంకిత నీ మనసులో ఈ బాధ ఉందని నీ కన్నీళ్లే నాకు సలహా ఇచ్చాయి.. ఇక ఏం చేయాలో నేను చూసుకుంటాను కదా.. లేదంటే నన్నే నిన్న వార్నింగ్ ఇస్తావా అని లాస్య అనుకుంటుంది. తులసి ఇంటికి వెళ్ళిపోతుండగా హనీ వస్తుంది.. హనీ ని చూసి తులసి పలకరించగానే.. ఎవరండీ మీరు అని అంటుంది.. ఓకే నా మీద అలిగింది అనుకుంటా అని తులసి అర్థం చేసుకొని.. మీరు ఎవరో నాకు తెలియదు కాకపోతే పలకరించాను అని తులసి అంటుంది.. అవునా మా తులసి ఆంటీ అయితే నన్ను కూడా ప్రతిసారి వచ్చి పలకరించేది.. కానీ మీరు ఆ ఆంటీలాగ లేరు అని అంటుంది.. అదే మా హనీ అయితే నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకునేది.. అనగానే హనీ వెళ్లి తులసిని హత్తుకుంటుంది.. ఏంటి నా మీద అలిగావా అని అంటుంది.. అవును నిజంగానే అలిగాను అంటే ఈ మధ్య మీరు నాతో మాట్లాడటం తగ్గించేశారు. నన్ను పట్టించుకోవడం లేదు నీతో కటీఫ్ మిమ్మల్ని చీకొట్టేస్తున్నాను అని హనీ అంటుంది.. అయితే నీకోసం ఏం చేయాలో చెప్పు చేస్తాను అని తులసి అంటుంది.. అయితే మనందరం కలిసి టెంపుల్ కి వెళ్దాం రెడీ అవ్వండి అంటుంది.. సరే అని సామ్రాట్ కూడా నేను కూడా వస్తాను అని అంటాడు. హనీ పర్మిషన్ ఇస్తుంది.. ఇక తులసి సామ్రాట్ హనీ ముగ్గురు కలిసి గుడికి వెళ్తారు. ఇక అదే గుడిలో ఉన్న పరంధామయ్య ప్రసాదం తీసుకుంటూ.. మరొక కప్పు ప్రసాదం ఇవ్వమని అడుగుతారు. అక్కడ ఉన్న ఆయన పరంధామయ్యను చిదరించుకుంటాడు.. ఇక అనసూయమ్మ దగ్గరకు వెళ్లి
మన కోడలికి మన ఇద్దరం బరువయ్యాము . ఇక మన జీవితాన్ని ఇలాగే గడిపేయాలి.. కానీ మన రెండు పక్షుల్లో ఒక్క పక్షి దూరమైతే ఇంకో పక్షి ఏమైపోతుందో అని భయంగా ఉంది అనసూయ అని పరంధామయ్య అంటున్న మాటలను తులసి సామ్రాట్ వింటారు.. వాళ్ళిద్దరూ అలా బాధపడడానికి ఓ రకంగా తులసినే కారణం.. ఇక ఆ విషయం తెలుసుకొని తను ఏం చేస్తుందో చూడాలి..