Intinti Gruhalakshmi: తులసి ఇంట్లోకి సరుకులు తీసుకుని వస్తుంది. ఏంటి ఈ సరుకులు అని లాస్య ప్రశ్నిస్తుంది.. నువ్వు సరుకులు తీసుకురావాల్సిన అవసరం లేదు అని నందు అంటాడు. నా వాళ్ళు ఈ ఇంట్లో పస్తులు ఉండడం నాకు ఇష్టం లేదు అని తులసి అంటుంది.. అమ్మ అంకిత నాకు ఒక కాఫీ పెట్టి ఇవ్వు అని తులసి అడుగుతుంది. నందుకి ఏమీ అర్థం కాక వాళ్ళెవరు ఎందుకు కాఫీ పెట్టడానికి వెళ్లడం లేదా అర్థం కాదు. సారీ ఆంటీ వంటగదిలోకి ఎవరు వెళ్లినా కానీ ఒట్టి చేతులతో తిరిగి రావాల్సిందే అని అంటుంది. అదేంటి అని నందు అంటాడు.. వంటగది లో రాక్స్ కి ఫ్రిజ్ కి లాస్య ఆంటీ తాళం వేసిందని శృతి చెబుతుంది.. ఇంట్లో ప్రతి ఒక్కరూ లాస్య రెస్ట్రిక్షన్స్ మీద బతుకుతున్నారు అని తులసి నందుకు అర్థమయ్యేలాగా చెబుతుంది..

అవును అంకుల్ మొన్న తాతయ్య గారు పాలు లేక ఒట్టు డికాషన్ తో ఉండాల్సి వచ్చింది అని శృతి అంటుంది. నిన్న రాత్రి తాతయ్య గారికి షుగర్ డౌన్ షుగర్ డౌన్ అయితే లాస్య ఆంటీ దగ్గరకు వెళ్లి రాక కీస్ ఇవ్వమంటే ఇవ్వలేదు అని అంకిత చెబుతుంది. ఇక ఇంట్లో నా వాళ్ళు ఎవరూ పస్తులు ఉండడానికి వీలులేదని మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే వరకు ఈ ఇంటికి నేను సరుకులు తీసుకువస్తూనే ఉంటాను ఒక విధంగా మిమ్మల్ని దెప్పిపడేస్తూనే ఉంటాను మీరు అవునన్నా కాదన్నా కూడా నేను సరుకులు తెచ్చి తీరతాను అని తులసి గట్టిగా సమాధానం చెబుతుంది ఇక దాంతో నందు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..
ఇక లాస్య బండారం మొత్తం తెలుసుకున్న నందు లాస్య పై చిందులు తొక్కుతాడు. నా వెనకమాలే ఉండి నన్ను వెన్నుపోటు పొడుస్తామని నేను కలలో కూడా ఊహించలేకపోయాను. బయట వాళ్ళు వచ్చి మన ఇంట్లో జరుగుతుంది. తులసి చెబుతుంటే నేను ఆశ్చర్యపోయాను. తులసి దగ్గర నన్ను డౌన్ చేయడానికి నువ్వు ఇదంతా చేశావు అని నందు అరుస్తాడు.
తులసి ఇంటికి వెళ్ళగానే సామ్రాట్ ఫోన్ చేస్తాడు మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. మీరు ఫోన్ చేస్తే నా మనసు కాస్త కుదుటపడుతుంది అని తులసి అంటుంది.. కానీ నేను మాత్రం మీకు మరొక ప్రాబ్లం సృష్టించడానికి ఫోన్ చేశాను అని చెబుతాడు .లాస్య మనం రిజెక్ట్ చేసిన బెనర్జీ దగ్గర ఆ స్కూల్ ప్రాజెక్ట్ తీసుకుంది. ఇక నందు కూడా ఆ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అవుతున్నాడు అని సామ్రాట్ చెబుతాడు. వెంటనే ఈ విషయాన్ని నేను నందికి చెబుతాను. కచ్చితంగా ఈ విషయం ద్వారా నా ఫ్యామిలీకి చెడు జరుగుతుంది. లాస్య వల్ల నా కుటుంబం వాళ్లు ఆపదలో పడతారు అలా జరగడానికి వీల్లేదు. నా కుటుంబం కోసమైనా సరే లాస్య నందు ఇద్దరూ ఆ బెనర్జీ ప్రాజెక్టు టేకప్ చేయకుండా చేస్తాను అని తులసి నందు వాళ్ళ ఇంటికి ఇంటికి బయలుదేరుతుంది. ఇక అదే విషయాన్ని తులసి నందుకు చెబుతుంది. కానీ నందు తులసి మాటలు లెక్కచేయకుండా ఆ ప్రాజెక్టు తీసుకోవడానికి ఒప్పుకునే విధంగా మాట్లాడుతాడు. నువ్వు కావాలని సామ్రాట్ కి సపోర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నావు అని తులసినే తప్పు పడతాడు నందు. ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.