Intinti Gruhalakshmi: లాస్య అందరికీ నువ్వు పెద్ద శత్రువులా కనిపిస్తున్నావు.. ఇంటి పేపర్స్ అన్ని మీ పేరు మీద ఉన్నాయని అంత త్వరగా అందరం ముందు బయట పడాల్సిందికాదు.. ఇంకొన్ని రోజులపాటు ఈ విషయాన్ని నీ దగ్గరే ఇంకొన్నాళ్ళు దాచుకోవాల్సింది అని భాగ్య అంటుంది. చెప్పడం కాదు ఏదో ఒక సలహా చెప్పొచ్చు కదా నీ లాస్య అడుగుతుంది. ఏ మాట అడుగుతానని భయమేస్తోందా అని భాగ్య అంటుంది.

భాగ్య లాస్యకు ఏదో సలహా ఇస్తుంది. ఈ టైం లో నేను ఇంత రిస్క్ చేయను అని లాస్య అంటుంది. అయితే ఇక నీ ఇష్టం అని భాగ్య అనకుండా ఈ ప్లాన్ ఫెయిల్ అయితే నీకు నా మొఖం ఇంకొకసారి చూపించను. అదే సక్సెస్ అయితే మాత్రం నిన్ను అస్సలు వదిలిపెట్టను అని భాగ్య అంటుంది. సరే అయితే కానీ లాస్య అంటుంది. ఇక వెంటనే ఈ ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేస్తాను అని లాస్య మనసులో అనుకుంటుంది.
సామ్రాట్ తులసి ఇద్దరు ఆ రోజుకి షాపింగ్ ముగించుకొని మళ్ళీ బస్సు ఎక్కుతారు. సామ్రాట్ తులసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా.. తులసి తన ఎదురుగా ఉన్న ఒక అమ్మాయిని ఒక రౌడీ రాస్కెల్ తనని టీస్ చేస్తూ ఉంటాడు. బస్సు బ్రేక్ వేసినప్పుడల్లాగా కావాలని తనకి తగులుతూ ఉంటాడు. అది గమనించిన తులసి వాడికి బుద్ధి చెప్పాలని అనుకుంటుంది. కండక్టర్ గారు బస్సు ఆపండి అని తులసి పెద్దగా అనడంతో బస్సు బ్రేక్ వేస్తారు. మళ్ళీ కావాలని వెళ్లి అతను ఆ అమ్మాయికి తగులుతాడు. అందరూ చోద్యం చూస్తున్నట్లు చూస్తున్నారుగా ఇలాంటి వాళ్లకి క్లాప్స్ కొట్టి బుద్ధి చెప్పండి అని తులసి అంటుంది. అందరూ క్లాప్స్ కొట్టగానే ఆ రౌడీ రాస్కెల్ కి అర్థమవుతుంది. తననే అందరూ చూస్తున్నారని తల దించుకుంటాడు. అక్కడి నుంచి దిగేసి వెళ్ళిపోతుండగా.. నీ స్టాప్ వచ్చిన తరువాత దిగమని తులసి అంటుంది. ఇక తులసి బస్ లో నుంచి దిగిన దగ్గర నుంచి తులసిని పొగుడుతాడు సామ్రాట్. ఆ అమ్మాయి మేటర్ చాలా లాజికల్ గా డీల్ చేస్తున్నారు అని సామ్రాట్ అంటాడు.
లాస్య పరంధామయ్య అనసూయమ్మ దగ్గరకు వస్తుంది. నన్ను క్షమించండి అని అంటుంది. చచ్చిన పామును ఇంకా చంపకండి మావయ్య.. ఈ ఇల్లు నా పేరు మీద రాయించుకున్నానని అందరూ నా మీద కోపంగా ఉన్నారు. ఈ క్షణం నుంచి నేను దీని మీద ఉన్న పూర్తి హక్కులను వదులుకుంటున్నను మావయ్య.. మీరు ఎవరి పేరు మీద రాయమంటే వాళ్ళ పేరు మీద రాస్తాను. ఇది మీ కష్టార్జితం మావయ్య అని లాస్య కన్నీళ్లు పెట్టుకుంటుంది.
ఈ ఆస్తి మీద ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తో ఈ పని చేశాను మావయ్య. ఈ ఇంట్లో దేని మీద నాకు ఆశ లేదు. నందు కూడా నన్ను సీరియస్ గా తీసుకోలేదు. అందుకే ఇలా చేశాను. తులసి కి నాకు ఎప్పుడు ప్రేమ లేదు బంధం లేదు కానీ గౌరవం మాత్రం ఉండేది కానీ విచిత్రం ఏమిటో తెలుసా.. మన ఇద్దరం కలిసే ఉన్నా కానీ మన ఇద్దరి మధ్య ప్రేమ లేదు గౌరవం లేదు. లోకం దృష్టిలో మాత్రం నువ్వు నేను భార్యాభర్తలం. నాలుగు గోడల మధ్య నువ్వెవరో నేనెవరో.. ఎలాంటి బంధము లేదు అని నందు అంటున్న మాటలను తులసి వింటుంది..