Intinti Gruhalakshmi: దివ్య పెళ్లి చూపులు చూసుకోవడానికి నందు స్నేహితుడు తన కుటుంబంతో కలిసి వస్తాడు. దివ్య పెళ్లి కొడుకుతో నేను పర్సనల్ గా మాట్లాడాలి అని అంటుంది. మీకేం అభ్యంతరం లేదు కదా బాబు అని అనగానే మగాడిని నాకెందుకు అభ్యంతరం అని డేర్ గా సమాధానం చెబుతాడు. అతను దివ్య ఇద్దరూ మాట్లాడుకోవడానికి గార్డెన్ లోకి వెళ్తారు. దివ్య సూటిగా అతని ఒకే ఒక ప్రశ్న వేస్తుంది. భార్యాభర్తల సంబంధం గురించి చెప్పమని అడుగుతుంది . తనకి ఆ విషయం మీద అవాగ్రాహానలేదని అతని మాటల్లో అర్థం చేసుకుంటుంది దివ్య..

ఇక పెళ్ళికొడుకు దివ్య నచ్చేస్తుంది. మా ఇంట్లో వాళ్ళు ఓకే అంటే నాకు ఓకే అని చెబుతాడు. ఇక ఆ పెళ్లి సంబంధం కాదు దివ్య అందరి ముందు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెబుతుంది. దాంతో అక్కడి నుంచి వాళ్ళు లేచి వెళ్ళిపోతారు అసలు ఈ సంబంధం చెడిపోవడానికి తులసినే కారణం దివ్య ను ఈ పెళ్లి చేసుకోవద్దని తులసినే చెప్పుకుంటుంది. ఎక్కడ దివ్య ఈ పెళ్లి చేసుకుంటే ఆ క్రెడిట్ అంతా నాకు వస్తుందని తులసి అనుకుంది. అందుకే ఇలా చేసింది అని లాస్య ఎప్పటి లాగానే తులసి మీద పడి ఏడుస్తుంది.

విక్రమ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతయ్య తన కొడుకుని ఎవరూ పట్టించుకోవడంలేదని.. ముఖ్యంగా రాజ్యలక్ష్మి అసలు వాడిని పట్టించుకోవడమే వదిలేసింది అని మరొక హాస్పటల్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడడానికి వచ్చిన అతను ముందు.. రాజ్యలక్ష్మిని తక్కువ చేసి మాట్లాడుతాడు. ఇక విక్రమ్ కూడా అతని పక్కన కూర్చుని భోజనం చేయమంటే కింద కూర్చుని భోజనం చేస్తాను అని చెబుతాడు. ఇక ఇంకా కోపం వచ్చిన వాళ్ళ తాతయ్య రాజ్యలక్ష్మిని తిడుతుండగా ఆమె అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతుంది.

నన్ను క్షమించు అనవసరంగా ఈ పెళ్లిచూపులు చెడగొట్టుకున్నాను అని దివ్య అంటుంది. కానీ నాకు నిజంగానే అతని మాటలు నచ్చలేదు. అందుకే అందరి ముందు వద్దు అని చెప్పాను అని దివ్య అంటుంది. సరే అని తులసి దివ్యని తీసుకొని రేపటి రోజున ఆ అజయ్ దగ్గరకు తీసుకువెళ్తుంది. అజయ్ మా అమ్మాయి నీకు క్షమాపణ చెబుతుంది అని తులసి ఉంటుంది మీ అమ్మాయి ఏం పెద్ద అందగత్తె కాదు . ఇంతకుముందు నా మొదటి భార్య కూడా ఇలాగే ఉంటే తనకి విడాకులు ఇచ్చి వదిలి చేసుకున్నాను అని అజయ్ చెబుతాడు.

ఏంటి నీకు ఇది రెండో పెళ్ళా.. అవును ఈ విషయం లాస్యకు తెలియదనుకుంటా అని తులసి అనగానే.. తనకి కూడా ఈ విషయం తెలుసు తనకి అన్నీ తెలుసు అయినా కావాలనే ఈ సంబంధం కుదరచడానికి ప్రయత్నించింది అని అజయ్ చెప్పడంతో.. తులసి కోపంగా ఇంటికి వెళుతుంది.

లాస్య అని పెద్దగా అరిచి తన రాగానే ఒక్కటి పీకాలని చెయ్యెత్తుతుంది. అసలు ఏమైంది తులసి అని నందు అడగగా.. దివ్యకి రెండో సంబంధం అబ్బాయితో ఈ పెళ్లి చేయాలని అనుకుంటుంది. లాస్య అని ఉన్న విషయాన్ని కుండబద్దలు కొడుతుంది.