Intinti Gruhalakshmi: హాస్పిటల్లో తులసిని నందు శృతి విషయమై అరుస్తూ ఉంటాడు. అప్పుడే డాక్టర్స్ తన రూమ్ నుంచి బయటకు వస్తారు. శృతికి ఎలా ఉంది అని అడగగానే.. షి ఇస్ అవుట్ ఆఫ్ డేంజర్ తన కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉంది. మీరు తన ప్రెగ్నెన్సీ గురించి ఎలాంటి కంగారు అవసరం లేదు. నేను మందులు రాశాను.. వాటిని యధాతధంగా వాడండి ..ఇక మీరంతా వెళ్లి పేషెంట్ ని చూడొచ్చు అని డాక్టర్స్ చెబుతారు.

థాంక్యూ డాక్టర్స్ అని చెప్పి నందు లోపలికి వెళ్ళబోతుండగా.. ఒక్క నిమిషం నందగోపాల్ గారు నేను మీతో మాట్లాడి తెల్సుకోవాల్సిన చాలా ఉన్నాయి అని తులసి అంటుంది. ఇందాక ఏమన్నారు తులసికి శృతికి ఇదంతా జరగడానికి నేనే కారణం అన్నారా? ఇప్పుడు చెప్పండి ఇందాక నేను శృతికి ఏమవుతుందని కంగారులో ఉండి మీకు బదులు చెప్పలేకపోయాను. శృతికి ఇదంతా చెరగడానికి కారణం నేను కాదు .. మీ పక్కన ఉన్న గుడ్లగూబ గుంట నక్క కారణం. నేను కాదు.. నన్నే కనక ఇంట్లోకి రాను రాణించి ఉంటే ఇంత జరిగేది కాదు ..దినంతటికీ కారణం మీ భార్యనే అని తులసి అంటుంది.
అయినా వీళ్లేవ్వరు నాకు చెప్పి ఇంట్లోకి రాలేదు. ప్రేమ్ నాకు కూడా కొడుకే . శృతి నుంచి వచ్చే వారసుడు నాకు వారసుడే. కాదు అని అనటానికి మీకు ఎలాంటి హక్కు లేదు. ఏరా ప్రేమ్ నువ్వేమంటావు అని తులసి అడుగుతుంది . మా బిడ్డ మీద పూర్తి హక్కులు నీకేనమ్మ .. ఆ తర్వాతే ఎవరైనా అని ప్రేమ్ అంటాడు. మన ఇద్దరి మధ్య ఒక ఒప్పంద ఉంది. ఆ గడువు లోపు వరకు మీ ప్రవర్తన చూసి ఆ తర్వాత నేను నిర్ణయం తీసుకుంటాను . ఆ విషయం మర్చిపోకండి ఇప్పుడు వెళ్లి శృతిని పలకరించండి అని తులసి నందు లాస్య కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది..
శృతిని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రాగానే అంకిత శృతికి ఏఏ మెడిసిన్స్ ఎప్పుడు వేసుకోవాలో జాగ్రత్తలు చెబుతుంది. అలాగే తులసి ఆంటీ నీకు ఇవ్వమన్నారని గ్లూకోస్ పౌడర్ మరి కొన్ని వస్తువులు ఇస్తుంది. ఉదు నీకు నీరసం అనిపించినప్పుడు తాగమని అంకిత చెబుతుంది. అయినా అవన్నీ ఇవ్వడానికి వీల్లేదని నందు అంటాడు. అంకిత నువ్వు కూడా డాక్టర్ వే కదా తులసి చేత మళ్లీ ఇవన్నీ చెప్పించుకోవడం అవసరమా అని అంటాడు. అంతేకాకుండా ఇకనుంచి తులసి తన లిమిట్స్ లో ఉంటే మంచిదని చెబుతాడు. తులసి ముగ్గురు పిల్లల తల్లి రా అలా వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే మంచిది అని అనసూయమ్మ అంటుంది.
ఇక రేపటి ఎపిసోడ్లో సామ్రాట్ ఏదో ఫైల్ మీద సంతకం పెట్టబోతుండగా సామ్రాట్ గారు ఆగండి అని తులసి అడ్డుపడుతుంది. తన ఎదురుగా ఉన్న క్లైంట్ గురించి ఏదో విషయం చెబుతుంది. ఆ వ్యక్తి తులసిని బెదిరిస్తాడు. ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.