తులసి మీడియా ముందుకు వచ్చి తను ఏం కోల్పోయి ఈరోజు ఏ పరిస్థితికి వచ్చిందో మీడియాకి వివరించి చెబుతుంది.. మీరు మా తులసీవనం ప్రాజెక్టుకి సపోర్ట్ చేయండి మీ వంతుగా ఈ ప్రాజెక్టు ప్రజల్లోకి తీసుకువెళ్లండి అని అంటుంది.. మీరు కూడా భోజనం చేసి వెళ్లండి అని తులసి చెబుతుంది ఆ మాటలు విని సామ్రాట్ మీరు కూడా కమర్షియల్ అయిపోయారు అని అంటాడు .. మీడియా వారితో చాలా చక్కగా మాట్లాడిపోయారు.. భోజనం చేయమని చెప్పి వాళ్ళని చక్కగా బుట్టలో వేసుకున్నారు అని అంటాడు సామ్రాట్..
శృతి సామ్రాట్ దగ్గరకి వచ్చి మీ మనసులో ఏ ఉద్దేశం పెట్టుకుని మా ఆంటీకి ఇంత హెల్ప్ చేస్తున్నారు అని శృతి అడుగుతుంది.. చిటికెలో సమాధానం చెప్తాను అన్నారు కానీ ఆగిపోయే ఆలోచిస్తున్నారు అని శృతి అంటుంది.. హెల్ప్ చేయడం తప్ప.. డైరెక్ట్ గా అడుగుతున్నాను మీరు మా ఆంటీ ని ఇష్టపడుతున్నారా అని శ్రుతి తన మనసులో ఉన్న సందేహాన్ని సామ్రాట్ ముందు వ్యక్త పరుస్తుంది.. మీరు చెప్పే సమాధానం చాలా ఊహగానాలకు తెరపడేలాగా చేస్తుంది.. ప్రశ్న ఎవరిదైనా అనుమానాలు ఎవరివైనా నాకు ఓపెన్ గా చెప్పా అవకాశం ఇచ్చారు.. థాంక్యూ నేను ఎలాంటి మోహమలు లేకుండా సమాధానం చెబుతున్నాను అని సామ్రాట్ అంటాడు.. అవును నేను తులసి గారి నీ ఇష్టపడుతున్నాను.. అని సామ్రాట్ అంటాడు..
ఆత్మ అభిమానమే మనిషిగా బ్రతుకుతున్న తులసిని.. జీవితంలో మోసపోయిన కొంగిపోకుండా తనెంటో నిరూపించాలని చూస్తున్న శ్రీ శక్తిగా తులసిని ఇష్టపడుతున్నాను.. పెద్దగా చదువుకోకపోయినా మరో ఆడవాళ్ళకి సాయం చేయాలనుకుంటున్న తనని ఇష్టపడుతున్నాను.. జీవితంలో డబ్బు తప్ప ఇంక వేటి గురించి ఆలోచించను నన్ను మనిషిగా మార్చిన తులిసి ను ఇష్టపడుతున్నాను.. ఇది తప్పా.. ఎందుకు పెడర్థాలు తీస్తున్నారు.. చూడు శృతి లేని క్లారిటీగా చెబుతున్నాను విను.. తులసి గారు కేవలం నా బిజినెస్ పార్టనర్ మాత్రమే.. పైకి ఎదగాలన్న తన ఆరాటానికి నేను సపోర్టుగా నిలబడ్డాన్ని తప్ప అంతకుమించి ఇంకా ఎలాంటి ఉద్దేశం లేదు దయచేసి మా ఇద్దరి మీద మనసులో ఎవ్వరు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు అని సామ్రాట్ అంటారు.. అర్ యు హ్యాపీ అని శృతి అంటుంది.. ఏమీ అనుకోవద్దు. నేనంటే బయట మనిషిని పరిచయం లేని అతనిని.. అనుమానించడంలో తప్పే లేదు కానీ తులసి గురించి మీకు అన్ని తెలుసు.. తులసి గారి క్యారెక్టర్ చాలా గొప్పది..
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!